Telugu Global
Health & Life Style

సమ్మర్‌లో చల్లదాన్నిచ్చే డ్రింక్స్ ఇవే..

మండే ఎండల్లో వేడి తాపాన్ని తగ్గించడానికి చల్లని పానీయాలు ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగని బయట దొరికే సాఫ్ట్ డ్రింక్స్‌ తాగితే ఉపయోగం లేదు. సమ్మర్ కోసం ఇంట్లోనే చల్లని కూలర్ డ్రింక్స్ తయారుచేసుకోవచ్చు. ఎలాగంటే.. సమ్మర్‌లో కొన్ని డ్రింక్స్‌ను తాగడం వల్ల వేసవి తాపం నుంచి రిలీఫ్ కలగడంతో పాటు శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. అలాంటి కొన్ని డ్రింక్స్ ఇప్పుడు చూద్దాం. లైమ్ మింట్ కూలర్ మిక్సీ జార్‌లో కొద్దిగా నిమ్మరసం పిండి, అందులో కొన్ని […]

సమ్మర్‌లో చల్లదాన్నిచ్చే డ్రింక్స్ ఇవే..
X

మండే ఎండల్లో వేడి తాపాన్ని తగ్గించడానికి చల్లని పానీయాలు ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగని బయట దొరికే సాఫ్ట్ డ్రింక్స్‌ తాగితే ఉపయోగం లేదు. సమ్మర్ కోసం ఇంట్లోనే చల్లని కూలర్ డ్రింక్స్ తయారుచేసుకోవచ్చు. ఎలాగంటే..

సమ్మర్‌లో కొన్ని డ్రింక్స్‌ను తాగడం వల్ల వేసవి తాపం నుంచి రిలీఫ్ కలగడంతో పాటు శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. అలాంటి కొన్ని డ్రింక్స్ ఇప్పుడు చూద్దాం.

లైమ్ మింట్ కూలర్
మిక్సీ జార్‌లో కొద్దిగా నిమ్మరసం పిండి, అందులో కొన్ని తాజా పుదీనా ఆకులు వేసి, మిక్సీలో బ్లెండ్ చేయాలి. ఇందులో తీపి కోసం తేనె లేదా షుగర్‌ను యాడ్ చేసి, ఐస్ క్యూబ్స్ వేసుకుని తాగితే లెమన్ మింట్ కూలర్ రెడీ

ఆరెంజ్ ఎనర్జీ డ్రింక్
మరిగించిన నీటిలో రెండు టీస్పూన్ల తేనె, అరటీస్పూన్ ఉప్పు వేసి కరిగే వరకు కలపాలి. తర్వాత మరో గ్లాసులో నీళ్లు తీసుకొని, దానికి ఒక నారింజ పండు జ్యూస్‌, ఒక నిమ్మకాయ రసాన్ని కలపాలి. ఇప్పుడు ఈ రెండు గ్లాసుల్లోని నీళ్లను కలిపేసి, ఫ్రిజ్‌లో పెడితే ఆరెంజ్ ఎనర్జీ డ్రింక్ రెడీ.

వాటర్‌మిలన్ చిల్లర్
పుచ్చకాయను చిన్న చిన్న ముక్కలుగా కోసి, మిక్సీలో వేసి అందులో అరకప్పు దానిమ్మ గింజలు, నిమ్మరసం, రెండు పుదీనా ఆకులు వేసి బ్లెండ్ చేయాలి. ఇప్పుడు ఆ రసంలో ఐస్ క్యూబ్స్ వేసుకుని లేదా డీప్ ఫ్రిజ్‌లో పెట్టి తీసుకుంటే వాటర్ మిలన్ చిల్లర్ రెడీ.

కీరా-మింట్ ఐస్డ్ టీ
నాలుగు గ్రీన్ టీ బ్యాగుల్ని నాలుగు కప్పుల నీళ్లలో వేసి అందులో కీరా ముక్కలు, పుదీనా ఆకుల్ని వేసి పావుగంట పాటు సిమ్‌లో మరిగించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, ఆ మిశ్రమం చల్లారాక గ్లాస్‌లోకి వడకట్టుకోవాలి. ఇప్పుడు దీనిని నిమ్మరసం, తేనె, ఐస్ ముక్కలు యాడ్ చేస్తే కీరా మింట్ ఐస్డ్ టీ రెడీ

First Published:  7 May 2022 6:38 AM GMT
Next Story