Telugu Global
Others

గుజరాత్ కి ఎక్కువ.. దేశానికి తక్కువ.. -అమిత్ షా కు కేటీఆర్ లేఖ

తెలంగాణ ఆవిర్భవించి ఎనిమిదేళ్లవుతున్నా.. బీజేపీకి రాష్ట్రంపై కక్ష, వివక్ష అలాగే ఉందని అన్నారు మంత్రి కేటీఆర్. ప్రతీసారి నేతలు వచ్చి స్పీచులు దంచి.. విషం చిమ్మి పత్తా లేకుండా పోవటం అలవాటుగా మార్చుకున్నారని మండిపడ్డారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన నేపథ్యంలో ఆయనకు బహిరంగ లేఖ రాశారు కేటీఆర్. కేంద్రం కడుపు నింపుతున్న తెలంగాణ కడుపు కొట్టడం మంచిది కాదని హితవు పలికారు. తెలంగాణపై అమిత్ షా కి చిత్తశుద్ధి ఉంటే తన […]

గుజరాత్ కి ఎక్కువ.. దేశానికి తక్కువ.. -అమిత్ షా కు కేటీఆర్ లేఖ
X

తెలంగాణ ఆవిర్భవించి ఎనిమిదేళ్లవుతున్నా.. బీజేపీకి రాష్ట్రంపై కక్ష, వివక్ష అలాగే ఉందని అన్నారు మంత్రి కేటీఆర్. ప్రతీసారి నేతలు వచ్చి స్పీచులు దంచి.. విషం చిమ్మి పత్తా లేకుండా పోవటం అలవాటుగా మార్చుకున్నారని మండిపడ్డారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన నేపథ్యంలో ఆయనకు బహిరంగ లేఖ రాశారు కేటీఆర్. కేంద్రం కడుపు నింపుతున్న తెలంగాణ కడుపు కొట్టడం మంచిది కాదని హితవు పలికారు.

తెలంగాణపై అమిత్ షా కి చిత్తశుద్ధి ఉంటే తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని అన్నారు కేటీఆర్. తెలంగాణకు చట్టబద్ధంగా ఇచ్చిన హామీలను నెరవేర్చని బీజేపీ.. గుజరాత్ కు మాత్రం ఇవ్వని హామీలు కూడా ఆగమేఘాల మీద అమలు చేయడం దేనికి సంకేతం అని ప్రశ్నించారు. విభజన చట్టంలోని హామీల అమలుకోసం తెగేదాకా కొట్లాడతామని, అందుకే వాటిని మరోసారి అమిత్ షా దృష్టికి తీసుకొస్తున్నానని ఆ లేఖలో వివరించారు కేటీఆర్. ఇంత చెప్పినా ఇంకా వినకుండా.. గుజరాత్ పై వల్లమాలిన ప్రేమను.. తెలంగాణపై సవతి తల్లి ప్రేమను కొనసాగిస్తే తెలంగాణ ప్రజాక్షేత్రంలో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారాయన. మొత్తం 27 ప్రశ్నలను ఆయన తన బహిరంగ లేఖలో అమిత్ షా కి సంధించారు.

వీటికి సమాధానం చెప్పండి..
పార్లమెంట్ సాక్షిగా విభజన చట్టంలో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కదాన్నయినా కేంద్రం నెరవేర్చిందా అని ప్రశ్నించారు కేటీఆర్. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ కోరితే వాటికి డిమాండ్ లేదని చేతులు దులుపుకున్న కేంద్రం.. గుజరాత్ లో 20వేల కోట్ల రూపాయల పెట్టుబడితో కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు నిర్మించబోతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఐఐఎం, ఏఎన్డీ, ట్రిపుల్ ఐటీ, గిరిజన విశ్వ విద్యాలయం, నవోదయ విద్యాలయాల్లో ఒక్కటి కూడా తెలంగాణకు ఎందుకు ఇవ్వలేదు..? గుజరాత్ లో విద్యార్థిని అడిగిన ప్రశ్నకు వెంటనే స్పందించిన ప్రధాని, తెలంగాణలో మెడికల్ కాలేజీల హామీని ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ హామీకి ఎందుకు తుప్పు పట్టిందో చెప్పాలన్నారు కేటీఆర్. పారిశ్రామిక రాయితీలను తెలంగాణకు ఎందుకివ్వడంలేదని ప్రశ్నించారు. ఐటీఐఆర్ ని కక్షపూరితంగానే రద్దు చేశారని, ఐటీ అభివృద్ధికోసం సాఫ్ట్ వేర్ పార్క్ ని అడిగినా కుదరదన్నారని గుర్తు చేశారు.

ఇక ప్రాజెక్ట్ ల విషయానికొస్తే, పాలమూరు – రంగారెడ్డి పథకానికి జాతీయహోదా ఇస్తామంటూ సుష్మాస్వరాజ్ ఇచ్చిన హామీ నెరవేర్చలేదని, అదే సమయంలో పక్కనున్న కర్నాటకలో అప్పర్ భద్ర ప్రాజెక్ట్ కి జాతీయ హోదా ప్రకటించడం వివక్ష కాదా అని ప్రశ్నించారు కేటీఆర్. ఏపీ, తెలంగాణ మధ్య సాగునీటి వాటాలను తేల్చకుండా ఎనిమిదేళ్లుగా తాత్సారం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణకు ఏనాడూ ప్రత్యేక నిధులివ్వలేదని, మిషన్ కాకతీయకు నిధులివ్వాలంటూ నీతిఆయోగ్ చేసిన ప్రతిపాదన కూడా బుట్టదాఖలు చేశారని, స్కైవేలకోసం రక్షణ శాఖ భూములు అడిగినా ఇవ్వడంలేదని అన్నారు.

నదుల ప్రక్షాళణకు వేలకోట్లు ఖర్చుపెడుతున్న కేంద్రం, మూసీ నదికి మూడు పైసలైనా కేటాయించారా అని అడిగారు. గుజరాత్ కి వరదసాయం అందించిన కేంద్రం, హైదరబాద్ వరదల్లో మునిగిపోతే నయాపైసా విదల్చలేదని, ఏ మొహం పెట్టుకుని హైదరాబాద్ వస్తారని అమిత్ షా ని ప్రశ్నించారు కేటీఆర్.

కొవిడ్ సంక్షోభ సమయంలో వ్యాక్సిన్ల తయారీలో అగ్రగామిగా ఉన్న హైదరాబాద్ ని ఫార్మాసిటీ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. తెలంగాణకు డిఫెన్స్ కారిడార్ మంజూరు చేయలేదని, టెక్స్ టైల్స్ రంగానికి చేయూత లేదని, పంజాబ్ లాగా తెలంగాణ ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి వెనకాడారని, పసుపు బోర్డ్ హామీ ఏమైందని ప్రశ్నించారు. పెట్రో ధరల సెస్సులను రద్దు చేసి ప్రజలకు ఉపశమనం కలిగించడానికి వెనకాడుతున్నారని అన్నారు కేటీఆర్.

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారి ట్రెడిషనల్ మెడిసిన్ సెంటర్ హైదరాబాద్ లో పెట్టాల్సి ఉన్నా.. దాన్ని సైతం గుజరాత్ కు తరలించిన కేంద్రానిది పక్షపాత వైఖరి కాదా అని నిలదీశారు. హైదరాబాద్ లో ఆర్బిట్రేషన్ సెంటర్ కు ఒక్కపైసా సహాయం చేయకపోగా, గుజరాత్ లో మరో సెంటర్ పెట్టి పక్షపాతం చూపించడాన్ని ఏమనాలని ప్రశ్నించారు కేటీఆర్.

First Published:  13 May 2022 8:12 PM GMT
Next Story