Telugu Global
NEWS

బక్వాస్ జుమ్లా పార్టీ వాళ్లు.. వ‌చ్చారు.. తిన్నారు.. పోయారు..

ఎన్డీఏని ఎన్పీఏ అంటూ ఇటీవల పంచ్ లు విసిరిన కేటీఆర్.. తాజాగా బీజేపీకి కూడా కొత్త నిర్వచనం చెప్పారు. బక్వాస్ జుమ్లా పార్టీ అంటూ సెటైర్లు వేశారు. ఎనిమిదేళ్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, తెలంగాణకు ఏమీ ఇవ్వలేదని అన్నారాయన. అమిత్ షా తెలంగాణ పర్యటన అనంతరం ట్విట్టర్లో కేటీఆర్ స్పందించారు. తెలంగాణలో పొలిటికల్ టూరిజం సీజన్ కొనసాగుతోందని ట్వీట్ చేశారు కేటీఆర్. మరో టూరిస్ట్ వచ్చారు, తిన్నారు, తాగారు, పోయారు.. అంటూ అమిత్ షా పర్యటనపై సెటైర్లు […]

బక్వాస్ జుమ్లా పార్టీ వాళ్లు.. వ‌చ్చారు.. తిన్నారు.. పోయారు..
X

ఎన్డీఏని ఎన్పీఏ అంటూ ఇటీవల పంచ్ లు విసిరిన కేటీఆర్.. తాజాగా బీజేపీకి కూడా కొత్త నిర్వచనం చెప్పారు. బక్వాస్ జుమ్లా పార్టీ అంటూ సెటైర్లు వేశారు. ఎనిమిదేళ్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, తెలంగాణకు ఏమీ ఇవ్వలేదని అన్నారాయన. అమిత్ షా తెలంగాణ పర్యటన అనంతరం ట్విట్టర్లో కేటీఆర్ స్పందించారు.

తెలంగాణలో పొలిటికల్ టూరిజం సీజన్ కొనసాగుతోందని ట్వీట్ చేశారు కేటీఆర్. మరో టూరిస్ట్ వచ్చారు, తిన్నారు, తాగారు, పోయారు.. అంటూ అమిత్ షా పర్యటనపై సెటైర్లు పేల్చారు. బక్వాస్ జుమ్లా పార్టీగా.. బీజేపీ తన పేరుని సార్థకం చేసుకుందంటూ మండిపడ్డారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు అమిత్ షా హాజరయ్యారు. రాష్ట్రంలో అవినీతి సర్కారుని గద్దె దించాలంటూ ఆయన పిలుపునిచ్చారు. అమిత్ షా పర్యటన నేపథ్యంలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలాయి. షా.. తెలంగాణకు వచ్చే సమయంలో ఆయనకు 27 ప్రశ్నలు సంధిస్తూ ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు మంత్రి కేటీఆర్. తన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఏ మొహం పెట్టుకుని తెలంగాణ గడ్డపై అడుగు పెడుతున్నారంటూ విరుచుకుపడ్డారు. ఆయన పర్యటన పూర్తయిన తర్వాత ఇప్పుడు మరోసారి స్పందించారు. పొలిటికల్ టూరిస్ట్ లంటూ బీజేపీ నాయకుల్ని విమర్శించారు. వచ్చారు, తిన్నారు, పోయారంటూ అమిత్ షా పర్యటన వల్ల రాష్ట్రానికి జరిగిన ఉపయోగం ఏంటని ప్రశ్నించారు. ఎనిమిదేళ్లుగా తెలంగాణను పట్టించుకోలేదని, ఇప్పుడు కూడా అమిత్ షా రాక, పోక తప్ప ప్రజలకు ఉపయోగం ఏదీ లేదని చెప్పారు.

First Published:  15 May 2022 1:13 AM GMT
Next Story