Telugu Global
NEWS

ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారంపై మరో కీలక తీర్పు..

ఏపీలో సినిమా టికెట్ల రేట్లను క్రమబద్ధీకరించి, థియేటర్ల నుంచి సక్రమంగా పన్నులు వసూలు చేసేందుకు తగిన వేదికకోసం ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఆ మధ్య టికెట్ రేట్లను కూడా తగ్గించింది. అయితే ఇండస్ట్రీ పెద్దల విన్నపంతో స్వల్పంగా రేట్లు పెంచింది. దీంతోపాటు టికెట్ అమ్మకాలపై కూడా నియంత్రణ, నిఘా ఉండేందుకు ఆన్ లైన్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో టికెట్ల అమ్మకాలకోసం 2021 డిసెంబర్‌ 17న జీవో 142 జారీ చేసింది. అయితే ఈ జీవోతో తమకు ఇబ్బందులున్నాయంటూ మల్టీప్లెక్స్ […]

ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారంపై మరో కీలక తీర్పు..
X

ఏపీలో సినిమా టికెట్ల రేట్లను క్రమబద్ధీకరించి, థియేటర్ల నుంచి సక్రమంగా పన్నులు వసూలు చేసేందుకు తగిన వేదికకోసం ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఆ మధ్య టికెట్ రేట్లను కూడా తగ్గించింది. అయితే ఇండస్ట్రీ పెద్దల విన్నపంతో స్వల్పంగా రేట్లు పెంచింది. దీంతోపాటు టికెట్ అమ్మకాలపై కూడా నియంత్రణ, నిఘా ఉండేందుకు ఆన్ లైన్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో టికెట్ల అమ్మకాలకోసం 2021 డిసెంబర్‌ 17న జీవో 142 జారీ చేసింది. అయితే ఈ జీవోతో తమకు ఇబ్బందులున్నాయంటూ మల్టీప్లెక్స్ అసోసియేషన్ తరఫున ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం.. సినిమా టికెట్ల అమ్మకం మల్టీప్లెక్స్ లకు కట్టబెట్టలేమని స్పష్టం చేసింది.

ప్రస్తుతం ఏపీలో సినిమా టికెట్ల అమ్మకం ఆన్ లైన్ తోపాటు, ఆఫ్ లైన్ లోనూ సాగుతోంది. ఆన్ లైన్ లో ఇప్పటికే ఉన్న థర్డ్ పార్టీ వెబ్ సైట్స్ ద్వారా థియేటర్ల వద్ద టికెట్లు జారీ చేస్తారు. అవే వెబ్ సైట్స్ అటు ప్రేక్షకులకు కూడా అందుబాటులో ఉంటాయి. వీటి కమిషన్ తో కలిపి టికెట్ రేట్లు ఉంటాయి. అయితే ఈ కమిషన్ భారం ప్రజలపైనుంచి తొలగించి.. పారదర్శకంగా టికెట్ అమ్మకాలు కొనసాగిస్తూ.. ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు కొత్త విధానం తేవాల్సి ఉంది. ఏపీ స్టేట్ ఫిలిం, టెలివిజన్, థియేటర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సినిమా టికెట్ల విక్రయం కోసం గతంలో జీవో తెచ్చింది. దీనివల్ల థియేటర్ యాజమాన్యాలకు లాభంలో కోత పడుతుంది. ప్రేక్షకులపై భారం తగ్గుతుంది. అందుకే దీన్ని వ్యతిరేకిస్తూ మల్టీప్లెక్స్ అసోసియేషన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తమకు తామే సొంత ప్లాట్ ఫామ్ పెట్టుకుని టికెట్లు విక్రయించుకునేందుకు అనుమతి కోరింది.

హైకోర్టు నిరాకరణ..
మల్టీప్లెక్స్ ల యాజమాన్యాలు తమ సొంత ప్లాట్ ఫామ్ ద్వారా టికెట్లు విక్రయించుకోవడం కుదరదని తేల్చి చెప్పింది హైకోర్టు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విధానం ద్వారా టికెట్ల విక్రయాలు జరిపేందుకు అనుమతి ఇచ్చింది. మల్టీప్లెక్స్‌ యాజమాన్యాల అభ్యర్థనను తదుపరి విచారణలో పరిశీలిస్తామంటూ.. జూలై 12కి కేసు వాయిదా వేసింది. ప్రస్తుతానికి రాష్ట్ర ప్రభుత్వం ఆన్ లైన్లో సినిమా టికెట్లు అమ్మేందుకు లైన్ క్లియర్ అయింది.

First Published:  5 May 2022 8:42 PM GMT
Next Story