Telugu Global
National

శ్రీలంక ఆందోళనలు కంట్రోల్ చేయడానికి భారత సైనిక బలగాలు వెళ్తున్నాయా..?

ఆర్థిక సంక్షోభంతో మొదలైన శ్రీలంక ఆందోళనలు అంతర్యుద్ధం వరకు దారితీశాయి. అధికార పార్టీ ఎంపీ మరణంతో అక్కడ గొడవలు మరింత ముదిరాయి. సోమవారం ఒక్కరోజే ఆందోళనల్లో 9 మంది మరణించగా.. ఆ తర్వాత సైన్యం సరిహద్దులనుంచి దేశం మధ్యలోకి వచ్చి పహారా కాస్తోంది. కొలంబో సహా.. ఇతర ముఖ్య పట్టణాల్లో ఎక్కడ చూసినా సైనిక వాహనాలే కనిపిస్తున్నాయి. దొంగతనాలు, ప్రభుత్వ ఆస్తుల లూటీ జరగకుండా వారు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అదే సమయంలో రాజకీయ నాయకుల ఇళ్లపై […]

శ్రీలంక ఆందోళనలు కంట్రోల్ చేయడానికి భారత సైనిక బలగాలు వెళ్తున్నాయా..?
X

ఆర్థిక సంక్షోభంతో మొదలైన శ్రీలంక ఆందోళనలు అంతర్యుద్ధం వరకు దారితీశాయి. అధికార పార్టీ ఎంపీ మరణంతో అక్కడ గొడవలు మరింత ముదిరాయి. సోమవారం ఒక్కరోజే ఆందోళనల్లో 9 మంది మరణించగా.. ఆ తర్వాత సైన్యం సరిహద్దులనుంచి దేశం మధ్యలోకి వచ్చి పహారా కాస్తోంది. కొలంబో సహా.. ఇతర ముఖ్య పట్టణాల్లో ఎక్కడ చూసినా సైనిక వాహనాలే కనిపిస్తున్నాయి. దొంగతనాలు, ప్రభుత్వ ఆస్తుల లూటీ జరగకుండా వారు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అదే సమయంలో రాజకీయ నాయకుల ఇళ్లపై దాడులు జరగకుండా పహారా కాస్తున్నారు. శ్రీలంకలో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు భారత్ కూడా సైన్యాన్ని పంపిస్తుందనే వార్తలొచ్చాయి. శ్రీలంక మీడియాలో ప్రముఖంగా ఈ వార్తలు వినిపించాయి. అయితే భారత సైన్యం శ్రీలంక వెళ్లట్లేదని, అలాంటి ఆలోచన ఏదీ లేదని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది.

అనుమానం ఎందుకు..?
అవసరమైతే ఆర్థిక సాయం, లేదా వస్తు సాయం చేస్తుంది కానీ.. భారత ప్రభుత్వం, ఇతర దేశాల రాజకీయ వ్యవహారాల్లో కలుగజేసుకోవడం అరుదు. అయితే శ్రీలంకలో గతంలో ఎల్టీటీఈతో పోరు జరిగే సందర్భంలో భారత్ కూడా సైన్యాన్ని అక్కడకు పంపించింది. అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకి కూడా అదే పరోక్ష కారణం. దీంతో మరోసారి శ్రీలంక సంక్షోభంలో భారత్ సైనిక సాయం చేస్తుందనే వార్తలొచ్చాయి. అయితే వాటిని నిర్ద్వందంగా తోసిపుచ్చింది కొలంబోలోని భారత హైకమిషన్‌. మాజీ ప్రధాని మహింద రాజపక్స, ఆయన కుటుంబ సభ్యులు భారత్‌ కు పారిపోయారంటూ జరుగుతున్న ప్రచారాన్ని కూడా అధికారులు ఖండించారు.

సైనిక పాలనా..? కొత్త ప్రభుత్వమా..?
శ్రీలంక ప్రధాని రాజీనామాతో అక్కడ రాజకీయ అనిశ్చితి నెలకొంది. సైనికుల పరాహాని చూస్తే.. అధికారాన్ని సైన్యం హస్తగతం చేసుకుంటుందేమోనన్న అనుమానాలు కూడా వచ్చాయి. అయితే లంకలో సైనిక పాలన ఉండబోదని స్పష్టం చేశారు రక్షణ శాఖ కార్యదర్శి జనరల్‌ కమల్‌ గుణరత్నె. మరోవైపు కొత్త ప్రభుత్వ ఏర్పాటుకి అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే ప్రయత్నాలు మొదలు పెట్టారు. తమ కుటుంబ సభ్యులెవరూ కొత్తమంత్రివర్గంలో ఉండబోరని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఈ వారంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతుందని, ప్రజలకు భరోసా ఇచ్చారు. ఆర్థిక సంక్షోభం నుంచి కూడా త్వరలో కోలుకునే అవకాశాలున్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

First Published:  11 May 2022 11:42 PM GMT
Next Story