Telugu Global
National

ఇకనుంచి కాల్ రికార్డింగ్ యాప్స్ పనిచేయవా? గూగుల్ చేసిన అప్‌డేట్ ఏంటి?

ప్లే స్టోర్ నుంచి అన్నిరకాల కాల్ రికార్డింగ్ యాప్స్‌ను నిషేధించనున్నట్టు గతంలోనే గూగుల్ ప్రకటించింది. అయితే ఈ కొత్త రూల్ నేటి నుంచి అమలులోకి రానుంది. అసలీ కొత్త రూల్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఆండ్రాయిడ్ యూజర్ల ప్రైవసీని కాపాడే చర్యల్లో భాగంగా కాల్ రికార్డింగ్ యాప్స్‌పై నిషేధం విధించింది గూగుల్. ఇకపై ప్లేస్టోర్‌లో థర్డ్ పార్టీ కాల్ రికార్డింగ్ యాప్స్ పనిచేయకుండా అన్నింటికీ యాక్సెస్ తొలగించింది. రిమోట్ కాల్ ఆడియో రికార్డింగ్ లాంటి యాప్స్‌ను […]

ఇకనుంచి కాల్ రికార్డింగ్ యాప్స్ పనిచేయవా? గూగుల్ చేసిన అప్‌డేట్ ఏంటి?
X

ప్లే స్టోర్ నుంచి అన్నిరకాల కాల్ రికార్డింగ్ యాప్స్‌ను నిషేధించనున్నట్టు గతంలోనే గూగుల్ ప్రకటించింది. అయితే ఈ కొత్త రూల్ నేటి నుంచి అమలులోకి రానుంది. అసలీ కొత్త రూల్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆండ్రాయిడ్ యూజర్ల ప్రైవసీని కాపాడే చర్యల్లో భాగంగా కాల్ రికార్డింగ్ యాప్స్‌పై నిషేధం విధించింది గూగుల్. ఇకపై ప్లేస్టోర్‌లో థర్డ్ పార్టీ కాల్ రికార్డింగ్ యాప్స్ పనిచేయకుండా అన్నింటికీ యాక్సెస్ తొలగించింది. రిమోట్ కాల్ ఆడియో రికార్డింగ్ లాంటి యాప్స్‌ను యూజర్లు ఇకపై యాక్సెస్ చేయలేరు. దీనికోసం ఆండ్రాయిడ్ యాక్సెసిబిలిటీ సెట్టింగ్‌లతో సహా గూగుల్ తన డెవలపర్ ఆప్షన్స్ అన్నింటినీ అప్‌డేట్ చేసింది. అయితే ఈ నిషేధం కేవలం థర్డ్ పార్టీ యాప్స్‌కు మాత్రమే. మొబైల్స్‌లో వచ్చే ఇన్‌బిల్ట్ కాల్ రికార్డింగ్ ఫీచర్‌లో ఎలాంటి మార్పులు ఉండబోవు.

ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు ఒకరికి తెలియకుండా మరొకరి వారి మాటలను రికార్డ్ చేయడం వల్ల ప్రైవసీకి ఎన్నో ఇబ్బందులొస్తాయి. యూఎస్‌లో ఎవరిదైనా కాల్ రికార్డింగ్ చేయాలంటే వారు దానికి యాక్సెస్ ఇస్తేనే కుదురుతుంది. అలాంటి చట్టాలు ఇండియాలో లేవు. కానీ కాల్ రికార్డింగ్ అనేది మాత్రం ఎంతో కాలంగా వివాదాస్పదంగా నిలుస్తూ వస్తోంది. అందుకే గూగుల్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

గూగుల్ తెచ్చిన కొత్త అప్ డేట్ ప్రకారం.. గూగుల్‌కు చెందిన డయలర్ యాప్‌లో కాల్ రికార్డింగ్ ఆన్ చేస్తే.. “ఈ కాల్ ఇప్పుడు రికార్డ్ అవుతుంది (This Call is Now being Recorded) అనే వార్నింగ్ నోట్ కాల్ మాట్లాడుతున్న ఇద్దరికీ వినిపిస్తుంది. అయితే గూగుల్ డయలర్‌తో పాటు ఇన్‌బుల్ట్‌గా కాల్ రికార్డింగ్ ఫీచర్ ఉన్న మొబైల్స్‌లో ఎలాంటి మార్పులు ఉండవు. కానీ థర్డ్ పార్టీ యాప్స్ నుంచి మాత్రం కాల్ రికార్డింగ్ చేసుకోలేరు. అలాగే ఒకవేళ మీ ఫోన్‌లో ఇన్‌బుల్ట్‌గా కాల్ రికార్డింగ్ ఆప్షన్ లేకపోతే ఇక రికార్డింగ్ సాధ్యం కానట్టే. ప్రముఖ కాల్ ఐడెంటిఫికేషన్ యాప్‌ ట్రూకాలర్ కూడా.. గూగుల్ ఆదేశానుసారం కాల్ రికార్డింగ్ సర్వీస్‌ను ఆపేసింది.

First Published:  11 May 2022 5:15 AM GMT
Next Story