Telugu Global
NEWS

సీబీఐ వర్సెస్ కడప పోలీస్‌.. ఏది నిజం?

వైఎస్‌ వివేకానందరెడ్డి కేసు మిస్టరీని సీబీఐ ఇంకా పూర్తిగా చేధించలేదు. అలాని వదిలివెళ్లడం లేదు. సుధీర్ఘకాలంగా కడపలోనే సీబీఐ మాటు వేసి కూర్చుంది. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసింది. అదే సమయంలో నిందితులు కొందరు ఏకంగా సీబీఐ అధికారులపై ఎదురు ఫిర్యాదులు చేయడం, వాటి ఆధారంగా కడప జిల్లా పోలీసులు శరవేగంగా చర్యలకు ఉపక్రమించడం కూడా జరిగింది. తాజాగా సీబీఐ కారు డ్రైవర్‌ వలీబాషాను ముసుగు వ్యక్తి ఒకరు బెదిరించారన్న ఆరోపణలతో పరిస్థితి మరోసారి ఏపీ పోలీస్ […]

సీబీఐ వర్సెస్ కడప పోలీస్‌.. ఏది నిజం?
X

వైఎస్‌ వివేకానందరెడ్డి కేసు మిస్టరీని సీబీఐ ఇంకా పూర్తిగా చేధించలేదు. అలాని వదిలివెళ్లడం లేదు. సుధీర్ఘకాలంగా కడపలోనే సీబీఐ మాటు వేసి కూర్చుంది. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసింది. అదే సమయంలో నిందితులు కొందరు ఏకంగా సీబీఐ అధికారులపై ఎదురు ఫిర్యాదులు చేయడం, వాటి ఆధారంగా కడప జిల్లా పోలీసులు శరవేగంగా చర్యలకు ఉపక్రమించడం కూడా జరిగింది. తాజాగా సీబీఐ కారు డ్రైవర్‌ వలీబాషాను ముసుగు వ్యక్తి ఒకరు బెదిరించారన్న ఆరోపణలతో పరిస్థితి మరోసారి ఏపీ పోలీస్ వర్సెస్ సీబీఐగా మారుతోంది.

ఈనెల 8న సీబీఐ అధికారులకు భోజనం తీసుకుని వచ్చేందుకు వెళ్తున్న సమయంలో మార్గమధ్యలో ముసుగు ధరించిన ఒక వ్యక్తి కారుకు అడ్డుగా వచ్చి, ఆపి.. ”వెంటనే తిరిగి వెళ్లిపోండి. మీ టీంకు చెప్పు. అందరూ వెళ్లిపోవాల్సిందే. వెళ్లకపోతే బాంబులేసి లేపేస్తా” అంటూ బెదిరించారు అని డ్రైవర్ వలీ చెబుతున్నాడు. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న సీబీఐ అధికారులు కడప పోలీసులకు ఫిర్యాదు చేయించారు. తొలుత పోలీసులు స్పందించకపోవడంతో ఢిల్లీలోని సీబీఐ పెద్దలు నేరుగా ఏపీ సీఎస్‌, ఏపీ డీజీపీతో మాట్లాడినట్టు చెబుతున్నారు.

సీబీఐనే కొందరు బెదిరిస్తుంటే ఎందుకు కేసు నమోదు చేయడం లేదని సీబీఐ పెద్దలు అభ్యంతరం తెలపడంతో ఆ తర్వాతే ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసినట్టు చెబుతున్నారు. డ్రైవర్ వలీ చెబుతున్నట్టు అతడు ప్రయాణించిన మార్గంలోని సీసీ కెమెరాలన్నింటిని పోలీసులు పరిశీలించారని… కానీ ఎక్కడా కూడా ముసుగు వ్యక్తి కారును ఆపినట్టుగానీ, బెదిరించినట్టుగానీ లేదని వైసీపీ పత్రిక చెబుతోంది. స్థానికులను విచారించగా వారు కూడా ముసుగు వ్యక్తి బెదిరింపులను తాము చూడలేదని చెప్పారని వైసీపీ మీడియా కథనం. డ్రైవర్‌ వలీ ఫిర్యాదులో వాస్తవం లేదన్న నిర్ధారణకు పోలీసులు దాదాపు వచ్చారని ఆ మీడియా చెబుతోంది.

అయితే డ్రైవర్ వలీ మాత్రం.. తనను ముసుగు వ్యక్తి బెదిరించింది నిజమని.. బెదిరించడమే కాకుండా.. సీబీఐకి చెందిన రెండు కార్లు ఏ రోజు ఎక్కడెక్కడికి ప్రయాణించాయి అన్న దానిపై పక్కా వివరాలను కూడా ముసుగు వ్యక్తి వివరించి మరీ బెదిరించాడని చెబుతున్నాడు. వలీ ఫిర్యాదు ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్న కడప పోలీసులు.. ఆ మార్గంలోని సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించడంతోపాటు మొత్తం హార్డ్‌ డిస్క్‌లను స్వాధీనం చేసుకుని తీసుకెళ్లారు. ఇలా ఎందుకు చేశారన్న దానిపైనా చర్చ నడుస్తోంది.

మొత్తం మీద తమకు బెదిరించేందుకు కొందరు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారన్న అనుమానంతో పాటు… తమపై నిఘా పెట్టారన్న అభిప్రాయంతో సీబీఐ అధికారులు ఉన్నారు. కడప పోలీసులు మాత్రం అలాంటి ఏమీ లేదని చెబుతున్నారు.

First Published:  11 May 2022 9:24 PM GMT
Next Story