Telugu Global
NEWS

కాంగ్రెస్‌తో ఎవరైనా పొత్తుపెట్టుకుంటారా?.. అది కాలం చెల్లిన పార్టీ.. " మంత్రి కేటీఆర్..!

కాలం చెల్లిన కాంగ్రెస్ పార్టీతో ఈ దేశంలో ఎవరైనా పొత్తు పెట్టుకుంటారా? అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. శనివారం వరంగల్ మెగా టెక్స్ టైల్ పార్కులో నిర్మించబోయే ఓ వస్త్ర పరిశ్రమను కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ’ ఏఐసీసీ అంటే ఆల్ ఇండియా క్రైసిస్ కమిటీ.. ఆ పార్టీ ఎన్నో సంక్షోభాలతో కొట్టుమిట్టాడుతోంది. రాహుల్ గాంధీ సొంత నియోజకవర్గంలోనే గెలవలేకపోయారు. ఆయన ఇక్కడ […]

కాంగ్రెస్‌తో ఎవరైనా పొత్తుపెట్టుకుంటారా?.. అది కాలం చెల్లిన పార్టీ..  మంత్రి కేటీఆర్..!
X

కాలం చెల్లిన కాంగ్రెస్ పార్టీతో ఈ దేశంలో ఎవరైనా పొత్తు పెట్టుకుంటారా? అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. శనివారం వరంగల్ మెగా టెక్స్ టైల్ పార్కులో నిర్మించబోయే ఓ వస్త్ర పరిశ్రమను కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ’ ఏఐసీసీ అంటే ఆల్ ఇండియా క్రైసిస్ కమిటీ.. ఆ పార్టీ ఎన్నో సంక్షోభాలతో కొట్టుమిట్టాడుతోంది. రాహుల్ గాంధీ సొంత నియోజకవర్గంలోనే గెలవలేకపోయారు. ఆయన ఇక్కడ కాంగ్రెస్ పార్టీని ఎలా గెలిపించగలరు. తెలంగాణ కాంగ్రెస్‌ను ఓ గాడ్సే చేతిలో పెట్టారు. ఆ పార్టీ ఎప్పటికీ అధికారంలోకి రాలేదు.

వరంగల్ సభలో పెట్టిన రైతు డిక్లరేషన్ అంతా డొల్ల. అందులో కొత్తగా ఏముంది? గతంలో కాంగ్రెస్ చెప్పిన హామీలనే ఇక్కడ రిపీట్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే రుణమాఫీ చేశాం. ఈ విషయం రైతులకు తెలుసు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు ఇస్తున్నాం. కాంగ్రెస్ హయాంలో రైతులకు పెట్టుబడి సాయం, 24 గంటల విద్యుత్ ఇచ్చారా?’ అని ప్రశ్నించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ వ్యవసాయరంగాన్ని సంక్షోభంగా మార్చిందని చెప్పుకొచ్చారు.

తాము అధికారంలోకి వచ్చాక వ్యవసాయాన్ని ఓ జాతరలా చేశామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమపథకాలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలవుతున్నాయా? అని ప్రశ్నించారు. కేసీఆర్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం తీసుకురావడం వల్లే.. టీపీసీసీ, టీ బీజేపీ ఏర్పడి ఆ పార్టీ నేతలకు పదవులు దక్కాయని పునరుద్ఘాటించారు. కాంగ్రెస్ డిక్లరేషన్ ను రైతులు ఎవరూ నమ్మొద్దని సూచించారు. గతంలో కాంగ్రెస్ రైతులకు తీరని అన్యాయం చేసిందని పేర్కొన్నారు.

First Published:  7 May 2022 10:10 AM GMT
Next Story