Telugu Global
NEWS

సపోర్ట్‌ లేకుండా 50 మీటర్లు నడువు- జేసీకి పల్లె కౌంటర్

అనంతపురం జిల్లాలో టీడీపీ అగ్రనేతలు ఒకరిపై ఒకరు బహిరంగంగానే విమర్శలు చేసుకుంటున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి, పల్లె రఘునాథరెడ్డి మధ్య వివాదం ముదిరింది. పుట్టపర్తి నియోజకవర్గంలో తొలి నుంచి జేసీ కుటుంబం వేలు పెడుతోంది. అక్కడ తన అనుచరులకు టికెట్లు ఇప్పించుకోవాలని ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా వీలు చిక్కినప్పుడల్లా మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డిపై జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ విమర్శలకు పల్లె రఘునాథరెడ్డి మరింత తీవ్రంగా స్పందించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి […]

సపోర్ట్‌ లేకుండా 50 మీటర్లు నడువు- జేసీకి పల్లె కౌంటర్
X

అనంతపురం జిల్లాలో టీడీపీ అగ్రనేతలు ఒకరిపై ఒకరు బహిరంగంగానే విమర్శలు చేసుకుంటున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి, పల్లె రఘునాథరెడ్డి మధ్య వివాదం ముదిరింది. పుట్టపర్తి నియోజకవర్గంలో తొలి నుంచి జేసీ కుటుంబం వేలు పెడుతోంది. అక్కడ తన అనుచరులకు టికెట్లు ఇప్పించుకోవాలని ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా వీలు చిక్కినప్పుడల్లా మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డిపై జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

ఈ విమర్శలకు పల్లె రఘునాథరెడ్డి మరింత తీవ్రంగా స్పందించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి తన గురించి, తన భార్య గురించి చేసిన వ్యాఖ్యలు సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా, నీచంగా, ఘోరంగా, హీనంగా ఉన్నాయన్నారు. చనిపోయిన తన భార్యపై జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడడాన్ని కనీసం ఆయన కుటుంబంలోని ఆడవారైనా హర్షిస్తారా అని ప్రశ్నించారు.

తండ్రిని, అన్నను అడ్డుపెట్టుకుని రాజకీయం చేసుకున్న వ్యక్తి జేసీ ప్రభాకర్ రెడ్డి అని విమర్శించారు.తాను మాత్రం సున్నా నుంచి మొదలుపెట్టి పైకి వచ్చానన్నారు. విద్యాసంస్థలు స్థాపించి వేల మందికి ఉద్యోగాలు ఇచ్చి లక్షల మందికి చదవులు చెప్పిన ఘనత తనదన్నారు. తనకు ఎలాంటి కుటుంబ రాజకీయ నేపథ్యం లేకున్నా అనేక పదవులు నిర్వహించానని.. జీరో నుంచి వచ్చి హీరో అయిన వ్యక్తిని తాననన్నారు.

పార్టీ నుంచి బహిష్కరణకు గురైన నేతల ఇళ్లకు వెళ్లి భోజనాలు చేసి, అక్కడ కూర్చుని తనపై నీచంగా ఎలా మాట్లాడుతారని ప్రశ్నించారు. తాడిపత్రిలో తనకూ బలం ఉందని.. కానీ మరొకరి నియోజకవర్గంలో వేలు పెట్టకూడదన్న పార్టీ నిర్ణయానికి కట్టుబడి మౌనంగా ఉన్నానన్నారు. జేసీ మాత్రం జిల్లాలో మొత్తం టీడీపీ నేతలను అవమానించేలా మాట్లాడుతున్నారన్నారు. నిన్నలేక మొన్న పార్టీలోకి వచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్డికి.. 28ఏళ్లుగా పార్టీలో ఉన్న తమ గురించి మాట్లాడే అర్హత ఎక్కడుందని రఘునాథ్‌ రెడ్డి ప్రశ్నించారు.

తనకు టికెట్‌ రాదని జేసీ ప్రచారం చేస్తున్నారని.. జేసీ ప్రభాకర్ రెడ్డేకే 200 శాతం ఈసారి టికెట్ రాదన్నారు. అటుఇటు మనుషుల సపోర్టు లేకుంటే కనీసం 50 మీటర్లు కూడా నడవలేని వ్యక్తి ప్రభాకర్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక బఫూన్, ఒక జోకర్ అని జిల్లాలో అందరూ అంటున్నారన్నారు. కోతి కల్లు తాగినట్టుగా జేసీ తీరు ఉందన్నారు. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ అయిన వెంటనే జగన్‌ దయతో చైర్మన్‌ అయ్యానని చెప్పిన వ్యక్తి జేసీ ప్రభాకర్ రెడ్డి అని.. ఆరోజే అతడికి టీడీపీ పట్ల ఎంత గౌరవం ఉందో అర్థమైపోయిందన్నారు..

First Published:  15 May 2022 6:05 AM GMT
Next Story