Telugu Global
NEWS

బాబు రాజకీయం.. పొత్తులమయం.. ఒంటరిగా పోటీచేసే సత్తాలేదు : మంత్రి పెద్దిరెడ్డి

ఉత్తరాంధ్ర పర్యటనలో చంద్రబాబు పొత్తులపై చేసిన ప్రకటన రాష్ట్రంలో చర్చనీయాంశం అయ్యింది. కరోనా లాక్ డౌన్ టైం నుంచి హైదరాబాద్‌లోనే ఉంటూ.. అప్పుడప్పుడు మాత్రమే ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తున్న చంద్రబాబు తాజాగా రాష్ట్రంపై ఫోకస్ పెట్టినట్టున్నారు. ఎన్నికలకు మరో రెండేళ్ల గడువు ఉండగానే ఆయన పొలిటికల్ హీట్ పెంచేశారు. క్విట్ జగన్ అంటూ పిలుపునిస్తున్నారు. మరోవైపు వైసీపీని ఓడించాలంటే పొత్తులు తప్పవని వ్యాఖ్యానిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ విషయంపై మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. […]

బాబు రాజకీయం.. పొత్తులమయం.. ఒంటరిగా పోటీచేసే సత్తాలేదు : మంత్రి పెద్దిరెడ్డి
X

ఉత్తరాంధ్ర పర్యటనలో చంద్రబాబు పొత్తులపై చేసిన ప్రకటన రాష్ట్రంలో చర్చనీయాంశం అయ్యింది. కరోనా లాక్ డౌన్ టైం నుంచి హైదరాబాద్‌లోనే ఉంటూ.. అప్పుడప్పుడు మాత్రమే ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తున్న చంద్రబాబు తాజాగా రాష్ట్రంపై ఫోకస్ పెట్టినట్టున్నారు. ఎన్నికలకు మరో రెండేళ్ల గడువు ఉండగానే ఆయన పొలిటికల్ హీట్ పెంచేశారు. క్విట్ జగన్ అంటూ పిలుపునిస్తున్నారు. మరోవైపు వైసీపీని ఓడించాలంటే పొత్తులు తప్పవని వ్యాఖ్యానిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ విషయంపై మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో పర్యటించిన మంత్రి.. సచివాలయాల నూతన భవనాలను ప్రారంభించారు.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ‘టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జీవితమంతా పొత్తుల మయమే. ఏనాడూ ఆయన ఒంటరిగా పోటీచేసింది లేదు. ఏదో ఒక పార్టీతో రహస్య ఒప్పందం చేసుకోవడం.. లేదంటే నేరుగా పొత్తులు పెట్టుకోవడం ఆయనకు అలవాటు. చంద్రబాబుకు ప్రజాకర్షణ లేదు. విశ్వసనీయత లేదు. ప్రజలెవరూ టీడీపీని నమ్మరు.

అందుకే ఇష్టారాజ్యంగా పొత్తులు పెట్టుకుంటూ ముందుకు సాగుతారు. గత ఎన్నికల్లో తెలంగాణకు వెళ్లి.. కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకున్నారు. అంతకు ముందు బీజేపీతో పొత్తుపెట్టుకున్నారు. ఆయనకు ఓ రాజకీయ సిద్ధాంతం అంటూ లేదు. మళ్లీ ఇప్పుడేమో జనసేన, బీజేపీతో పొత్తులు పెట్టుకొనేందుకు అర్రులు చాస్తున్నారు. ఇటువంటి నీతిలేని రాజకీయనాయకుడిని ఎక్కడా చూడలేదు.

తప్పుడు హామీలు ఇవ్వడం.. వాటిని మరచిపోవడం.. ప్రతి విషయాన్ని రాజకీయం చేసి లబ్ధిపొందడం ఆయనకు అలవాటు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగానే పోటీచేస్తుంది. ఎవ్వరితోనూ పొత్తుపెట్టుకోదు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయి’ అని పెద్దిరెడ్డి పేర్కొన్నారు. తాము ఏ రాజకీయ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవడం లేదని ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు, మంత్రులు ప్రకటించిన విషయం తెలిసిందే.

First Published:  8 May 2022 8:04 AM GMT
Next Story