Telugu Global
Cinema & Entertainment

సక్సెస్ ఫుల్ గా సెకెండ్ వీక్ లోకి..!

విశ్వక్‌ సేన్‌ హీరోగా తెరకెక్కిన అశోకవనంలో అర్జునకల్యాణం మే 6న విడుదలైంది. చక్కటి రివ్యూలు, పాజిటివ్‌ మౌత్‌ టాక్‌తో బాక్సాఫీస్‌ దగ్గర మంచి టాక్ తెచ్చుకుంది. రోజురోజుకీ సినిమా మీద జనాల్లో ఇంట్రస్ట్ పెరుగుతోంది. చాన్నాళ్ల తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమా కోసం థియేటర్లకు వస్తున్నారు. సిచ్యువేషనల్ కామెడీ, లవ్‌ ఎమోషన్స్, పర్ఫెక్ట్ ఫ్యామిలీ సెంటిమెంట్స్ తో కూడిన సినిమాగా ప్రేక్షకుల మెప్పు పొందుతోంది అశోకవనంలో అర్జున కల్యాణం. ఓవైపు సర్కారువారి పాట సినిమా వచ్చినప్పటికీ, […]

సక్సెస్ ఫుల్ గా సెకెండ్ వీక్ లోకి..!
X

విశ్వక్‌ సేన్‌ హీరోగా తెరకెక్కిన అశోకవనంలో అర్జునకల్యాణం మే 6న విడుదలైంది. చక్కటి రివ్యూలు, పాజిటివ్‌ మౌత్‌ టాక్‌తో బాక్సాఫీస్‌ దగ్గర మంచి టాక్ తెచ్చుకుంది. రోజురోజుకీ సినిమా మీద జనాల్లో ఇంట్రస్ట్ పెరుగుతోంది. చాన్నాళ్ల తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమా కోసం థియేటర్లకు వస్తున్నారు. సిచ్యువేషనల్ కామెడీ, లవ్‌ ఎమోషన్స్, పర్ఫెక్ట్ ఫ్యామిలీ సెంటిమెంట్స్ తో కూడిన సినిమాగా ప్రేక్షకుల మెప్పు పొందుతోంది అశోకవనంలో అర్జున కల్యాణం.

ఓవైపు సర్కారువారి పాట సినిమా వచ్చినప్పటికీ, మరోవైపు తమ సినిమాకు వసూళ్లు నిలకడగా వస్తున్నాయని చెబుతోంది అశోకవనంలో అర్జున కల్యాణం యూనిట్. రెండో వారంలోనూ చాలినన్ని థియేటర్లతో సినిమా రన్‌ అవుతుంటే మనసు నిండిపోయిందంటున్నారు. విశ్వక్‌ సేన్‌ చేసిన హార్డ్ వర్క్ కి బాక్సాఫీస్‌ దగ్గర కాసుల పంట పండుతోందని చెబుతున్నారు.

తనకు నచ్చిన అమ్మాయి మనసుకు దగ్గరవ్వాలని 33 ఏళ్ల యువకుడు నిజాయతీగా చేసిన ప్రయత్నంగా అశోకవనంలో అర్జున కల్యాణం సినిమాకు స్పెషల్‌ అప్లాజ్‌ వస్తోంది. తనకున్న మాస్‌ ఇమేజ్‌ని పక్కనపెట్టి , కాస్త బరువుపెరిగి, పొట్ట పెంచి క్యారక్టర్‌లో లీనమై విశ్వక్‌సేన్‌ నటించిన తీరును జనాలు మెచ్చుకుంటున్నారు.

డైరక్టర్‌ విద్యాసాగర్‌ చింత ప్రయత్నానికి ప్రశంసలు దక్కుతున్నాయి. రవికిరణ్‌ కోలా రాసిన కథలో సెన్సిటివ్‌ ఎలిమెంట్స్ కి యూత్‌ ప్లస్‌ ఫ్యామిలీ ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. జై క్రిష్‌ కంపోజ్‌ చేసిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సినిమా సక్సెస్‌లో కీలకంగా మారాయి.

First Published:  13 May 2022 9:37 AM GMT
Next Story