Telugu Global
Cinema & Entertainment

ఇంట్రెస్టింగ్ గా మారిన యశోద

యశోద కళ్లు తెరిచి చూసింది. రోజూ తను చూసే ప్రపంచానికి పూర్తి భిన్నంగా ఉందా ప్రదేశం. చుట్టూ పరిసరాలు, తను వేసుకున్న డ్రెస్సు, తన చేతికున్న వాచ్ తో పాటు అక్కడున్న నిశ్శబ్దం కూడా యశోదకు చాలా కొత్తగా, వింతగా అనిపిస్తున్నాయి. తన గుండె చప్పుడు తనకే వినబడుతుండగా మెల్లగా వెళ్లి అక్కడున్న కిటికీ తెరిచి చూసింది. తన స్వేచ్ఛే అక్కడ వాలినట్టుగా ఉన్న తెల్లటి పావురాన్ని ఆత్రంగా అందుకోవడానికి ప్రయత్నించింది. కానీ, అక్కడేం జరిగింది? ఇదంతా […]

ఇంట్రెస్టింగ్ గా మారిన యశోద
X

యశోద కళ్లు తెరిచి చూసింది. రోజూ తను చూసే ప్రపంచానికి పూర్తి భిన్నంగా ఉందా ప్రదేశం. చుట్టూ పరిసరాలు, తను వేసుకున్న డ్రెస్సు, తన చేతికున్న వాచ్ తో పాటు అక్కడున్న నిశ్శబ్దం కూడా యశోదకు చాలా కొత్తగా, వింతగా అనిపిస్తున్నాయి. తన గుండె చప్పుడు తనకే వినబడుతుండగా మెల్లగా వెళ్లి అక్కడున్న కిటికీ తెరిచి చూసింది. తన స్వేచ్ఛే అక్కడ వాలినట్టుగా ఉన్న తెల్లటి పావురాన్ని ఆత్రంగా అందుకోవడానికి ప్రయత్నించింది. కానీ, అక్కడేం జరిగింది?

ఇదంతా ‘యశోద’ ఫస్ట్ గ్లింప్స్ లో కనిపిస్తుంది. దీన్ని బట్టే ‘యశోద’ సినిమా ఎంత వైవిధ్యంగా ఉంటుందో ఊహించుకోవచ్చు అంటున్నారు నిర్మాత నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్.

సమంత ప్రధాన పాత్రలో శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై వస్తోంది ‘యశోద’. జంట దర్శకులు హరి-హరీష్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళి శర్మ, సంపత్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ఈరోజు రిలీజైంది.

ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ తో సమంత కు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఆ ఇమేజ్ కు ఏమాత్రం తగ్గని విధంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారట. ఇప్పటికి 80 శాతం షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో చివరి షెడ్యుల్ చేస్తున్నారు. జూన్ మొదటి వారానికి షూట్ మొత్తం పూర్తవుతుంది. ఏప్రిల్ లో కొడైకెనాల్ లో క్లైమాక్స్ తీస్తారు.

ఈ సినిమాలో స్పెషల్ ఎఫ్ఫెక్ట్స్ కి కూడా చాలా ప్రాధాన్యం ఉంది. గ్లింప్స్ చూస్తే ఆ విషయం అర్థమౌతోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 12న భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు.

First Published:  5 May 2022 9:58 AM GMT
Next Story