Telugu Global
NEWS

ఎగ్జామ్స్ ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే..

చాలామంది స్టూడెంట్స్‌కు పరీక్షలు జరిగే సమయమిది. అయితే ఎగ్జామ్స్ టైంలో విద్యార్థుల్లో కంగారు మొదలవుతుంది. దీంతో కొంతమంది స్టూడెంట్స్‌పై ఒత్తిడి పెరిగి ఆ ప్రభావం ఎగ్జామ్ రిజల్ట్స్‌పై పడుతుంది. అసలు ఎగ్జామ్స్ టైంలో ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే.. ఎగ్జామ్స్ టైంలో తీరిక లేకుండా అదేపనిగా చదవడం, నిద్రపోకుండా చదవడం లాంటి మిస్టేక్స్ చేస్తుంటారు చాలామంది. పరీక్షల సమయంలో సరైన ప్లానింగ్ ఉంటే ఎగ్జామ్స్‌ను ఇట్టే క్రాక్ చేయొచ్చు. అదెలాగంటే.. సిలబస్ ఇలా.. ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అయ్యేటప్పుడు సిలబస్‌ను […]

ఎగ్జామ్స్ ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే..
X

చాలామంది స్టూడెంట్స్‌కు పరీక్షలు జరిగే సమయమిది. అయితే ఎగ్జామ్స్ టైంలో విద్యార్థుల్లో కంగారు మొదలవుతుంది. దీంతో కొంతమంది స్టూడెంట్స్‌పై ఒత్తిడి పెరిగి ఆ ప్రభావం ఎగ్జామ్ రిజల్ట్స్‌పై పడుతుంది. అసలు ఎగ్జామ్స్ టైంలో ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే..

ఎగ్జామ్స్ టైంలో తీరిక లేకుండా అదేపనిగా చదవడం, నిద్రపోకుండా చదవడం లాంటి మిస్టేక్స్ చేస్తుంటారు చాలామంది. పరీక్షల సమయంలో సరైన ప్లానింగ్ ఉంటే ఎగ్జామ్స్‌ను ఇట్టే క్రాక్ చేయొచ్చు. అదెలాగంటే..

సిలబస్ ఇలా..
ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అయ్యేటప్పుడు సిలబస్‌ను డివైడ్ చేసుకుని ఒక ప్లానింగ్ ప్రకారం చదివాలి. ఎగ్జామ్‌కు ఎన్ని రోజులు ఉన్నాయో అన్ని రోజులకు తగ్గట్టు చదవాల్సిన టాపిక్స్‌ను టైం టేబుల్ ప్రకారం ప్లాన్ చేసుకోవాలి.

రివిజన్..
ఎగ్జామ్స్ టైంలో రివిజన్‌ను పక్కాగా ప్లాన్ చేసుకోవాలి. ఒకసారి చదివి వదిలేస్తే ఏమీ గుర్తుండదు. అందుకే ఇంపార్టెంట్ టాపిక్స్‌ను ఒక నోట్స్‌లో రాసుకుని తరచూ వాటిని రివైజ్ చేస్తూ ఉండాలి.

వేగంగా చదివేలా..
ఎగ్జామ్స్ టైంలో వేగంగా చదివేందుకు స్పీడ్ రీడింగ్‌ను అలవాటు చేసుకోవాలి. కళ్లతో స్పీడ్‌గా చదువుతూనే మధ్యలో ముఖ్యమైన పాయింట్స్‌ను నోట్ చేసుకుంటూ ఉండాలి. ఇలా చేస్తే చాలా సమయం కలిసొస్తుంది.

చదివే టైం..
ఇకపోతే చదివే సమయం కూడా ఎంతో ముఖ్యం. ఏ సమయంలో చదివితే మీకు ఎక్కువగా గుర్తుంటుందో ఆ టైంలోనే ప్రిపేర్ అయ్యేలా ప్లాన్ చేసుకోవాలి. అలసట అనిపించినప్పుడు బ్రేక్ తీసుకోవాలే గానీ బలవంతంగా చదివే ప్రయత్నం చేయకూడదు.

లైట్ ఫుడ్..
ఎగ్జామ్స్ టైంలో తేలికగా జీర్ణమయ్యే లైట్ ఫుడ్ తీసుకోవాలి. జంక్ ఫుడ్, మసాలా ఫుడ్స్, నాన్‌వెజ్ ఫుడ్స్ తినడం వల్ల పరీక్షల టైంలో మగతగా అనిపించే అవకాశం ఉంది.

నిద్ర..
ఎగ్జామ్స్ టైంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిద్రను వాయిదా వేయకూడదు. ఎగ్జామ్‌ని సరిగ్గా అటెంప్ట్ చేయాలంటే యాక్టివ్‌గా ఉండడం ముఖ్యం. అందుకే కంటికి సరిపడా నిద్రపోవాలి.

పాజిటివ్‌గా..
అన్నింటికంటే ముఖ్యంగా ఎగ్జామ్స్‌ను ఎలా రాసినా దాన్ని పూర్తిగా అంగీకరించాలి. మీ ప్రతిభను ఇంకెలా ఇంప్రూవ్ చేసుకోవాలో ఆలోచించాలి. అంతేకానీ బాగా రాయలేదని, ఇతరులతో పోల్చుకుని మానసికంగా కుంగిపోవడం వల్ల లాభం లేదు.

First Published:  7 May 2022 6:12 AM GMT
Next Story