Telugu Global
National

యోగీ మరో సంచలన నిర్ణయం.. మదర్సాలలో ఆ గీతం తప్పనిసరి..!

యూపీలో రెండోసారి అధికారంలోకి వచ్చిన యోగి ఆదిత్యనాథ్ అక్కడ తనదైన శైలిలో పాలన సాగిస్తూ చెలరేగిపోతున్నారు. మాట వినని అధికారులను నిర్దాక్షిణ్యంగా పక్కకు పెడుతున్నారు. తాజాగా యూపీ డీజీపీని తొలగించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేయడం లేదని ఆయనను తొలగించారు. ఇక తాజాగా యూపీ సీఎం ఆదిత్యనాథ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. మదర్సాలలో జాతీయ గీతం ఆలపించాల్సిందేనని యోగీ సర్కారు ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం.. మదర్సా ఎడ్యుకేషన్ బోర్డ్ కౌన్సిల్ […]

యోగీ మరో సంచలన నిర్ణయం.. మదర్సాలలో ఆ గీతం తప్పనిసరి..!
X

యూపీలో రెండోసారి అధికారంలోకి వచ్చిన యోగి ఆదిత్యనాథ్ అక్కడ తనదైన శైలిలో పాలన సాగిస్తూ చెలరేగిపోతున్నారు. మాట వినని అధికారులను నిర్దాక్షిణ్యంగా పక్కకు పెడుతున్నారు. తాజాగా యూపీ డీజీపీని తొలగించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేయడం లేదని ఆయనను తొలగించారు. ఇక తాజాగా యూపీ సీఎం ఆదిత్యనాథ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. మదర్సాలలో జాతీయ గీతం ఆలపించాల్సిందేనని యోగీ సర్కారు ఉత్తర్వులు జారీచేసింది.

ఈ ఉత్తర్వుల ప్రకారం.. మదర్సా ఎడ్యుకేషన్ బోర్డ్ కౌన్సిల్ మదర్సాలలో ప్రతీరోజు తరగతులు ప్రారంభించడానికి ముందు జాతీయ గీతాన్ని ఆలపించాల్సి ఉంటుంది. కాగా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు బీజేపీ నేతలు ట్వీట్లు చేస్తున్నారు. మదర్సాలలో మతపరమైన అంశాలను బోధిస్తూ ఉంటారు. వీటి నిర్వహణ తీరుపై అప్పుడప్పుడూ బీజేపీ నేతలు బహిరంగంగా విమర్శలు గుప్పిస్తూ ఉంటారు.

ఇదిలా ఉంటే తాజాగా యోగీ సర్కారు అక్కడ జాతీయ గీతాన్ని ఆలపించాలని తాజాగా నిర్ణయం తీసుకుంది. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ లో ముస్లింలు పెద్ద సంఖ్యలోనే నివసిస్తున్నారు. ఆదిత్య నాథ్ తీసుకున్న నిర్ణయం ముందు ముందు ఎలాంటి వివాదాలకు దారి తీస్తుందో వేచి చూడాలి.

First Published:  12 May 2022 7:39 AM GMT
Next Story