Telugu Global
National

చింతన్ శిబిర్ లో కీలక నిర్ణయాలు.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50శాతం పదవులు

కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళన మొదలైంది. చింతన్ శిబిర్ లో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. పార్టీకి ఎలాగైనా జవసత్వాలు కూడగట్టేందుకు అధిష్టానం ప్రయత్నిస్తోంది. రాజ‌స్థాన్‌లోని ఉదయ్‌ పూర్‌ లో జరుగుతున్న చింతన్‌ శిబిర్‌ ఈరోజుతో ముగుస్తుంది. తొలి రెండు రోజుల్లోనే దాదాపుగా కొన్ని కీలక నిర్ణయాలను నేతలు ఆమెదించారు. సమాజంలో అన్ని వర్గాలకూ మళ్లీ చేరువ కావాలంటే పార్టీలో సోషల్‌ ఇంజనీరింగ్‌ ఉండాలని సామాజిక, న్యాయ కమిటీ తెలపడంతో.. అధినాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ విభాగాల్లో ఎస్సీ, […]

చింతన్ శిబిర్ లో కీలక నిర్ణయాలు.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50శాతం పదవులు
X

కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళన మొదలైంది. చింతన్ శిబిర్ లో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. పార్టీకి ఎలాగైనా జవసత్వాలు కూడగట్టేందుకు అధిష్టానం ప్రయత్నిస్తోంది. రాజ‌స్థాన్‌లోని ఉదయ్‌ పూర్‌ లో జరుగుతున్న చింతన్‌ శిబిర్‌ ఈరోజుతో ముగుస్తుంది. తొలి రెండు రోజుల్లోనే దాదాపుగా కొన్ని కీలక నిర్ణయాలను నేతలు ఆమెదించారు. సమాజంలో అన్ని వర్గాలకూ మళ్లీ చేరువ కావాలంటే పార్టీలో సోషల్‌ ఇంజనీరింగ్‌ ఉండాలని సామాజిక, న్యాయ కమిటీ తెలపడంతో.. అధినాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ విభాగాల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు 50 శాతం పదవులు కేటాయించాలని నిర్ణయించింది.

ఎలక్షన్ కమిటీ రద్దు..
కాంగ్రెస్ లో అసమ్మతి నేతలు కొంతకాలంగా ఎలక్షన్ కమిటీని రద్దు చేయాలని కోరుతున్నారు. చింతన్ శిబిర్ లో దీనిపై అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఎలక్షన్ కమిటీ రద్దు చేసి, పార్లమెంటరీ బోర్డు ఏర్పాటుకి అధినాయకత్వం సుముఖత వ్యక్తం చేసింది. ఇకపై సీనియర్ నాయకులు రాజ్యసభలో తిష్టవేసే అవకాశం లేకుండా చేసింది. ఒక నాయకుడిని గరిష్టంగా రెండుసార్లు మాత్రమే రాజ్యసభకు నామినేట్ చేసేలా పార్టీ రాజ్యాంగంలో మార్పులు చేస్తోంది.

కేంద్రాన్ని డిమాండ్ చేయాల్సిన అంశాలివే..
కులాలవారీ జనగణన జరపాలని కేంద్రాన్ని కోరేందుకు కాంగ్రెస్ నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ పునరుద్ధరించడంతో పాటు ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లు అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేయబోతోంది కాంగ్రెస్. చట్టసభల్లో ఓబీసీలకూ రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రాన్ని కోరనుంది. కేంద్ర, రాష్ట్రాల ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా జీఎస్టీ పరిహారాన్ని మరో మూడేళ్లు పొడిగించాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది.

ప్రియాంకకు పగ్గాలు అప్పగిస్తారా..?
కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని కర్నాటక నుంచి రాజ్యసభకు పంపించాలని నిర్ణయం తీసుకున్నారు. రాహుల్ గాందీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టేందుకు మరోసారి నిరాకరిస్తే, ఆ బాధ్యతలు ప్రియాంకకు అప్పగించాలని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. దీనిపై తుది నిర్ణయం సోనియాగాంధీ తీసుకోవాల్సి ఉంది.

First Published:  15 May 2022 12:03 AM GMT
Next Story