Telugu Global
NEWS

ఏపీకి మరో తుపాను గండం.. సోమవారం నుంచి ప్రభావం ప్రారంభం..

ఇటీవల అకాల వర్షాలు రెండు తెలుగు రాష్ట్రాల రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేశాయి. కళ్లాలలో ధాన్యం వర్షానికి తడిసిపోయింది. తోటల్లో మామిడి నేల రాలింది. ఇది చాలదన్నట్టు ఇప్పుడు తుపాను ముప్పు పొంచి ఉంది. ఈ తుపానుకి అసని అని నామకరణం చేశారు. ప్రస్తుతం దీని ప్రభావం ఇంకా ప్రారంభం కాలేదు. సోమవారానికి అసని ప్రభావంతో కోస్తాలో భారీ వర్షాలు మొదలయ్యే అవకాశముందని భువనేశ్వర్ లోని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. విశాఖకు ఆగ్నేయంగా.. విశాఖ పట్టణానికి […]

ఏపీకి మరో తుపాను గండం.. సోమవారం నుంచి ప్రభావం ప్రారంభం..
X

ఇటీవల అకాల వర్షాలు రెండు తెలుగు రాష్ట్రాల రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేశాయి. కళ్లాలలో ధాన్యం వర్షానికి తడిసిపోయింది. తోటల్లో మామిడి నేల రాలింది. ఇది చాలదన్నట్టు ఇప్పుడు తుపాను ముప్పు పొంచి ఉంది. ఈ తుపానుకి అసని అని నామకరణం చేశారు. ప్రస్తుతం దీని ప్రభావం ఇంకా ప్రారంభం కాలేదు. సోమవారానికి అసని ప్రభావంతో కోస్తాలో భారీ వర్షాలు మొదలయ్యే అవకాశముందని భువనేశ్వర్ లోని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

విశాఖకు ఆగ్నేయంగా..
విశాఖ పట్టణానికి ఆగ్నేయంగా 970 కిలోమీటర్ల దూరంలో అసని తుపాను కేంద్రీకృతమైంది. ఈరోజు సాయంత్రం వరకు సాధారణ తుపాను గానే ఉంటుందని.. సోమవారానికి తీవ్రమైన తుపానుగా మారే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనావేస్తున్నారు. మంగళవారానికి దీని ప్రభావం మరింత ఎక్కువవుతుందని చెబుతున్నారు. ఆ తర్వాత తుపాను బలహీనపడుతుంది. గంటకు 80 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చని వాతావరణ శాఖ చెబుతోంది. ఏపీతోపాటు, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ లోని పలు జిల్లాల్లో అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు సూచించారు.

గంటకు 16కిలోమీటర్ల వేగంతో..
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి బలపడి తుపానుగా మారి వాయువ్య దిశగా గంటకు 16 కిలోమీటర్ల వేగంతో కదులుతోందని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. మంగళవారం నుంచి ఒడిశా, పశ్చిమ బెంగాల్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో దీని ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వచ్చే 24 గంటల్లో ఈ తుపాను మరింత బలపడి, ఆంధ్ర లేదా ఒడిశా తీరాలను తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

ఆ పేరు పెట్టింది శ్రీలంక..
బంగాళఖాతంలో ఏర్పడే తుపానులకు చుట్టూ ఉండే దేశాలు వంతుల వారీగా పేర్లు పెడుతుంటాయి. ఈసారి వస్తున్న తుపానుకు శ్రీలంక పేరు పెట్టింది. అసని అంటే సింహళ భాషలో కోపం, ఆగ్రహం అని అర్ధం. అసని కారణంగా ఎలాంటి విపత్కర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందోనని మూడు రాష్ట్రాల ప్రజలు, అధికారులు హడలిపోతున్నారు.

First Published:  8 May 2022 5:41 AM GMT
Next Story