Telugu Global
National

భారత్ లో మూలనపడుతున్న గ్యాస్ సిలిండర్లు..

మెల్లగా రేటు పెంచుకుంటూ పోయే సరికి ఎవరికీ పెద్దగా నెప్పి తెలియలేదు కానీ.. ఇటీవల రాహుల్ గాంధీ గ్యాస్ సిలిండర్ల రేటుపై ఓ కామెంట్ చేశారు. కాంగ్రెస్ హయాంలో ఇదే రేటుకి రెండు సిలిండర్లు వచ్చేవని తెలిపారు. అవును, అది నిజం.. ఎన్డీఏ హయాంలో గ్యాస్ సిలిండర్ రేట్లు గతంలో ఎప్పుడూ లేనంతగా భారీగా పెరిగిపోయాయి. ఏ రాష్ట్రంలో చూసినా కనిష్ట రేటు రూ.1050కి తగ్గడంలేదు. కమర్షియల్ సిలిండర్ రేటు 2వేల రూపాయలు దాటింది. కేవలం వంట […]

భారత్ లో మూలనపడుతున్న గ్యాస్ సిలిండర్లు..
X

మెల్లగా రేటు పెంచుకుంటూ పోయే సరికి ఎవరికీ పెద్దగా నెప్పి తెలియలేదు కానీ.. ఇటీవల రాహుల్ గాంధీ గ్యాస్ సిలిండర్ల రేటుపై ఓ కామెంట్ చేశారు. కాంగ్రెస్ హయాంలో ఇదే రేటుకి రెండు సిలిండర్లు వచ్చేవని తెలిపారు. అవును, అది నిజం.. ఎన్డీఏ హయాంలో గ్యాస్ సిలిండర్ రేట్లు గతంలో ఎప్పుడూ లేనంతగా భారీగా పెరిగిపోయాయి. ఏ రాష్ట్రంలో చూసినా కనిష్ట రేటు రూ.1050కి తగ్గడంలేదు. కమర్షియల్ సిలిండర్ రేటు 2వేల రూపాయలు దాటింది. కేవలం వంట వండుకోవడం కోసం.. ఓ కుటుంబం వెయ్యి రూపాయలు ఖర్చు చేయాలంటే సాధ్యమయ్యే పనికాదు. అందుకే ఇప్పుడు ప్రజలంతా గ్యాస్ కి ప్రత్యామ్నాయం వెదుకుతున్నారు. గ్యాస్ సిలిండర్ల బుకింగ్ మానేశారు.

ప్రధాన మంత్రి ఉజ్వల్ యోజన కింద దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపు 8.99 కోట్ల మందికి గ్యాస్ కనెక్షన్లు జారీ చేసినట్లు ప్రభుత్వం గర్వంగా ప్రకటించుకుంటోంది. గతేడాది ఆగస్ట్ లో ఉజ్వల్ యోజన 2.ఓ అంటూ మరో తంతు మొదలైంది. భారత్ లో గ్యాస్ సిలిండర్ లేని ఇళ్లంటూ ఉండకూడదనే పంతంతో అందరికీ గ్యాస్ సిలిండర్లను అందిస్తోంది కేంద్రం. ఆశయం మంచిదే.. కానీ గ్యాస్ రేట్లు భారీగా పెంచితే ప్రయోజనం ఏంటి..? పేరిగిన రేట్లతో ఈ ఏడాది కోట్లమంది గ్యాస్ వాడకానికి దూరమయ్యారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 90 లక్షల మంది కనీసం ఒక్కసారి కూడా గ్యాస్ బుక్ చేయలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అంటే ఏడాదిగా 90లక్షల మంది ఇళ్లలో గ్యాస్ సిలిండర్ ఒక నిరర్థక ఆస్తిగా మిగిలిపోయింది. 1.08 కోట్ల మంది సంవత్సరంలో ఒకే ఒక్కసారి గ్యాస్ ను రీఫిల్ చేసుకున్నారు. ఈ గణాంకాలు చూస్తుంటే.. గ్యాస్ సిలిండర్ రేట్లు ప్రజలకు ఎంత భారంగా మారాయో అర్థమవుతోంది. పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచినా దాని పర్యవసానం ఇతర రేట్లపై పడుతుంది. ఎక్కువ రేటుకి డీజిల్ కొట్టిస్తే, ఆర్టీసీ రేట్లు పెంచుతుంది, ఇతర వాహనాలు కూడా చార్జీలు పెంచుతాయి. కానీ గ్యాస్ రేటు పెంచడం వల్ల వినియోగదారులు.. దాన్ని ఇతరులపై బదిలీ చేయడం కుదరదు. అందుకే అది నిత్యావసరం అయినా.. ఇప్పుడది భారత్ లో చాలామందికి అవసరం లేనిదిగా మారింది.

సమాచార హక్కు కార్యకర్త చంద్రశేఖర్ గౌర్.. IOCL, BPCL మరియు HPCL వద్ద గ్యాస్ సిలిండర్ల రీఫిలింగ్ కి సంబంధించిన వివరాలు సేకరించారు. ఒక్క ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) కి సంబంధించి 65 లక్షల మంది వినియోగదారులు 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఒక్కసారి కూడా తమ సిలిండర్ రీఫిల్ చేయలేదని తెలిపింది. HPCL కి సంబంధించి 2021-22 ఆర్థిక సంవత్సరంలో 9.175 లక్షల మంది వినియోగదారులు గ్యాస్ బుకింగ్ కి దూరంగా ఉన్నారు. మిగతా కంపెనీలది కూడా ఇదే పరిస్థితి. చాలా చాలని జీతాలు, రోజువారి కూలీలతో బతుకు నెట్టుకొస్తున్న చాలామందికి నెలకి వెయ్యి రూపాయలతో గ్యాస్ సిలిండర్ నింపుకోవడం చాలా కష్టం. అందుకే అవకాశం ఉన్నవాళ్లంతా కట్టెల పొయ్యికి మారిపోతున్నారు. మిగతావాళ్లు కూడా ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారు. ప్రభుత్వ పింఛన్ తో బతికేవాళ్లు, వృద్ధులు, గ్రామీణ ప్రాంతాల్లో నివశించే పేదలు.. ఇలా చాలా మంది ఇప్పుడు గ్యాస్ పొయ్యి వెలిగించట్లేదు, సిలిండర్లు వాడటంలేదు.

First Published:  9 May 2022 9:22 PM GMT
Next Story