Telugu Global
NEWS

నారాయణ కేసులో అదనపు అడ్వకేట్‌ జనరల్‌ పిటిషన్

మాజీ మంత్రి నారాయణను అంత ఈజీగా వదిలిపెట్టకూడదని ప్రభుత్వం భావిస్తోంది. పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజు కేసులో అరెస్ట్‌ చేస్తే.. 24 గంటలు కూడా గడవకముందే.. అలా వెళ్లి ఇలా బెయిల్‌పై బయటకు రావడంతో పోలీసులు, ప్రభుత్వం కంగుతిన్నాయి. తాను 2014లోనే నారాయణ విద్యాసంస్థల చైర్మన్ పదవికి రాజీనామా చేశానంటూ నారాయణ చేసిన వాదనను ప్రధానంగా పరిగణలోకి తీసుకుని ఆయనకు బెయిల్ ఇచ్చేసింది దిగువ కోర్టు. కానీ ఇప్పటికీ తాను విద్యాసంస్థలకు చైర్మన్‌గానే ఉన్నానంటూ ఒక ఇంటర్వ్యూలో […]

నారాయణ కేసులో అదనపు అడ్వకేట్‌ జనరల్‌ పిటిషన్
X

మాజీ మంత్రి నారాయణను అంత ఈజీగా వదిలిపెట్టకూడదని ప్రభుత్వం భావిస్తోంది. పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజు కేసులో అరెస్ట్‌ చేస్తే.. 24 గంటలు కూడా గడవకముందే.. అలా వెళ్లి ఇలా బెయిల్‌పై బయటకు రావడంతో పోలీసులు, ప్రభుత్వం కంగుతిన్నాయి.

తాను 2014లోనే నారాయణ విద్యాసంస్థల చైర్మన్ పదవికి రాజీనామా చేశానంటూ నారాయణ చేసిన వాదనను ప్రధానంగా పరిగణలోకి తీసుకుని ఆయనకు బెయిల్ ఇచ్చేసింది దిగువ కోర్టు. కానీ ఇప్పటికీ తాను విద్యాసంస్థలకు చైర్మన్‌గానే ఉన్నానంటూ ఒక ఇంటర్వ్యూలో స్వయంగా రెండు నెలల క్రితం నారాయణే చెప్పడం, ఆ ఇంటర్వ్యూను నారాయణ విద్యాసంస్థల అధికారిక యూ ట్యూబ్ చానల్‌లోనే అప్‌లోడ్ చేసి ఉండడంతో నారాయణ ఇరుక్కుపోయారు.

రాజీనామా విషయాన్ని కోర్టు విశ్వసించి బెయిల్ ఇచ్చినప్పటికీ ప్రజలెవరూ ఇంటర్వ్యూ చూసిన తర్వాత నారాయణను నమ్మడం లేదు. నారాయణ కోర్టును తప్పుదోవ పట్టించారని ప్రతి ఒక్కరూ గట్టిగా భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే నారాయణ బెయిల్ రద్దు చేయాలంటూ చిత్తూరు కోర్టులో ప్రభుత్వం పిటిషన్ వేసింది. ప్రభుత్వం తరపున అదనపు అడ్వకేట్ జనరల్ సుధాకర్‌ రెడ్డి పిటిషన్ వేశారు. పేపర్ లీకేజీలో నారాయణ పాత్ర స్పష్టంగా ఉందని,విద్యాసంస్థలకు రాజీనామా చేశానని చెప్పడం కూడా అబద్దమని పిటిషన్‌ వేశారు.

చట్టం అందరికీ సమానంగానే ఉండాలని.. నారాయణ బెయిల్ రద్దు చేయాలని కోరారు. మధ్యాహ్నం నుంచి ఈ పిటిషన్‌పై వాదనలు జరగనున్నాయి. అయితే చంద్రబాబు లీగల్ టీం ముందు ప్రభుత్వం ఏమేరకు విజయం సాధిస్తుంది అన్నది చూడాలి.

First Published:  13 May 2022 1:30 AM GMT
Next Story