Telugu Global
NEWS

ముసలోడైనా బసిరెడ్డే మేలంటున్నారు.. వైసీపీ, టీడీపీ ఒకే పడవలో..

తాడిపత్రి మున్సిపల్ చైర్మన్‌ జేసీ ప్రభాకర్ రెడ్డి అటు వైసీపీపైనా, ఇటు సొంత పార్టీ లోపాలపైనా విమర్శలు చేశారు. వైసీపీ, టీడీపీ రెండూ ఒకే పడవలో ప్రయాణిస్తున్నాయన్నారు. రెండు పార్టీలకూ కార్యకర్తలు లేకుండాపోయారన్నారు. నాయకులే ఒక పద్దతి ప్రకారం కార్యకర్తలను కనిపించకుండా చేశారన్నారు. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా కార్యకర్తలు లేక.. వాలంటీర్లు, అధికారులు, పోలీసులను వెంటేసుకుని తిరుగుతున్నారన్నారు. టీడీపీలో నేతల ముఖాలు చూసి కార్యకర్తలు ముందుకొచ్చే పరిస్థితి లేదన్నారు. వస్తే చంద్రబాబు ముఖం చూసే రావాలన్నారు. […]

ముసలోడైనా బసిరెడ్డే మేలంటున్నారు.. వైసీపీ, టీడీపీ ఒకే పడవలో..
X

తాడిపత్రి మున్సిపల్ చైర్మన్‌ జేసీ ప్రభాకర్ రెడ్డి అటు వైసీపీపైనా, ఇటు సొంత పార్టీ లోపాలపైనా విమర్శలు చేశారు. వైసీపీ, టీడీపీ రెండూ ఒకే పడవలో ప్రయాణిస్తున్నాయన్నారు. రెండు పార్టీలకూ కార్యకర్తలు లేకుండాపోయారన్నారు. నాయకులే ఒక పద్దతి ప్రకారం కార్యకర్తలను కనిపించకుండా చేశారన్నారు.

ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా కార్యకర్తలు లేక.. వాలంటీర్లు, అధికారులు, పోలీసులను వెంటేసుకుని తిరుగుతున్నారన్నారు. టీడీపీలో నేతల ముఖాలు చూసి కార్యకర్తలు ముందుకొచ్చే పరిస్థితి లేదన్నారు. వస్తే చంద్రబాబు ముఖం చూసే రావాలన్నారు. అనంతపురం జిల్లా టీడీపీ నేతలపైనా జేసీ అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో ఎంత మంది టీడీపీ నేతలు జైలుకు వెళ్లారని ప్రశ్నించారు. కార్యకర్తలను అరెస్ట్‌ చేస్తుంటే కనీసం పలకరించే ధైర్యం కూడా నేతలకు లేకపోతే ఇక కార్యకర్తలు ఎలా ముందుకొస్తారని ప్రశ్నించారు.

చంద్రబాబు ముసలోడు అయిపోయాడని వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారని.. ప్రజలు మాత్రం ”ముసలోడైనా బసిరెడ్డే మేలు” అన్నట్టుగా ఆలోచన చేస్తున్నారన్నారు. స్వేచ్చగా బయటకే రాలేకపోతున్నజగన్ యువకుడైనా ఏంటి ఉపయోగమని ప్రశ్నించారు. జగన్‌ బయటకు రావాలంటే షాపులు మూయాలి, పరదాలు కట్టాలి, 600 మంది పోలీసులు ఉండాల్సి వస్తోందన్నారు. వైసీపీ అన్నది ప్రస్తుతం పోలీసులు అనే మహావృక్షం కింద కాలం వెళ్లదీస్తోందన్నారు. వైసీపీ మీద పక్క పార్టీ వారికంటే సొంత పార్టీ శ్రేణులే ఎక్కువ ద్వేషంతో ఉన్నాయని జేసీ ప్రభాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. వైసీపీకి కనీసం ఎన్నికల్లో పనిచేయడానికి వాలంటీర్లు అయినా ఉన్నారని.. టీడీపీకి ఆ పరిస్థితి కూడా లేదని జేసీ ఆవేదన చెందారు. ఇప్పటికైనా కార్యకర్తలను టీడీపీ నేతలు గుర్తించి ధైర్యం నింపాలన్నారు.

First Published:  13 May 2022 2:22 AM GMT
Next Story