Telugu Global
NEWS

ఓటమి పాఠం.. జూన్‌ 5న బాబు ఇంటి నిర్మాణానికి భూమి పూజ

చంద్రబాబు పరిస్థితి స్టేట్ మొత్తం ఒక లెక్క.. కుప్పం మాత్రమే మరో లెక్క అన్నట్టుగా ప్రస్తుతం ఉంది. ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించినప్పటికీ కుప్పంపై చంద్రబాబు ఏనాడు ప్రత్యేకంగా దృష్టి పెట్టింది లేదు. కొన్నిసార్లు నామినేషన్ వేసేందుకు కూడా నేరుగా వెళ్లేవారు కాదు. తాను ప్రాతినిధ్యం వహించడమే కుప్పం ప్రజల అదృష్టం అన్నట్టుగా చంద్రబాబు తీరు ఉండేది. కానీ ఇటీవల చంద్రబాబు తీరు మారింది. స్థానిక ఎన్నికల్లో కుప్పంలోనూ టీడీపీ చిత్తుగా ఓడిపోవడంతో సొంత ఇంటిని చక్కదిద్దుకునేందుకు […]

ఓటమి పాఠం.. జూన్‌ 5న బాబు ఇంటి నిర్మాణానికి భూమి పూజ
X

చంద్రబాబు పరిస్థితి స్టేట్ మొత్తం ఒక లెక్క.. కుప్పం మాత్రమే మరో లెక్క అన్నట్టుగా ప్రస్తుతం ఉంది. ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించినప్పటికీ కుప్పంపై చంద్రబాబు ఏనాడు ప్రత్యేకంగా దృష్టి పెట్టింది లేదు. కొన్నిసార్లు నామినేషన్ వేసేందుకు కూడా నేరుగా వెళ్లేవారు కాదు. తాను ప్రాతినిధ్యం వహించడమే కుప్పం ప్రజల అదృష్టం అన్నట్టుగా చంద్రబాబు తీరు ఉండేది. కానీ ఇటీవల చంద్రబాబు తీరు మారింది.

స్థానిక ఎన్నికల్లో కుప్పంలోనూ టీడీపీ చిత్తుగా ఓడిపోవడంతో సొంత ఇంటిని చక్కదిద్దుకునేందుకు చంద్రబాబు తీవ్రంగానే శ్రమిస్తున్నారు. ఇటీవల పదేపదే కుప్పం పర్యటనలకు వెళ్తున్నారు. ప్రస్తుతం కూడా మూడు రోజుల పర్యటన కుప్పంలో కొనసాగుతోంది. కుప్పం ప్రజల్లో నమ్మకం కలిగించేందుకు అక్కడ ఒక ఇంటిని కూడా నిర్మించుకునేందుకు చంద్రబాబు సిద్దమయ్యారు. కుప్పం-పలమనేరు జాతీయ రహదారి సమీపంలో.. కడపల్లె వద్ద చంద్రబాబు సొంత ఇంటి నిర్మాణం చేయబోతున్నారు. ఇందు కోసం రెండు ఎకరాల 10 సెంట్ల స్థలాన్ని సిద్ధం చేశారు. రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన కాగితాలపైన చంద్రబాబు గురువారం సంతకాలు చేశారు. జూన్‌ 5న చంద్రబాబు దంపతుల ఇంటి నిర్మాణానికి భూమిపూజ చేస్తారు.

ఇంటితో పాటు పార్టీ కార్యక్రమాల నిర్వాహణకు ఒక కార్యాలయాన్ని నిర్మించనున్నారు. ఇప్పటి వరకు చంద్రబాబుకు కుప్పంలో సొంత ఇల్లు లేదు. ఎప్పుడైనా వస్తే గెస్ట్‌ హౌస్‌లో ఉండి వెళ్లేవారు. తాను కుప్పం ప్రజలకు మానసికంగా దూరమవుతున్నట్టు గమనించిన చంద్రబాబు సొంత ఇంటి నిర్మాణంతో .. తాను కుప్పం బిడ్డనే అని ప్రజలకు సంకేతాలు పంపేందుకు ప్రయత్నిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

First Published:  12 May 2022 9:22 PM GMT
Next Story