Telugu Global
NEWS

సీఎం జగన్ పై కుట్ర జరుగుతోంది..

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై కుట్రలు జరుగుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న సీఎంపై ప్రతిపక్ష నేతలు దుర్భాషలాడుతూ అసభ్య పదజాలాలు వాడుతున్నారని.. ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు బొత్స. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ నేతలంతా కలిసికట్టుగా ఉంటే మరోసారి అధికారంలోకి రావడం ఖాయమన్నారాయన. అధికారంలో లేనప్పుడు ఎన్నో ఇబ్బందులు పడ్డామని.. ఇప్పుడు అధికారంలో ఉన్నాం కాబట్టి దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత వైసీపీ నేతలందరిపై […]

సీఎం జగన్ పై కుట్ర జరుగుతోంది..
X

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై కుట్రలు జరుగుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న సీఎంపై ప్రతిపక్ష నేతలు దుర్భాషలాడుతూ అసభ్య పదజాలాలు వాడుతున్నారని.. ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు బొత్స. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ నేతలంతా కలిసికట్టుగా ఉంటే మరోసారి అధికారంలోకి రావడం ఖాయమన్నారాయన. అధికారంలో లేనప్పుడు ఎన్నో ఇబ్బందులు పడ్డామని.. ఇప్పుడు అధికారంలో ఉన్నాం కాబట్టి దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత వైసీపీ నేతలందరిపై ఉందని చెప్పారు మంత్రి బొత్స.

సర్దుకుపోవాల్సిందే..
వైసీపీ నేతలు ఒంటెద్దు పోకడలు పోకుండా కలిసికట్టుగా పనిచేయాలని హితవు పలికారు మంత్రి బొత్స. నాయకుల మధ్య అభిప్రాయ భేదాలు ఉంటే సరిదిద్దుకుని పనిచేయాలని, సర్దుకు పోవాలని సూచించారు. రాష్ట్ర ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోవాలన్న ఉద్దేశంతో గడప గడపకు వైసీపీ అనే కార్యక్రమాన్ని సీఎం జగన్ చేపట్టారని అన్నారు బొత్స. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఏవైనా లోటుపాట్లు ఉంటే వాటిని తెలుసుకుని సవరించి ప్రజలకు మరింత లబ్ధి జరిగేలా చూడాలని సూచించారు. పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడానికి గడప గడపకు వైసీపీ ఉపయోగపడుతుందన్నారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఇంటికి వైసీపీ నాయకులు వెళ్లాలని చెప్పారు.

మనది అన్న భావనే ఉండాలి..
అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో మహిళల భాగస్వామ్యం ఉండాల్సిందేనన్నారు మంత్రి బొత్స. పథకాల అమలులో ఎక్కడా అవినీతి ఆరోపణలు లేకుండా సక్రమంగా నిర్వహించాలన్నారు. అర్హులందరికీ పథకాలు అందుబాటులోకి తేవాలన్నారు. పేదవాళ్లకి దోచుపెడుతున్నారని చంద్రబాబు అనడం ఆయన మనస్తత్వాన్ని తెలియజేస్తోందని వివరించారు బొత్స. అందరి సంపదని, ప్రజలందరికీ పంచి పెడితే తప్పేంటని అన్నారు. రాష్ట్ర సంపద ప్రజలందరికీ అందాలన్నదే సీఎం జగన్ ఆలోచన అని చెప్పారు. నాది అన్న భావన వదిలేసి, మనది అన్న భావనతో అందరూ కలిసి పనిచేయాలన్నారు.

First Published:  8 May 2022 8:50 AM GMT
Next Story