Telugu Global
NEWS

ప్రపంచ టెన్నిస్ లో అగ్గిపిడుగు.. దిగ్గజాలను మట్టికరిపించిన కుర్రాడు

ప్రపంచ పురుషుల టెన్నిస్ అనగానే.. ముగ్గురు మొనగాళ్లు జోకోవిచ్, నడాల్, ఫెదరర్ అనుకొనే రోజులు పోయాయి. ఈ ముగ్గురు మొనగాళ్లను మించిన నవతరం ఆటగాడు, 19 ఏళ్ళ స్పానిష్ కుర్రాడు కార్లోస్ అల్ కరాజ్..రెండురోజుల్లో ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లను మట్టి కరిపించడం ద్వారా దూసుకొచ్చాడు. గత ఐదువారాలలో రెండోసారి ఏటీపీ మాస్టర్స్ ఫైనల్స్ చేరడం ద్వారా సంచలనం సృష్టించాడు. రెండురోజుల వ్యవధిలో.. కేవలం రెండురోజుల వ్యవధిలో ఇద్దరు ఆల్ టైమ్ గ్రేట్ స్టార్లు , ప్రపంచ నంబర్ […]

ప్రపంచ టెన్నిస్ లో అగ్గిపిడుగు.. దిగ్గజాలను మట్టికరిపించిన కుర్రాడు
X

ప్రపంచ పురుషుల టెన్నిస్ అనగానే.. ముగ్గురు మొనగాళ్లు జోకోవిచ్, నడాల్, ఫెదరర్ అనుకొనే రోజులు పోయాయి. ఈ ముగ్గురు మొనగాళ్లను మించిన నవతరం ఆటగాడు, 19 ఏళ్ళ స్పానిష్ కుర్రాడు కార్లోస్ అల్ కరాజ్..రెండురోజుల్లో ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లను మట్టి కరిపించడం ద్వారా దూసుకొచ్చాడు. గత ఐదువారాలలో రెండోసారి ఏటీపీ మాస్టర్స్ ఫైనల్స్ చేరడం ద్వారా సంచలనం సృష్టించాడు.

రెండురోజుల వ్యవధిలో..
కేవలం రెండురోజుల వ్యవధిలో ఇద్దరు ఆల్ టైమ్ గ్రేట్ స్టార్లు , ప్రపంచ నంబర్ వన్ నొవాక్ జోకోవిచ్, మాజీ నంబర్ వన్ రాఫెల్ నడాల్ లను మాడ్రిడ్ ఓపెన్ టోర్నీలో అధిగమించడం ద్వారా తానేమిటో…తన సత్తా ఏపాటిదో చాటిచెప్పాడు. స్పానిష్ బుల్ నడాల్ వారసుడిగా ప్రశంసలు అందుకొంటున్న కార్లోస్ అల్ కరాజ్ క్వార్టర్ ఫైనల్లో తన అభిమాన ఆటగాడు రాఫెల్ నడాల్ ను, సెమీఫైనల్లో.. ప్రపంచ టాప్ ర్యాంక్ ఆటగాడు జోకోవిచ్ ల పై అనూహ్య విజయాలు సాధించాడు.

3 గంటల 35 నిముషాల పోరు..
ఫైనల్లో చోటు కోసం జరిగిన సెమీస్ సమరంలో నువ్వానేనా అన్నట్లుగా సాగిన మారథాన్ సమరంలో 19 సంవత్సరాల కార్లోస్ అల్ కరాజ్.. తనకంటే 16 సంవత్సరాల పెద్ద, అంతర్జాతీయ టెన్నిస్ లో అపారఅనుభవం, డజన్లకొద్దీ గ్రాండ్ స్లామ్ టైటిల్స్ విజేత నొవాక్ జోకోవిచ్ ను కంగు తినిపించాడు.
తొలిసెట్ ను 6-7తో టైబ్రేక్ లో చేజార్చుకొన్న కార్లోస్…నిర్ణయాత్మక రెండోసెట్ ను 6-5తోనూ, విజేతను నిర్ణయించే ఆఖరి సెట్ ను 7-6 తో సొంతం చేసుకొని టైటిల్ సమరానికి అర్హత సంపాదించాడు. క్వార్టర్ ఫైనల్లో నడాల్, సెమీఫైనల్లో జోకోవిచ్ లాంటి మొనగాళ్లను మట్టికరిపించిన కార్లోస్…ప్రస్తుత సీజన్లో ఏడుగురు టాప్-10 ర్యాంక్ ఆటగాళ్లను ఓడించడం విశేషం. రెండువారాల క్రితమే బార్సిలోనా ఓపెన్ టైటిల్ నెగ్గిన కార్లోస్..మాడ్రిడ్ ఓపెన్ ఫైనల్లో..ప్రపంచ రెండో ర్యాంక్ ఆటగాడు అలెగ్జాండర్ జ్వెరేవ్ లేదా స్టెఫానోస్ సిట్సిపాస్ లలో ఎవరో ఒకరితో తలపడనున్నాడు. జోకోవిచ్ తో సమరంలో కార్లోస్ మొత్తం 35 పాయింట్లు సాధించడంతో పాటు క్రాస్ కోర్ట్ షాట్లు కొట్టడంలో వయసుకు మించిన ప్రతిభ కనబరిచాడు.

వారసుడొచ్చాడు..
గత వారం రోజుల్లో వరుసగా తొమ్మిదో విజయం సాధించిన కార్లోస్ అల్ కరాజ్..ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు జోకోవిచ్ ను చిత్తు చేసిన అత్యంత తక్కువ వయసున్న ప్లేయర్ గా రికార్డుల్లో చేరాడు. వయసుకు మించిన ప్రతిభ, అసాధారణ ఆటతీరుతో ప్రత్యర్థులతో పాటు విమర్శకులు, విశ్లేషకులను కట్టి పడేస్తున్న కార్లోస్ అల్ కరాజ్ ను…దిగ్గజత్రయం జోకోవిచ్, నడాల్, ఫెడరర్ లకు తగిన వారసుడిగా భావిస్తున్నారు. రానున్నకాలం ఈ స్పానిష్ పోట్లగిత్తదేనని భావిస్తున్నారు.

First Published:  8 May 2022 6:17 AM GMT
Next Story