Telugu Global
Cinema & Entertainment

సర్కారువారి పాట సర్ ప్రైజ్ ఇదే

ఇప్పటికే ఫ్యాన్స్ కు అదిరిపోయే సర్ ప్రైజులు ఇచ్చింది సర్కారు వారి పాట టీం. ఇప్పుడు మరో గ్రేట్ సర్ ప్రైజ్ ఇచ్చింది. నిన్న అభిమానుల కోసం ఒక సర్ప్రైజ్‌ ను వెల్లడిస్తానని ప్రకటించి చిత్ర యూనిట్, చెప్పినట్లే ‘సర్కారు వారి సూపర్ సర్ప్రైజ్’ అందించింది. ఆ సర్ ప్రైజ్ ఇంకేదో కాదు, మహేష్ ట్విట్టర్ ఎమోజీ. ట్విట్టర్ లో ఒక రీజనల్ మూవీ ప్రత్యేకమైన ఎమోజీని కలిగి ఉండటం ఇదే తొలిసారి. ఇంతకుముందు, కెజీఎఫ్ 2, […]

సర్కారువారి పాట సర్ ప్రైజ్ ఇదే
X

ఇప్పటికే ఫ్యాన్స్ కు అదిరిపోయే సర్ ప్రైజులు ఇచ్చింది సర్కారు వారి పాట టీం. ఇప్పుడు మరో గ్రేట్ సర్ ప్రైజ్ ఇచ్చింది. నిన్న అభిమానుల కోసం ఒక సర్ప్రైజ్‌ ను వెల్లడిస్తానని ప్రకటించి చిత్ర యూనిట్, చెప్పినట్లే ‘సర్కారు వారి సూపర్ సర్ప్రైజ్’ అందించింది. ఆ సర్ ప్రైజ్ ఇంకేదో కాదు, మహేష్ ట్విట్టర్ ఎమోజీ.

ట్విట్టర్ లో ఒక రీజనల్ మూవీ ప్రత్యేకమైన ఎమోజీని కలిగి ఉండటం ఇదే తొలిసారి. ఇంతకుముందు, కెజీఎఫ్ 2, సాహో వంటి పాన్ ఇండియన్, మల్టీ లాంగ్వేజ్ చిత్రాలకు మాత్రమే ఎమోజీ ఉండేది.

ప్రస్తుతం ప్రమోషన్స్ లో దూసుకెళ్తున్న సర్కారు వారి పాట టీం నుండి మరో అదిరిపోయే ప్రకటన వచ్చింది. సర్కారు వారి పాట ప్రీ-రిలీజ్ ఈవెంట్ ప్లేస్, డేట్ ఖరారు చేసింది చిత్ర యూనిట్. మే 7న హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడలోని పోలీస్ గ్రౌండ్స్ లో ‘సర్కారు వారి పాట’ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది సాయంత్రం 6 గంటల నుంచి ఈవెంట్ ప్రారంభమవుతుంది. ఫ్యాన్స్ భారీగా వచ్చి ఈవెంట్ ని ప్రత్యేక్షంగా ఎంజాయ్ చేసే విధంగా చిత్ర యూనిట్ ఓపెన్ గ్రౌండ్‌ను ఎంచుకుంది.

సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటు చిత్ర యూనిట్ మొత్తం పాల్గొంటున్న ఈ ఈవెంట్ లో ప్రేక్షకులకు మరిన్ని సర్ ప్రైజులు ఉండబోతున్నాయని ఊరిస్తోంది యూనిట్.

మహేష్-కీర్తిసురేష్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను ఈనెల 12న విడుదల చేయబోతున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. పరశురామ్ దర్శకుడు.

First Published:  5 May 2022 9:55 AM GMT
Next Story