Telugu Global
Cinema & Entertainment

విరాటపర్వం వచ్చేస్తోంది

రానా దగ్గుబాటి, సాయిప‌ల్లవి జంట‌గా వేణు ఊడుగుల ద‌ర్శక‌త్వంలో రూపొందుతున్న వైవిధ్యమైన చిత్రం ‘విరాట‌ప‌ర్వం’. సురేష్ బాబు స‌మ‌ర్పణ‌లో ఎస్‌.ఎల్‌.వి. సినిమాస్ బ్యానర్ పై సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా విడుదల తేదిని చిత్ర యూనిట్ ప్రకటించింది. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా జూలై 1 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్ మెంట్ పోస్టర్ ఆసక్తికంరగా వుంది. అడవిలో రానా గన్ గురి పెట్టుకొని దూకుడుగా నడుస్తుండగా […]

virata parvam
X

రానా దగ్గుబాటి, సాయిప‌ల్లవి జంట‌గా వేణు ఊడుగుల ద‌ర్శక‌త్వంలో రూపొందుతున్న వైవిధ్యమైన చిత్రం ‘విరాట‌ప‌ర్వం’. సురేష్ బాబు స‌మ‌ర్పణ‌లో ఎస్‌.ఎల్‌.వి. సినిమాస్ బ్యానర్ పై సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా విడుదల తేదిని చిత్ర యూనిట్ ప్రకటించింది. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా జూలై 1 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రానుంది.

ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్ మెంట్ పోస్టర్ ఆసక్తికంరగా వుంది. అడవిలో రానా గన్ గురి పెట్టుకొని దూకుడుగా నడుస్తుండగా సాయి పల్లవి రానా చేయి పట్టుకొని పరుగు తీయడం ఒక వార్ మూమెంట్ ని తలపిస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌, ఫస్ట్‌ సింగిల్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. త్వరలో చిత్ర యూనిట్ ప్రచార జోరు పెంచనుంది.

1990లలో తెలంగాణలో జరిగిన యదార్థ సంఘటనల నుండి ప్రేరణ పొంది తెరకెక్కించిన ఈ చిత్రంలో రానా కామ్రేడ్ రవన్న పాత్రను పోషించాడు. సాయిపల్లవి, వెన్నెల పాత్రలో కనిపించనుంది. యుద్ధం నేపథ్యంలో సాగే ఓ అద్భుతమైన ప్రేమకథగా విరాట పర్వం తెరకెక్కింది. సినిమాలో చాలా భాగాన్ని నాచురల్ లొకేషన్స్ లోనే చిత్రీకరించారు.

ప్రియ‌మ‌ణి, నందితా దాస్‌, న‌వీన్ చంద్ర, జ‌రీనా వ‌హాబ్‌, ఈశ్వరీ రావ్‌, సాయిచంద్‌ ఈ సినిమాలో ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నాడు.

First Published:  7 May 2022 3:11 AM GMT
Next Story