Telugu Global
Cinema & Entertainment

ఎఫ్3 సినిమాకు సాధారణ రేట్లు

ఓ పెద్ద సినిమా వస్తే మొదటి వారం రోజులు లేదా 10 రోజులు రేట్లు పెంచుకునే పరిస్థితుల్లోకి వచ్చేశాం. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్, ఆచార్య, సర్కారువారి పాట.. ఇలా ప్రతి పెద్ద సినిమాకు రిలీజైన కొత్తలో టికెట్ రేట్లు పెంచుకోవడం కామన్ అయిపోయింది. మధ్యలో వచ్చిన అర్జున ఫల్గుణ లాంటి చిన్న సినిమాలకు కూడా రేట్లు పెంచి సొమ్ము చేసుకోవాలనే ప్రయత్నాలు జరిగాయి. అయితే ఈ మొత్తం వ్యవహారం నుంచి ఎఫ్3 సినిమా తప్పుకుంది. అవును.. వెంకటేష్-వరుణ్ తేజ్ […]

ఎఫ్3 సినిమాకు సాధారణ రేట్లు
X

ఓ పెద్ద సినిమా వస్తే మొదటి వారం రోజులు లేదా 10 రోజులు రేట్లు పెంచుకునే పరిస్థితుల్లోకి వచ్చేశాం. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్, ఆచార్య, సర్కారువారి పాట.. ఇలా ప్రతి పెద్ద సినిమాకు రిలీజైన కొత్తలో టికెట్ రేట్లు పెంచుకోవడం కామన్ అయిపోయింది. మధ్యలో వచ్చిన అర్జున ఫల్గుణ లాంటి చిన్న సినిమాలకు కూడా రేట్లు పెంచి సొమ్ము చేసుకోవాలనే ప్రయత్నాలు జరిగాయి. అయితే ఈ మొత్తం వ్యవహారం నుంచి ఎఫ్3 సినిమా తప్పుకుంది.

అవును.. వెంకటేష్-వరుణ్ తేజ్ హీరోలుగా వస్తున్న ఈ సినిమాకు టికెట్ రేట్లు పెంచడం లేదు. సాధారణ ధరలకే ఎఫ్3 సినిమాను ప్రదర్శించబోతున్నారు. నిజంగా దిల్ రాజు తీసుకున్న తెలివైన నిర్ణయం ఇది.

ఎఫ్3 అనేది ఫ్యామిలీ సినిమా. కుటుంబాలతో కలిసొచ్చే సినిమా. ఇలాంటి సినిమాకు రేట్లు పెంచితే ఫ్యామిలీ ఆడియన్స్ పై చాలా భారం పడుతుంది. ఓ కుటుంబం కలిసి సినిమా చూడాలంటే మల్టీప్లెక్సులో టిక్కెట్లకే 2వేల రూపాయలు ఖర్చు అవుతాయి. దీంతో చాలా కుటుంబాలు వెనక్కి తగ్గే ప్రమాదం ఉంది.

దీన్ని ముందుగానే ఊహించిన దిల్ రాజు, తెలివైన నిర్ణయం తీసుకున్నారు. రెగ్యులర్ రేట్లకే ఎఫ్3 సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల రెండు లాభాలున్నాయి. ఒకటి సినిమాకు ఎక్కువమంది ప్రేక్షకులొస్తారు. ఆక్యుపెన్సీ పెరిగితే ఆటోమేటిగ్గా వసూళ్లు పెరుగుతాయి. అప్పుడిక రేట్లు పెంచాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుతం సర్కారువారి పాట ఎదుర్కొంటున్న సమస్య కూడా ఇదే.

First Published:  13 May 2022 9:35 AM GMT
Next Story