హనుమాన్ నుంచి మరో పోస్టర్ వచ్చేసింది
సరికొత్త కాన్సెప్ట్‌లతో కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లను రూపొందించడంలో క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మది సెపరేట్ స్టయిల్. ఇదే స్టయిల్ లో మరో డిఫరెంట్ మూవీ చేస్తున్నాడు ఈ దర్శకుడు. హను-మాన్ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఓ సరికొత్త సినిమాటిక్ జోనర్‌ను ఇంట్రడ్యూస్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. మొదటి పాన్-ఇండియన్ సూపర్ హీరో మూవీగా యంగ్ హీరో తేజ సజ్జతో కలిసి ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తోన్న `హను-మాన్` సినీ ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ కానుంది. ఈ సినిమాలో తేజ […]

సరికొత్త కాన్సెప్ట్‌లతో కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లను రూపొందించడంలో క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మది సెపరేట్ స్టయిల్. ఇదే స్టయిల్ లో మరో డిఫరెంట్ మూవీ చేస్తున్నాడు ఈ దర్శకుడు. హను-మాన్ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఓ సరికొత్త సినిమాటిక్ జోనర్‌ను ఇంట్రడ్యూస్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. మొదటి పాన్-ఇండియన్ సూపర్ హీరో మూవీగా యంగ్ హీరో తేజ సజ్జతో కలిసి ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తోన్న 'హను-మాన్' సినీ ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ కానుంది.
ఈ సినిమాలో తేజ సజ్జ సరసన అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆమెకు సంబంధించిన లుక్ ను ఇదివరకే విడుదల చేశారు. ఇప్పుడు ఈ సినిమా నుంచి అమృతా అయ్యర్ కు సంబంధించి మరో లుక్ రిలీజ్ చేశారు. ఈ రోజు అమృత అయ్యర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా హను-మాన్ సినిమా నుంచి అమృతా అయ్యర్ సెకెండ్ పోస్టర్ రిలీజ్ చేశారు.
హను-మాన్ సినిమాలో మీనాక్షి రోల్ లో కనిపించబోతోంది అమృతా అయ్యర్. ఓ దేవకన్యలా కనిపిస్తున్న అమృతా అయ్యర్.. ఈ పాత్రకు సరిగ్గా సరిపోయింది. తేజ సజ్జ సూపర్ హీరో పాత్ర పోషించడానికి స్టన్నింగ్ మేకోవర్ అయ్యాడు. తేజ గెటప్ చాలా కొత్తగా ఉంది.
హను-మాన్ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషలలో రూపొందుతోంది. ఈ చిత్రం కోసం నలుగురు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్లు పని చేస్తున్నారు. అనుదీప్ దేవ్, హరి గౌర, జయ్ క్రిష్, కృష్ణ సౌరభ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించనున్నారు.