Telugu Global
NEWS

6 బంతులు.. 9 పరుగులు.. ఆఖరి ఓవర్లో ముంబై మ్యాజిక్

ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది క్రికెట్ అభిమానులను గత 15 సీజన్లుగా అలరిస్తూ వస్తున్న ఐపీఎల్ ప్రస్తుత సీజన్ మ్యాచ్ లు కొంతపుంతలు తొక్కుతున్నాయి. జట్ల సంఖ్య 8 నుంచి 10కి పెరగటం, లీగ్ దశ మ్యాచ్ లు 60 నుంచి 70కి పెరగడంతో ఆఖరి ఓవర్ ఆఖరు బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగే మ్యాచ్ ల సంఖ్య రానురాను పెరిగిపోతోంది. ముంబై బ్రబోర్న్ స్టేడియం వేదికగా టేబుల్ టాపర్ గుజరాత్ టైటాన్స్, లీగ్ టేబుల్ అట్టడుగున కొనసాగుతున్న […]

6 బంతులు.. 9 పరుగులు.. ఆఖరి ఓవర్లో ముంబై మ్యాజిక్
X

ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది క్రికెట్ అభిమానులను గత 15 సీజన్లుగా అలరిస్తూ వస్తున్న ఐపీఎల్ ప్రస్తుత సీజన్ మ్యాచ్ లు కొంతపుంతలు తొక్కుతున్నాయి. జట్ల సంఖ్య 8 నుంచి 10కి పెరగటం, లీగ్ దశ మ్యాచ్ లు 60 నుంచి 70కి పెరగడంతో ఆఖరి ఓవర్ ఆఖరు బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగే మ్యాచ్ ల సంఖ్య రానురాను పెరిగిపోతోంది. ముంబై బ్రబోర్న్ స్టేడియం వేదికగా టేబుల్ టాపర్ గుజరాత్ టైటాన్స్, లీగ్ టేబుల్ అట్టడుగున కొనసాగుతున్న ముంబై ఇండియన్స్ జట్ల మధ్య ముగిసిన లీగ్ దశ 51వ మ్యాచ్ ఆఖరి ఓవర్ ఆఖరి బంతి వరకూ పట్టుగా, రసపట్టుగా సాగి..అభిమానులను ఉత్కంఠ నడుమ ఊపిరాడకుండా చేసింది.

సామ్స్ కమాల్.. గుజరాత్ ఢమాల్!
ప్రస్తుత 15వ సీజన్ లీగ్ మొదటి 10 రౌండ్లలో 8 విజయాలు సాధించడం ద్వారా 16 పాయింట్లతో టేబుల్ టాపర్ గా కొనసాగుతున్న గుజరాత్ టైటాన్స్ కు చేజింగ్ లో తిరుగులేని రికార్డే ఉంది. ఇప్పటి వరకూ గుజరాత్ సాధించిన విజయాలలో చేజింగ్ కు దిగినవే ఎక్కువ ఉన్నాయి. పైగా ఆఖరి (20వ ) ఓవర్ లో నెగ్గినవే మరీ ఎక్కువ. అలాంటి ఘనమైన రికార్డున్న గుజరాత్..ముంబైతో జరిగిన 11వ రౌండ్ మ్యాచ్ లో మాత్రం ఆఖరి ఆరు బంతుల్లో విజయానికి అవసరమైన 9 పరుగులు సాధించడంలో విఫలమయ్యింది.
5 పరుగుల పరాజయాన్ని చవిచూసింది. గుజరాత్ సూపర్ హిట్టర్లు, మ్యాచ్ ఫినిషింగ్ లో మొనగాళ్లుగా పేరుపొందిన డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా క్రీజులో ఉంటే.. ఆఖరి ఓవర్ బౌల్ చేయటానికి.. ఎడమచేతి వాటం పేసర్ డేనియల్ సామ్స్ ను ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ కు దించాడు. ఆఖరి ఆరుబంతుల్లో 9 పరుగులు సాధించడమే గుజరాత్ లక్ష్యం కాగా.. ఆరు బంతుల్లో 8 పరుగులను కాపాడుకోటం ముంబై టార్గెట్ గా మిగిలింది. డేనియల్ సామ్స్ తన బౌలింగ్ వేగాన్ని పూర్తిగా తగ్గించి..చేంజ్ ఆఫ్ పేస్ వ్యూహంతో గుజరాత్ జోడీని బోల్తా కొట్టించాడు. సామ్స్ కేవలం 6 బంతుల్లో 3 పరుగులు మాత్రమే ఇచ్చాడు. 20వ ఓవర్ 3వ బంతికి తెవాటియా రనౌట్ కావడంతో ముంబై విజయం ఖాయమైపోయింది. అఖరి 2 బాల్స్ లో 6 పరుగులు, ఆఖరి బంతికి 6 పరుగులు చేయాల్సిన స్థితిలో ఉన్నా.. చివరకు గుజరాత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 172 పరుగులు మాత్రమే చేయగలిగింది.

అప్పుడు 35 పరుగులు.. ఇప్పుడు 3 పరుగులు..
నెలరోజుల క్రితం కోల్ కతా నైట్ రైడర్స్ తో ముగిసిన లీగ్ మ్యాచ్ లో డేనియల్ సామ్స్ కేవలం ఒక్క ఓవర్లోనే 35 పరుగులిచ్చి తనజట్టు ఓటమికి కారణమయ్యాడు. అదే సామ్స్ ..గుజరాత్ తో ముగిసిన మ్యాచ్ లో మాత్రం చివరి ఆరుబంతుల్లో మూడంటే మూడు పరుగులు మాత్రమే ఇచ్చి మ్యాచ్ విన్నర్ గా నిలిచాడు.

First Published:  7 May 2022 6:02 AM GMT
Next Story