Telugu Global
NEWS

ఎల్లో పార్టీని, ఎల్లో మీడియాని రాష్ట్రం నుంచి తరిమికొట్టాలి " సీఎం జగన్

విద్యాదీవెన అనేది రాష్ట్ర చరిత్రలోనే గొప్ప పథకం అని అన్నారు సీఎం జగన్. తిరుపతిలో విద్యా దీవెన నగదు జమ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. 10.85 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూర్చడం సంతోషంగా ఉందని తెలిపారు. అవినీతికి తావు లేకుండా నేరుగా తల్లుల అకౌంట్లలోనే డబ్బులు జమ చేస్తున్నామని అన్నారు. అరకొర ఫీజులతో, రీయింబర్స్ మెంట్ లను ఎగవేస్తూ గత ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసిందని విమర్శించారు సీఎం జగన్. క్రమం తప్పకుండా ఫీజు బకాయిలు […]

ఎల్లో పార్టీని, ఎల్లో మీడియాని రాష్ట్రం నుంచి తరిమికొట్టాలి  సీఎం జగన్
X

విద్యాదీవెన అనేది రాష్ట్ర చరిత్రలోనే గొప్ప పథకం అని అన్నారు సీఎం జగన్. తిరుపతిలో విద్యా దీవెన నగదు జమ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. 10.85 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూర్చడం సంతోషంగా ఉందని తెలిపారు. అవినీతికి తావు లేకుండా నేరుగా తల్లుల అకౌంట్లలోనే డబ్బులు జమ చేస్తున్నామని అన్నారు. అరకొర ఫీజులతో, రీయింబర్స్ మెంట్ లను ఎగవేస్తూ గత ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసిందని విమర్శించారు సీఎం జగన్. క్రమం తప్పకుండా ఫీజు బకాయిలు చెల్లించి మరీ తమ ప్రభుత్వం విద్యా వ్యవస్థను సమర్థవంతంగా నడిపిస్తోందని చెప్పారు. గత ప్రభుత్వం ఉన్నప్పటికి, ఇప్పటికి వచ్చిన మార్పుని తల్లిదండ్రులు గమనించాలని కోరారు జగన్. గత ప్రభుత్వం.. ఇప్పుడున్న పథకాల్లాంటివి ఏమైనా ప్రవేశపెట్టిందా? అని ప్రశ్నించారు. పేద విద్యార్థుల క్షోభను గత ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదని, ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు అప్పుల పాలవుతుంటే, విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలను తన పాదయాత్రలో చూసి చలించి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టానని చెప్పారు జగన్.

ఒక మనిషి చరిత్రను, కుటుంబ చరిత్రను, సామాజిక చరిత్రను, ఒక రాష్ట్ర చరిత్రను, ఒక దేశ చరిత్రను సైతం చదువు మార్చేస్తుందని అన్నారు జగన్. ఒక మంచి కార్యక్రమం దేవుడి దయతో సాగుతోందని సంతోషం వ్యక్తం చేశారు. చదువు అనేది గొప్ప ఆస్తి అని.. ఎవరూ దొంగిలించలేని ఆస్తి అని, తలరాతలు మార్చేసే శక్తి చదువుకు ఉందని చెప్పారు.

చంద్రబాబు హయాంలో గవర్నమెంట్ స్కూళ్లను మూసేశారని, పిల్లల్ని తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూళ్లలో చేర్చి వారి బాధ వారు పడతారని వదిలేశారని మండిపడ్డారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, చంద్రబాబులు దొంగల ముఠా అని, వారందరూ కలసి దుష్ట చతుష్టయంగా ఏర్పడ్డారని చెప్పారు. మంచి చేస్తే వారందరికీ కడుపుమంట అని, వారంతా మంచిలోనూ చెడుని వెదికేవారంటూ విమర్శించారు. ప్రశ్నా పత్రాలను లీక్ చేసి, ప్రభుత్వంపై బురద జల్లేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని అన్నారు. లీకేజీ వ్యవహారంలో నారాయణ, చైతన్య కాలేజీలకు భాగస్వామ్యం ఉందని చెప్పారు. ప్రజలకు లబ్ధిచేయని ఎల్లో పార్టీకి, ఎల్లో మీడియా కూడా జతచేరిందని అన్నారు. మహిళల రక్షణ, సాధికారతకు ఏ ప్రభుత్వం చేయని విధంగా చర్యలు చేపట్టామని, కానీ ప్రధాన నగరాల్లో ఏదేదో జరిగిపోతోందంటూ ఎల్లో మీడియా నానా యాగీ చేస్తోందని, ఆ చేసినవారెవరో ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 బయటపెట్టవని, ఎందుకంటే వారంతా టీడీపీ నాయకులేనని అన్నారు జగన్. దుష్ట ఎల్లో మీడియాని, ఎల్లో పార్టీని రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నట్టు తెలిపారు జగన్.

First Published:  5 May 2022 3:56 AM GMT
Next Story