Telugu Global
NEWS

గౌరవం లేదు.. అందుకే ఐపీఎల్ కు దూరం!.. మనసులో మాట బయటపెట్టిన క్రిస్ గేల్

టీ-20 క్రికెట్లో దిగ్గజ ఓపెనర్, ఐపీఎల్ లో ఆరు సెంచరీల మొనగాడు క్రిస్ గేల్ తన మనసులో మాట ఎట్టకేలకు బయటపెట్టాడు. ఐపీఎల్ 15వ సీజన్ పోటీలకు తాను ఎందుకు దూరమయ్యిందీ వివరించాడు. యూనివర్స‌ల్ బాస్ నారాజ్! అంతర్జాతీయ టీ-20 క్రికెట్ లీగ్ వర్గాలలో యూనివర్స‌ల్ బాస్ గా పేరున్న కరీబియన్ ఓపెనర్ క్రిస్ గేల్ లేకుండానే 2022 ఐపీఎల్ సమరం సాగిపోతోంది. భారీషాట్లు, సునామీ బ్యాటింగ్ కలగలిపి ఆటతీరునే తన వీరబాదుడు ఆటతీరుతో మార్చివేయగల క్రిస్ […]

గౌరవం లేదు.. అందుకే ఐపీఎల్ కు దూరం!.. మనసులో మాట బయటపెట్టిన క్రిస్ గేల్
X

టీ-20 క్రికెట్లో దిగ్గజ ఓపెనర్, ఐపీఎల్ లో ఆరు సెంచరీల మొనగాడు క్రిస్ గేల్ తన మనసులో మాట ఎట్టకేలకు బయటపెట్టాడు. ఐపీఎల్ 15వ సీజన్ పోటీలకు తాను ఎందుకు దూరమయ్యిందీ వివరించాడు.

యూనివర్స‌ల్ బాస్ నారాజ్!
అంతర్జాతీయ టీ-20 క్రికెట్ లీగ్ వర్గాలలో యూనివర్స‌ల్ బాస్ గా పేరున్న కరీబియన్ ఓపెనర్ క్రిస్ గేల్ లేకుండానే 2022 ఐపీఎల్ సమరం సాగిపోతోంది. భారీషాట్లు, సునామీ బ్యాటింగ్ కలగలిపి ఆటతీరునే తన వీరబాదుడు ఆటతీరుతో మార్చివేయగల క్రిస్ గేల్.. ఏడి, ఎక్కడ?..ప్రస్తుత ఐపీఎల్ లో ఎందుకు పాల్గొనడం లేదు అన్న అభిమానుల ప్రశ్నలకు ఎట్టకేలకు సమాధానం దొరికింది. ఐపీఎల్ ప్రారంభ (2008 ) సీజన్ నుంచి బెంగళూరు రాయల్ చాలెంజర్స్, పంజాబ్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్లకు ఆడుతూ వచ్చిన క్రిస్ గేల్.. ప్రస్తుత 15వ సీజన్ వేలానికి కావాలనే దూరంగా ఉన్నాడు. ఐపీఎల్ కు విశ్వవ్యాప్తంగా ఎంతో గుర్తింపు తెచ్చిన తనను ఫ్రాంచైజీలు చిన్నచూపు చూస్తున్నాయని, తానంటే ఏమాత్రం గౌరవం లేదని.. లండన్ నుంచి వెలువడే మిర్రర్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. గౌరవం లేని చోట క్షణమైనా ఉండకూడదన్నది తాను నమ్మే సత్యమని..గత కొద్ది సీజన్లుగా ఐపీఎల్ ఫ్రాంచైజీ యాజమాన్యాలు తనను ఏమాత్రం ఖాతరు చేయడంలేదని.. ఇది తనకు బాధకలిగించిందని, ..అంతర్జాతీయ టీ-20 క్రికెట్లో తాను ఏంటో పదేపదే నిరూపించుకోవాల్సిన అవసరమే లేదని తేల్చి చెప్పాడు. తన స్థాయికి తగ్గ గౌరవం దక్కనప్పుడు ఐపీఎల్ లో ఎందుకు ఆడాలని గేల్ ప్రశ్నించాడు.

రికార్డులు.. కోట్ల ఆదాయం..
ఐపీఎల్ లో 2008 ప్రారంభ సీజన్ నుంచి 2021 (14వ ) సీజన్ వరకూ క్రమం తప్పకుండా ఆడుతూ వచ్చిన గేల్ వందకోట్ల రూపాయలకు పైగా ఆర్జించాడు. అంతేకాదు..బెంగళూరు రాయల్ చాలెంజర్స్ తరపున టన్నుల కొద్దీ పరుగులు సాధించాడు. ఐపీఎల్ లో అత్యధిక సెంచరీలు, అత్యధిక సిక్సర్లు, అత్యధిక వ్యక్తిగత స్కోర్ల రికార్డులు ఇప్పటికీ క్రిస్ గేల్ పేరుతోనే ఉన్నాయి. గత 14 సీజన్లలో క్రిస్ గేల్ 142 మ్యాచ్ లు ఆడి.. ఆరు శతకాలతో సహా 4వేల 965 పరుగులు సాధించాడు. అత్యధికంగా 175 పరుగుల నాటౌట్ స్కోరుతో పాటు..39. 72 సగటు, 148. 96 స్ట్రయిక్ రేట్ నమోదు చేశాడు. అత్యధికంగా సిక్సర్లు బాదిన బ్యాటర్ రికార్డు సైతం గేల్ పేరుతోనే ఉంది.

కావాలని కోరితే సిద్ధం..
క్రికెట్టే జీవితం కాదని, క్రికెట్ లేని జీవితానికి తాను క్రమంగా అలవాటు పడుతున్నానని గేల్ చెప్పాడు. అయితే.. వచ్చే ఐపీఎల్‌ ( 2023 ) సీజన్లో తనసేవలు అవసరమని ఏ జట్టయినా కోరితే ఆడటానికి తాను సిద్ధమని గేల్ ప్రకటించాడు. ఐపీఎల్ కు తన ఆటతో ఎంతో గుర్తింపు తెచ్చిన తనలాంటి ఆటగాడు తగిన గౌరవం కోరుకోవ‌డంలో తప్పులేదని గేల్ సమర్థించుకొన్నాడు. గత 14 సీజన్లుగా గేల్ వయసుతో పాటే..కాంట్రాక్టు జీతం 8 కోట్ల రూపాయల నుంచి 2 కోట్ల రూపాయలకు పడిపోతూ రావడం విశేషం. దానికి తోడు గేల్ ఆటతీరులో వాడివేడి కూడా తగ్గట్టం కాదనిలేని విషయం. వీలు కుదిరితే.. బెంగళూరు, పంజాబ్ జట్లను ఐపీఎల్ విజేతగా చూడాలన్నదే తన లక్ష్యమని యూనివర్శల్ బాస్ వివరించాడు.

First Published:  8 May 2022 5:30 AM GMT
Next Story