Telugu Global
Cinema & Entertainment

6 నెలల్లో భూమిపూజ చేస్తాడంట

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు అధ్యక్షుడిగా ఎంపికైన తర్వాత మంచు విష్ణు మళ్లీ ప్రెస్ మీట్ పెట్టలేదు. అసోసియేషన్ అప్ డేట్స్ ఇవ్వలేదు. మరీ ముఖ్యంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేన్ భవంతి, ఫించన్లు, హెల్త్ ఇన్సూరెన్స్ లాంటి కీలకమైన అంశాలపై ఎలాంటి అప్ డేట్ లేదు. ఎట్టకేలకు ఈ అంశాలపై స్పందించాడు విష్ణు. 6 నెలల్లో మా బిల్డింగ్ కు భూమిపూజ చేస్తానంటున్నాడు. “మా సభ్యులకు ఎఐజీ హాస్పిటల్స్ వారు ఫ్రీ హెల్త్ చెకప్స్ చేశారు. సెవెన్ […]

6 నెలల్లో భూమిపూజ చేస్తాడంట
X

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు అధ్యక్షుడిగా ఎంపికైన తర్వాత మంచు విష్ణు మళ్లీ ప్రెస్ మీట్ పెట్టలేదు. అసోసియేషన్ అప్ డేట్స్ ఇవ్వలేదు. మరీ ముఖ్యంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేన్ భవంతి, ఫించన్లు, హెల్త్ ఇన్సూరెన్స్ లాంటి కీలకమైన అంశాలపై ఎలాంటి అప్ డేట్ లేదు. ఎట్టకేలకు ఈ అంశాలపై స్పందించాడు విష్ణు. 6 నెలల్లో మా బిల్డింగ్ కు భూమిపూజ చేస్తానంటున్నాడు.

“మా సభ్యులకు ఎఐజీ హాస్పిటల్స్ వారు ఫ్రీ హెల్త్ చెకప్స్ చేశారు. సెవెన్ స్టార్ ఫెసిలిటీస్ తో మాకు సేవలందించారు. డా.నాగేశ్వర రెడ్డి గారు ప్రపంచవ్యాప్తంగా పేరొందిన వారు. మా సభ్యులందరూ బెనిఫిట్ పొందుతున్నారు. మరో ఆరునెలల లోపే మా బిల్డింగ్ కి భూమి పూజ చేస్తాము. మా‌ సభ్యుల వెల్పేర్, హెల్త్ నా ప్రధాన కర్తవ్యం. సినిమా టెక్కెట్ రేట్ల విషయంలో నేను మాట్లాడలేదని విమర్శించారు. కానీ నేడు టిక్కెట్ రేట్ల వల్ల ఇబ్బందులు అంటున్నారు. ప్రభుత్వ సహకారం ఉంది‌ కాబట్టి, ‌పెంపు దేనికి అవసరం అనేది ఇండస్ట్రీ డిబేట్ చేసుకోవాలి. మా సభ్యత్వం కు సంబంధించి స్ట్రిక్ట్ రూల్స్ పెట్టాం”

ఇలా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పై స్పందిస్తూనే, పెంచిన టికెట్ రేట్లపై తన అభిప్రాయాన్ని వ్యక్తంచేశాడు మంచు విష్ణు. ఈ సంగతి పక్కనపెడితే, ఆయన ఉన్నఫలంగా ఇలా ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటి? ఎలాంటి అప్ డేట్ లేకపోయినా మీడియా ముందుకు ఎందుకు వచ్చారు?

దీనికి నెటిజన్ల నుంచి ఓ బలమైన సమాధానం వినిపిస్తోంది. రీసెంట్ గా జీవిత రాజశేఖర్ ప్రెస్ మీట్ పెట్టారు. అందులో ఆవిడ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో కూడా ప్రకాష్ రాజ్ బరిలో నిలబడతారని ప్రకటించారు. దీంతో మంచు విష్ణు అలెర్ట్ అయ్యారడని, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అప్ డేట్స్ పై ప్రెస్ మీట్ పెట్టాడని అంటున్నారు చాలామంది.

First Published:  15 May 2022 7:53 AM GMT
Next Story