Telugu Global
Cinema & Entertainment

విక్రమ్ ఫస్ట్ సింగిల్.. అన్నీ కమల్ హాసనే..!

యూనివర్సల్ హీరో కమల్ హాసన్, సక్సెస్ ఫుల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘విక్రమ్’. టీజర్‌తో ఈ సినిమా ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ చేసింది. ఇప్పుడు తాజాగా మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలయ్యాయి. ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగల్ గా ‘పతళ పతళ’ అనే పాటని విడుదల చేశారు. దీనికి కొన్ని ప్రత్యేకతలున్నాయి. స్టార్ కంపోజర్ అనిరుధ్, మాస్ నంబర్ గా ఈ పాటని డిజైన్ చేశాడు. అదిరిపోయే బీట్, […]

విక్రమ్ ఫస్ట్ సింగిల్.. అన్నీ కమల్ హాసనే..!
X

యూనివర్సల్ హీరో కమల్ హాసన్, సక్సెస్ ఫుల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘విక్రమ్’. టీజర్‌తో ఈ సినిమా ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ చేసింది. ఇప్పుడు తాజాగా మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలయ్యాయి. ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగల్ గా ‘పతళ పతళ’ అనే పాటని విడుదల చేశారు. దీనికి కొన్ని ప్రత్యేకతలున్నాయి.

స్టార్ కంపోజర్ అనిరుధ్, మాస్ నంబర్ గా ఈ పాటని డిజైన్ చేశాడు. అదిరిపోయే బీట్, మాస్ స్టెప్పులతో థియేటర్‌లలో ఫ్యాన్స్ పండగ చేసుకునేలా వుంది ‘పతళ పతళ’ సాంగ్. ఈ పాటలో కమల్ హాసన్ తన మార్క్ డ్యాన్స్ తో వింటేజ్ గ్రేస్‌ చూపించారు. కమల్ హాసన్ ఈ పాట కు సాహిత్యం అందించడంతో పాటు ఆయనే స్వయంగా పాటని ఆలపించడం మరో ప్రత్యేకత.

తాజాగా విక్రమ్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు నిర్మాతలు. మే 16 చెన్నైలో ‘విక్రమ్’ థియేట్రికల్ ట్రైలర్, ఆడియోని గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు.

ఈ చిత్రంలో విజయ్ సేతుపతి విలన్‌గా నటిస్తుండగా, ఫహద్ ఫాసిల్ మరో పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు. కమల్ హాసన్ హీరోగా నటించడమే కాకుండా, రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఆర్ మహేంద్రన్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్దమౌతోంది.

First Published:  13 May 2022 9:33 AM GMT
Next Story