Telugu Global
NEWS

త్యాగధనులారా తెలుసుకోండి.. త్యాగాల బుట్టలో పడేది లేదు..

“వైసీపీని గద్దె దించేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలి, దానికి నాయకత్వం మేం వహిస్తాం, ఎంతటి త్యాగానికైనా మేం సిద్ధం..” అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. ఈమధ్య త్యాగానికి సిద్ధంగా ఉన్నామంటూ కొంతమంది మాట్లాడుతున్నారని, గతంలో చాలా సార్లు ఆ త్యాగాలను గమనించామని, ఇకపై వారి బుట్టలో పడేందుకు తాము సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. త్యాగధనులారా తెలుసుకోండి.. అవినీతి రాజకీయాలకు, కుటుంబ పార్టీలకు తాము వ్యతిరేకం అన్నారు […]

త్యాగధనులారా తెలుసుకోండి.. త్యాగాల బుట్టలో పడేది లేదు..
X

“వైసీపీని గద్దె దించేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలి, దానికి నాయకత్వం మేం వహిస్తాం, ఎంతటి త్యాగానికైనా మేం సిద్ధం..” అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. ఈమధ్య త్యాగానికి సిద్ధంగా ఉన్నామంటూ కొంతమంది మాట్లాడుతున్నారని, గతంలో చాలా సార్లు ఆ త్యాగాలను గమనించామని, ఇకపై వారి బుట్టలో పడేందుకు తాము సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. త్యాగధనులారా తెలుసుకోండి.. అవినీతి రాజకీయాలకు, కుటుంబ పార్టీలకు తాము వ్యతిరేకం అన్నారు వీర్రాజు. 2024లో ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. అభివృద్ది, సంక్షేమం బీజేపీ దగ్గర ఉందని, కుటుంబ పార్టీలకోసం బీజేపీ త్యాగం చేయాల్సిన అవసరం లేదన్నారు.

విజయవాడలో జరిగిన బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న సోము వీర్రాజు ఏపీలో పొత్తు రాజకీయాలపై క్లారిటీ ఇచ్చారు. ఓవైపు ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చేది లేదంటూ పవన్ కల్యాణ్ చెబుతున్నా.. మరోవైపు వీర్రాజు మాత్రం టీడీపీతో పొత్తు లేదని పరోక్షంగా తేల్చి చెప్పారు. పైగా త్యాగాల రాజకీయం, మోసాల రాజకీయం అంటూ ఆయన చంద్రబాబుని దెప్పిపొడిచారు. టీడీపీతో కలిస్తే మోసపోవాల్సిందేనని అన్నారు.

మాట మాటకి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పే ఏపీ సీఎం జగన్.. కేంద్రం అమలు చేస్తున్న కార్యక్రమాలను ఎందుకు గుర్తు చేయడంలేదని ప్రశ్నించారు వీర్రాజు. ప్రధాని అమలు చేసే సంక్షేమం ముందు, జగన్ సంక్షేమం తీసికట్టు అని అన్నారాయన. అన్ని వర్గాల వారికి మోదీ ప్రాధాన్యత ఇచ్చి మంచి పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. బీజేపీ కార్యకర్తలు వికాసం, విజ్ఞానంతో ఆలోచించి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

First Published:  8 May 2022 7:22 AM GMT
Next Story