Telugu Global
Cinema & Entertainment

పూజాహెగ్డే పార్టీ సాంగ్ రెడీ

వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేషన్లో అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ‘ఎఫ్3’ కంప్లీట్ కమర్షియల్ ప్యాకేజీ. నాన్ స్టాప్ నవ్వులతో పాటు తమన్నా, మెహ్రీన్, సోనాల్ చౌహాన్ రూపంలో ఎఫ్3కి అదిరిపోయే గ్లామర్ కూడా వుంది. అంతేకాదు గ్లామరస్ క్వీన్ పూజా హెగ్డే పార్టీ సాంగ్ లో అలరించింది. మే 17న విడుదల కానున్న ఎఫ్3 ‘లైఫ్ అంటే ఇట్లా వుండాలా” పాట.. పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్ అవుతుందని యూనిట్ అంటోంది. ఈ సందర్భంగా […]

పూజాహెగ్డే పార్టీ సాంగ్ రెడీ
X

వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేషన్లో అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ‘ఎఫ్3’ కంప్లీట్ కమర్షియల్ ప్యాకేజీ. నాన్ స్టాప్ నవ్వులతో పాటు తమన్నా, మెహ్రీన్, సోనాల్ చౌహాన్ రూపంలో ఎఫ్3కి అదిరిపోయే గ్లామర్ కూడా వుంది. అంతేకాదు గ్లామరస్ క్వీన్ పూజా హెగ్డే పార్టీ సాంగ్ లో అలరించింది.

మే 17న విడుదల కానున్న ఎఫ్3 ‘లైఫ్ అంటే ఇట్లా వుండాలా” పాట.. పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్ అవుతుందని యూనిట్ అంటోంది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ .. సిసలైన పార్టీ పోస్టర్ గా నిలిచింది. పూజా హెగ్డే, వెంకటేష్, వరుణ్ తేజ్‌ జిగేల్ అనిపించే పార్టీవేర్‌లో కనిపించారు. బ్లాక్ అండ్ బ్లాక్ అవుట్ ఫిట్ లో స్పెషల్ పార్టీ సాంగ్ కి తగ్గట్టు మెరిశారు.

దేవిశ్రీ ప్రసాద్ ఈ పార్టీ సాంగ్ కోసం క్యాచి ట్యూన్ చేశాడు. ఈ పార్టీ సాంగ్ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందట. ఎఫ్3 స్టార్ కాస్ట్ అంతా కనిపించేబోయే ఈ పాట ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్‌ లా ఉంటుందట. ఈ పార్టీ సాంగ్ ని చిత్ర యూనిట్ ప్రకటించినప్పటి నుండి.. అందరిలోనూ ఆసక్తిపెరిగింది.

గతవారం విడుదలైన ఎఫ్ 3 ట్రైలర్ ప్రేక్షకులను అలరిస్తోంది. 20 మిలియన్లకు పైగా వ్యూస్ తో గత 6 రోజులుగా యూట్యూబ్‌లో ఎఫ్ 3 ట్రైలర్ ట్రెండింగ్‌లో ఉంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా, నవ్వులు పంచడానికి మే 27న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కానుంది.

First Published:  15 May 2022 7:54 AM GMT
Next Story