Telugu Global
Cinema & Entertainment

సర్కారువారి పాట 2 రోజుల వసూళ్లు

సర్కారువారి పాట సినిమా రెండో రోజు కూడా మెరిసింది. మొదటి రోజు 36 కోట్ల రూపాయల షేర్ రాబట్టిన ఈ సినిమా, రెండో రోజు అటుఇటుగా 10 కోట్ల రూపాయల షేర్ సాధిస్తుందని ట్రేడ్ అంచనా వేసింది. కానీ ఆ అంచనాలకు మించి సర్కారువారి పాట సినిమా 11 కోట్ల రూపాయలు వసూలు చేసింది. వరల్డ్ వైడ్ ఈ సినిమాకు 2 రోజుల్లో 103 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్టు మేకర్స్ ప్రకటించారు. అటు ఓవర్సీస్ లో […]

సర్కారువారి పాట 2 రోజుల వసూళ్లు
X

సర్కారువారి పాట సినిమా రెండో రోజు కూడా మెరిసింది. మొదటి రోజు 36 కోట్ల రూపాయల షేర్ రాబట్టిన ఈ సినిమా, రెండో రోజు అటుఇటుగా 10 కోట్ల రూపాయల షేర్ సాధిస్తుందని ట్రేడ్ అంచనా వేసింది. కానీ ఆ అంచనాలకు మించి సర్కారువారి పాట సినిమా 11 కోట్ల రూపాయలు వసూలు చేసింది. వరల్డ్ వైడ్ ఈ సినిమాకు 2 రోజుల్లో 103 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్టు మేకర్స్ ప్రకటించారు.

అటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాకు మంచి వసూళ్లు వస్తున్నాయి. ప్రీమియర్స్ తో కలుపుకొని 2 రోజుల్లో 1.5 మిలియన్ డాలర్లు ఆర్జించింది ఈ సినిమా. ఈరోజు వసూళ్లతో ఈ సినిమా 2 మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరబోతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు వచ్చిన వసూళ్లు (షేర్) ఇలా ఉన్నాయి

నైజాం – రూ. 17.10 కోట్లు
సీడెడ్ – రూ. 5.96 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 5.39 కోట్లు
ఈస్ట్ – రూ. 4.33 కోట్లు
వెస్ట్ – రూ. 3.19 కోట్లు
గుంటూరు – రూ. 6.34 కోట్లు
నెల్లూరు- రూ. 1.91 కోట్లు
కృష్ణా – రూ. 2.83 కోట్లు

First Published:  14 May 2022 7:41 AM GMT
Next Story