Telugu Global
NEWS

హైదరాబాద్ లో ఉండొద్దు.. ఢిల్లీకి అస్సలు రావొద్దు..

తెలంగాణ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు రాహుల్ గాంధీ. గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఎన్నికల ఏడాదిలో పార్టీని ఎలా బలోపేతం చేయాలనే విషయంలో నాయకులకు పలు సూచనలు చేశారు. వరంగల్ డిక్లరేషన్ తో పార్టీకి జవసత్వాలు తిరిగి తీసుకు రావాలన్నారు రాహుల్ గాంధీ. కాంగ్రెస్ నేతలెవరూ హైదరాబాద్‌ లో ఉండొద్దని, ఢిల్లీకి అసలు రావొద్దని చెప్పారు. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలని […]

హైదరాబాద్ లో ఉండొద్దు.. ఢిల్లీకి అస్సలు రావొద్దు..
X

తెలంగాణ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు రాహుల్ గాంధీ. గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఎన్నికల ఏడాదిలో పార్టీని ఎలా బలోపేతం చేయాలనే విషయంలో నాయకులకు పలు సూచనలు చేశారు. వరంగల్ డిక్లరేషన్ తో పార్టీకి జవసత్వాలు తిరిగి తీసుకు రావాలన్నారు రాహుల్ గాంధీ. కాంగ్రెస్ నేతలెవరూ హైదరాబాద్‌ లో ఉండొద్దని, ఢిల్లీకి అసలు రావొద్దని చెప్పారు. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరారు. వరంగల్ డిక్లరేషన్ గురించి రాష్ట్రంలోని ప్రజలకు వివరించాలని, ప్రతి ఒక్కరూ ప్రజల మధ్య తిరగాలని సూచించారు.

ప్రెస్ మీట్లతోనే సరిపెట్టొద్దు..
కాంగ్రెస్ నేతలు ఇకపై కేవలం ప్రెస్‌మీట్లు పెట్టి మాటలతో సరిపెట్టకుండా.. తమతమ నియోజకవర్గాలకు వెళ్ళి రైతులు, నిరుద్యోగులు, మహిళలు, యువకులు, కార్మికులు.. అన్ని వర్గాల వారిని కలవాలని సూచించారు రాహుల్ గాంధీ. ఎంతటి సీనియర్ లీడర్లైనా సరే… పని చేస్తేనే, ప్రజల్లో ఉంటేనే గుర్తింపు ఉంటుందని అన్నారు. కష్టపడి పని చేసిన వారికి మాత్రమే మెరిట్ ప్రాతిపదికన ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఉంటుందని, వారికే కాంగ్రెస్ టికెట్లు ఇస్తుందని చెప్పారు.

విభేదాలు పక్కనపెట్టండి..
ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లో గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయి. రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి, కోమటి రెడ్డి వెంకటరెడ్డి.. ఇలా అన్ని గ్రూపులు ఉన్నా కూడా అందరూ పార్టీలోనే ఉన్నారు. అయితే ఇకపై అంతర్గత విబేధాలకు స్వస్తి పలికాలని పిలుపునిచ్చారు రాహుల్ గాంధీ. ప్రతి ఒక్కరూ పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని స్పష్టం చేసారు. తెలంగాణ ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తులు పెట్టుకోబోమని, ఇప్పటినుంచే నేతలు ఆ దిశగా ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధమవ్వాలని, టీఆర్ఎస్, బీజేపీ తీరుని ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్లాలని పిలుపునిచ్చారు రాహుల్ గాంధీ.

First Published:  7 May 2022 7:37 AM GMT
Next Story