Telugu Global
NEWS

బంగారు నాణేలు ఇచ్చినా బాబు గెల‌వ‌లేడు

కుప్పం నుంచి చంద్రబాబు వరుసగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 33 ఏళ్లుగా ఆయన అక్కడ రాజకీయం చేస్తున్నారు. దాదాపుగా టీడీపీకి అదు కంచుకోటేనని చెప్పాలి. కానీ వరుసగా రెండు పర్యాయాలు అక్కడ చంద్రబాబుకి వచ్చిన మెజార్టీ కరిగిపోయింది. దీంతో వైసీపీలో జోష్ పెరిగింది. 2019 ఎన్నికల్లో టీడీపీని కేవలం 23 సీట్లకు పరిమితం చేసిన వైసీపీ.. ఇంకాస్త కష్టపడితే కుప్పంలో కూడా బాబు జెండా పీకేయచ్చని డిసైడ్ అయింది. ఆ ప్రయత్న ఫలితం స్థానిక ఎన్నికల్లో కనపడింది. […]

బంగారు నాణేలు ఇచ్చినా బాబు గెల‌వ‌లేడు
X

కుప్పం నుంచి చంద్రబాబు వరుసగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 33 ఏళ్లుగా ఆయన అక్కడ రాజకీయం చేస్తున్నారు. దాదాపుగా టీడీపీకి అదు కంచుకోటేనని చెప్పాలి. కానీ వరుసగా రెండు పర్యాయాలు అక్కడ చంద్రబాబుకి వచ్చిన మెజార్టీ కరిగిపోయింది. దీంతో వైసీపీలో జోష్ పెరిగింది. 2019 ఎన్నికల్లో టీడీపీని కేవలం 23 సీట్లకు పరిమితం చేసిన వైసీపీ.. ఇంకాస్త కష్టపడితే కుప్పంలో కూడా బాబు జెండా పీకేయచ్చని డిసైడ్ అయింది. ఆ ప్రయత్న ఫలితం స్థానిక ఎన్నికల్లో కనపడింది. కుప్పం ఎంపీటీసీ సీటు కూడా వైసీపీ గెలుచుకుంది, కుప్పం మండల ఎంపీపీ స్థానం కూడా వైసీపీదే. మెల్లగా కుప్పం నియోజకవర్గంలో కూడా వైసీపీ పట్టు పెంచుకుంటోంది. ఎంతలా అంటే.. నేరుగా చంద్రబాబే భయపడి వచ్చి ఇక్కడ సొంత ఇల్లు కట్టుకునేంతలా. తాజాగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే.. వైసీపీ నేతలు ఈ నియోజకవర్గాన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టేలా లేరు. 2024లో తాడోపేడో తేల్చుకోవాలనే చూస్తున్నారు.

బంగారు నాణేలు పంచినా గెలవలేరు..
కుప్పంలో చంద్రబాబు ఇల్లు కట్టినా.. చివరకు బంగారం నాణేలు పంపిణీ చేసినా గెలవలేరని సెటైర్లు వేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు గెలిచినా.. మెజార్టీ భారీగా తగ్గిందని, అక్కడ టీడీపీ పతనం ఖాయమని అన్నారు. స్థానిక ఎన్నికల్లో గెలుపు ఇచ్చిన ఉత్సాహంతో పార్టీ శ్రేణులు అక్కడ పనిచేస్తున్నాయని, కచ్చితంగా చంద్రబాబుని ఆ నియోజకవర్గం నుంచి తరిమికొడతామన్నారు పెద్దిరెడ్డి.

బాబు జాగ్రత్త పడుతున్నారా..?
కుప్పంలో కూసాలు కదులుతున్నాయనే అనుమానం రాగానే చంద్రబాబు కూడా జాగ్రత్త పడుతున్నట్టు తెలుస్తోంది. కుప్పం-పలమనేరు జాతీయ రహదారి సమీపంలో శాంతిపురం మండల పరిధిలోని కడపల్లె, కనమలదొడ్డి గ్రామాల మధ్య శివపురం దగ్గర చంద్రబాబు ఇల్లు కోసం స్థలం తీసుకున్నారు. త్వరలోనే ఇక్కడ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి. ఇంటి నిర్మాణంతోపాటు.. ప్రతి మూడు నెలలకొసారి చంద్రబాబు నియోజకవర్గానికి వచ్చి సమీక్షలు నిర్వహిస్తానని చెప్పారు. తాజాగా అక్కడ పర్యటించిన బాబు.. జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం నాయకులకు కూడా వార్నింగ్ ఇచ్చారు. పార్టీలో చీలికలు తేవద్దని చెప్పారు. గతంలో కనీసం నామినేషన్ వేసేందుకు కూడా కుప్పం నియోజకవర్గానికి వచ్చేవారు కాదు చంద్రబాబు. కుటుంబ సభ్యులతో ఆ తంతు ముగించేవారు. కానీ ఇప్పుడు ఆయన నేరుగా మూడు నెలలకోసారి నియోజకవర్గానికి వస్తా, ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పుకునే పరిస్థితి. చంద్రబాబు భయం, పెద్దిరెడ్డి ఊపు చూస్తుంటే.. 2024లో కుప్పం ఎన్నికలు రెండు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారే అవకాశముంది.

First Published:  14 May 2022 9:21 PM GMT
Next Story