Telugu Global
Cinema & Entertainment

సర్కారువారి పాట 3 రోజుల వసూళ్లు

మహేష్ హీరోగా నటించిన సర్కారువారి పాట సినిమా సక్సెస్ ఫుల్ గా 3 రోజుల రన్ పూర్తి చేసుకుంది. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 36 కోట్ల రూపాయల షేర్ సాధించిన ఈ సినిమా, 3 రోజుల్లో 61 కోట్ల 54 లక్షల రూపాయల షేర్ సాధించింది. అటు ఓవర్సీస్ లో ఈ సినిమా 1.5 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసింది. ట్రేడ్ అంచనా ప్రకారం ఈ సినిమా ఈ వీకెండ్ పూర్తయ్యేసరికి 60శాతం రికవరీ అవుతుంది. […]

సర్కారువారి పాట 3 రోజుల వసూళ్లు
X

మహేష్ హీరోగా నటించిన సర్కారువారి పాట సినిమా సక్సెస్ ఫుల్ గా 3 రోజుల రన్ పూర్తి చేసుకుంది. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 36 కోట్ల రూపాయల షేర్ సాధించిన ఈ సినిమా, 3 రోజుల్లో 61 కోట్ల 54 లక్షల రూపాయల షేర్ సాధించింది. అటు ఓవర్సీస్ లో ఈ సినిమా 1.5 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసింది.

ట్రేడ్ అంచనా ప్రకారం ఈ సినిమా ఈ వీకెండ్ పూర్తయ్యేసరికి 60శాతం రికవరీ అవుతుంది. మిగతా 40శాతం రికవరీ అవ్వాలంటే మరో వీకెండ్ రావాల్సి ఉంటుంది. సో.. వచ్చే వారాంతానికి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 3 రోజుల్లో వచ్చిన షేర్లు ఇలా ఉన్నాయి.

నైజాం – రూ. 22.48 కోట్లు
సీడెడ్ – రూ. 7.38 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 7.34 కోట్లు
ఈస్ట్ – రూ. 5.39 కోట్లు
వెస్ట్ – రూ. 3.64 కోట్లు
గుంటూరు – రూ. 6.80 కోట్లు
నెల్లూరు – రూ. 2.30 కోట్లు
కృష్ణా – రూ. 3.75 కోట్లు

First Published:  15 May 2022 7:48 AM GMT
Next Story