Telugu Global
NEWS

డకౌట్లలో మరో చెత్తరికార్డు.. రోహిత్ శర్మ సరసన మన్ దీప్ సింగ్

టాటా ఐపీఎల్ 15వ సీజన్ పోటీలలో రికార్డుల మోత మోగుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య ముంబై బ్రబోర్న్ స్టేడియం వేదికగా ముగిసిన ప్రస్తుత సీజన్ 50వ మ్యాచ్ లో.. ఢిల్లీ డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ప్రపంచ రికార్డు నెలకొల్పితే…మరో ఓపెనర్ మన్ దీప్ సింగ్ డకౌట్ గా వెనుదిరిగి ఓ చెత్తరికార్డు మూటగొట్టుకొన్నాడు. ఐపీఎల్ 15 సీజన్ల చరిత్రలో అత్యధిక డకౌట్ల రికార్డును ముంబై కెప్టెన్ రోహిత్ శర్మతో కలసి […]

డకౌట్లలో మరో చెత్తరికార్డు.. రోహిత్ శర్మ సరసన మన్ దీప్ సింగ్
X

టాటా ఐపీఎల్ 15వ సీజన్ పోటీలలో రికార్డుల మోత మోగుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య ముంబై బ్రబోర్న్ స్టేడియం వేదికగా ముగిసిన ప్రస్తుత సీజన్ 50వ మ్యాచ్ లో.. ఢిల్లీ డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ప్రపంచ రికార్డు నెలకొల్పితే…మరో ఓపెనర్ మన్ దీప్ సింగ్ డకౌట్ గా వెనుదిరిగి ఓ చెత్తరికార్డు మూటగొట్టుకొన్నాడు. ఐపీఎల్ 15 సీజన్ల చరిత్రలో అత్యధిక డకౌట్ల రికార్డును ముంబై కెప్టెన్ రోహిత్ శర్మతో కలసి పంచుకొన్నాడు.

మన్ దీప్ 14వ డకౌట్..
హైదరాబాద్ సన్ రైజర్స్ తో ముగిసిన పోరులో డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తో కలసి బ్యాటింగ్ కు దిగిన మన్ దీప్ సింగ్ కేవలం ఐదు బంతులు మాత్రమే ఎదుర్కొని.. స్వింగ్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ లో పూరన్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా 14సార్లు డకౌటైన రెండో బ్యాటర్ గా మన్ దీప్ రికార్డుల్లో చేరాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ పేరుతో ఉన్న 14 డకౌట్ల రికార్డును మన్ దీప్ సింగ్ పంచుకొన్నాడు. అజింక్యా రహానే, అంబటి రాయుడు, దినేశ్ కార్తీక్, పియూష్ చావ్లా, హర్భజన్ సింగ్,పార్థివ్ పటేల్ 13సార్లు చొప్పున డకౌట్లైన ఆటగాళ్లుగా ఉన్నారు. ప్రస్తుత మ్యాచ్ డకౌట్ తో మన్ దీప్ మిగిలిన ఆరుగురి రికార్డును అధిగమించి.. రోహిత్ శర్మ పేరుతో ఉన్న 14 డకౌట్ల రికార్డును సమం చేయగలిగాడు. ఐపీఎల్ 14వ సీజన్ సమరంలో భాగంగా గత ఏడాది ఏప్రిల్ 21న చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన పోటీలో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ చివరిసారిగా డకౌటయ్యాడు. ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా పలు అరుదైన రికార్డులు నెలకొల్పిన రోహిత్ శర్మ..డకౌట్ల రూపంలో ఓ చెత్తరికార్డును సైతం తన పేరుతో చేర్చుకోడం విశేషం.

First Published:  6 May 2022 1:49 AM GMT
Next Story