Telugu Global
NEWS

అమిత్ షావి అబద్దాల రాజకీయాలు -కేటీఆర్ ధ్వ‌జం

తెలంగాణ ప్రభుత్వం పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన ఆరోపణల పట్ల రాష్ట్రమంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమిత్ షా మాట్లాడిన దాంట్లో ఒక్క మాట కూడా నిజం లేదని ఆయన అబ‌ద్దాల బాద్ షా అని కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు. తెలంగాణ భ‌వ‌న్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ నీళ్ళు, నిధులు, నియామకాలపై అమిత్ షా ప్రజలను పక్కదోవపట్టించే పరయత్నం చేశారని కేటీఆర్ అన్నారు. కేంద్రానికి ప‌న్నుల రూపంలో తెలంగాణ రాష్ట్రం క‌ట్టింది 3 […]

అమిత్ షావి అబద్దాల రాజకీయాలు -కేటీఆర్ ధ్వ‌జం
X

తెలంగాణ ప్రభుత్వం పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన ఆరోపణల పట్ల రాష్ట్రమంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమిత్ షా మాట్లాడిన దాంట్లో ఒక్క మాట కూడా నిజం లేదని ఆయన అబ‌ద్దాల బాద్ షా అని కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు. తెలంగాణ భ‌వ‌న్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ నీళ్ళు, నిధులు, నియామకాలపై అమిత్ షా ప్రజలను పక్కదోవపట్టించే పరయత్నం చేశారని కేటీఆర్ అన్నారు.

కేంద్రానికి ప‌న్నుల రూపంలో తెలంగాణ రాష్ట్రం క‌ట్టింది 3 ల‌క్ష‌ల 65 వేల 797 కోట్ల రూపాయలు కాగా, తిరిగి వ‌చ్చింది కేవ‌లం 1ల‌క్షా 68 వేల కోట్లు మాత్ర‌మే అని చెప్పిన కేటీఆర్ రాజ్యాంగం ప్ర‌కారం, ఫైనాన్స్ క‌మిష‌న్ ప్ర‌కారం కేంద్రం నిధులు ఇస్తోంది. కేంద్రం నుంచి తెలంగాణ‌కు అద‌నంగా ఒక్క రూపాయి కూడా రాలేదన్నారు.

బీజేపీ నాయకులు చేస్తున్న అవినీతి ఆరోపణలు దొంగే దొంగా దొంగా అన్నట్టున్నాయని, ముఖ్యమంత్రి పదవి కోస‍ం వారి అధిష్టానం 2500 కోట్ల రూపాయలు అడిగినట్టు కర్నాటకకు చెందిన బీజేపీ నాయకుడే చెప్పాడని కేటీఆర్ గుర్తు చేశారు.

బీజేపీకి క్షేత్రస్థాయిలో కనీస బలం లేదని 2018 ఎన్నికల్లో 108 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయిన విషయాన్ని వాళ్ళు మర్చిపోతున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

ఈ 8 ఏండ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ కోసం ఏం చేసిందో చెప్పాల‌ని 27 ప్ర‌శ్న‌ల‌తో ఓ లేఖ రాశాను. దానికి జవాబు లేదు. అమిత్ షా ఆ విషయంపై ఒక్క మాట మాట్లాడలేదు. నిజాలు మాట్లాడాలని చెబితే నిజాం గురించి చెప్తాడు. నిజాంను ఆయ‌న వార‌సులు, మనవండ్లు త‌లుచుకుంటున్నారో లేదో.. కానీ బీజేపీ నాయ‌కులు మాత్రం నిరంత‌రం త‌లుచుకుంటున్నార‌ని కేటీఆర్ అన్నారు.

First Published:  15 May 2022 6:34 AM GMT
Next Story