Telugu Global
Cinema & Entertainment

సిక్స్ ప్యాక్ లో సందీప్ కిషన్

వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ ఛాలెంజింగ్ రోల్స్ చేయడం సందీప్ కిషన్ కు ఇష్టం. కథలో పాత్రకి తగ్గట్టు సరికొత్తగా తనని తానూ మలుచుకుంటాడు ఈ హీరో. ఇప్పుడు తన కొత్త సినిమా కోసం సిక్స్ ప్యాక్ లోకి మారాడు సందీప్. రంజిత్ జయ‌కొడి దర్శకత్వంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రత్యేక పాత్రలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మైఖేల్‌’ చిత్రంతో పాన్ ఇండియాలోకి అడుగుపెట్టాడు. సందీప్ కిషన్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ‘మైఖేల్’ ఫస్ట్ లుక్ […]

సిక్స్ ప్యాక్ లో సందీప్ కిషన్
X

వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ ఛాలెంజింగ్ రోల్స్ చేయడం సందీప్ కిషన్ కు ఇష్టం. కథలో పాత్రకి తగ్గట్టు సరికొత్తగా తనని తానూ మలుచుకుంటాడు ఈ హీరో. ఇప్పుడు తన కొత్త సినిమా కోసం సిక్స్ ప్యాక్ లోకి మారాడు సందీప్. రంజిత్ జయ‌కొడి దర్శకత్వంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రత్యేక పాత్రలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మైఖేల్‌’ చిత్రంతో పాన్ ఇండియాలోకి అడుగుపెట్టాడు.

సందీప్ కిషన్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ‘మైఖేల్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ”గాడ్ ఓన్లీ ఫర్గివ్స్ ”అనే క్యాప్షన్ తో వచ్చిన ఈ పోస్టర్ లో సందీప్ కిషన్, సిక్స్ ప్యాక్ లో కనిపిస్తున్నాడు. చేతిలో ఆయుధాలతో తన వద్దకు వస్తున్న క్రూరమైన వ్యక్తులుపై అంతే క్రూరంగా సందీప్ కిషన్ గన్ తో గురిపెట్టడం ఈ పోస్టర్ లో చూడొచ్చు.

ఇదొక ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్ టైనర్ అనే విషయాన్ని ఈ ఒక్క పోస్టర్ తోనే క్లియర్ గా చెప్పేశారు మేకర్స్. స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తుండగా, సందీప్ కిషన్ సరసన దివ్యాంశ కౌశిక్ హీరోయిన్‌గా నటిస్తోంది. వరలక్ష్మి శరత్‌కుమార్, వరుణ్ సందేశ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న మైఖేల్ చిత్రాన్ని నారాయ‌ణ్ దాస్ కె.నారంగ్ స‌మ‌ర్పణ‌లో భ‌ర‌త్ చౌద‌రి, పుస్కూర్ రామ్మోహ‌న్ రావు నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. సందీప్ కు ఇదే తొలి పాన్ ఇండియా మూవీ కావడం విశేషం.

First Published:  7 May 2022 3:16 AM GMT
Next Story