Telugu Global
NEWS

ఒకే జట్టుకు 200 మ్యాచ్ లు.. మహీ మరో మహా రికార్డు

ఐపీఎల్ మేరునగధీరుడు, చెన్నైసూపర్ కింగ్స్ దిగ్గజం మహేంద్రసింగ్ ధోనీకి.. ధూమ్ ధామ్ ఐపీఎల్ లో అసాధారణ రికార్డులు కొత్తేమీ కాదు. ఇప్పటికే తనపేరుతో అర డజన్‌కు పైగా రకరకాల రికార్డులు లిఖించుకొన్న వెటరన్ ధోనీ.. బెంగళూరు రాయల్ చాలెంజర్స్ తో జరిగిన 10వ రౌండ్ మ్యాచ్ ద్వారా మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఒకే జట్టు తరఫున 200 ఐపీఎల్ మ్యాచ్ లు ఆడిన రెండో ఆటగాడిగా రికార్డుల్లో చేరాడు. ఐపీఎల్ లో 230 మ్యాచ్ […]

ఒకే జట్టుకు 200 మ్యాచ్ లు.. మహీ మరో మహా రికార్డు
X

ఐపీఎల్ మేరునగధీరుడు, చెన్నైసూపర్ కింగ్స్ దిగ్గజం మహేంద్రసింగ్ ధోనీకి.. ధూమ్ ధామ్ ఐపీఎల్ లో అసాధారణ రికార్డులు కొత్తేమీ కాదు. ఇప్పటికే తనపేరుతో అర డజన్‌కు పైగా రకరకాల రికార్డులు లిఖించుకొన్న వెటరన్ ధోనీ.. బెంగళూరు రాయల్ చాలెంజర్స్ తో జరిగిన 10వ రౌండ్ మ్యాచ్ ద్వారా మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఒకే జట్టు తరఫున 200 ఐపీఎల్ మ్యాచ్ లు ఆడిన రెండో ఆటగాడిగా రికార్డుల్లో చేరాడు.

ఐపీఎల్ లో 230 మ్యాచ్ ల ధోనీ..
2008లో ప్రారంభమైన ఐపీఎల్ చరిత్రలో దిగ్గజ ఆటగాళ్లలో ఒకడిగా పేరుపొందిన మహేంద్రసింగ్ ధోనీ గత 15 సంవత్సరాల కాలంలో కేవలం రెండుజట్లకు మాత్రమే ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చాడు. తన కెరియర్ లో ప్రస్తుత సీజన్ 10వ రౌండ్ వరకూ 230 మ్యాచ్ లు ఆడిన ధోనీ.. నాలుగుసార్లు విజేత చెన్నై సూపర్ కింగ్స్ తరఫునే 200 మ్యాచ్ ల్లో బరిలోనిలిచాడు. మిగిలిన 30 మ్యాచ్ లు 2016, 2017 సీజన్లలో పూణే సూపర్ జెయింట్స్ తరఫున ఆడాడు. ఒకేజట్టు తరపున 200 మ్యాచ్ లు ఆడిన తొలి ఆటగాడి ఘనతను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ దక్కించుకోగా.. ధోనీ ఆ తర్వాతి స్థానంలో నిలిచాడు. 2008 నుంచి బెంగళూరుకే ఆడుతూ వస్తున్న కోహ్లీ ఇప్పటి వరకూ 218 మ్యాచ్ ల్లో పాల్గొన్నాడు.

చెన్నై తలైవా మహేంద్రసింగ్ ధోనీ..
చెన్నై తరఫున అత్యధికంగా 200 మ్యాచ్ లతో ధోనీ అగ్రస్థానంలో నిలిస్తే.. సురేష్ రైనా 176, రవీంద్ర జడేజా 142 మ్యాచ్ లతో ఆ తర్వాతి స్థానాలలో కొనసాగుతున్నారు. ఐపీఎల్ లో 200 మ్యాచ్ ల్లో నాయకత్వం వహించిన ఆటగాడిగా అసాధారణ రికార్డు నెలకొల్పిన ధోనీ.. 2010, 2011, 2018, 2021 సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్ ను విజేతగా నిలిపిన కెప్టెన్ గానూ రికార్డుల్లో చేరాడు. 2016లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో చెన్నై ఫ్రాంచైజీ నిషేధం ఎదుర్కొనడంతో.. పూణే సూపర్ జెయింట్స్ నాయకుడిగా ధోనీ బాధ్యత స్వీకరించడమే కాదు.. తనజట్టును ఫైనల్స్ చేర్చడం ద్వారా సంచలనం సృష్టించాడు. ప్రస్తుత 15వ సీజన్లో మాత్రం డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటి వరకూ ఆడిన 10 రౌండ్లలో 7 పరాజయాలు, మూడు విజయాల రికార్డుతో ఉంది. లీగ్ మిగిలిన నాలుగురౌండ్లూ నెగ్గినా ప్లే ఆఫ్ రౌండ్ చేరడం చెన్నైకి అంతతేలిక కాదు. జడేజా నాయకత్వంలో చెన్నైజట్టు ఆడిన ఎనిమిది రౌండ్లలో 6 పరాజయాలు, 2 విజయాలు, ధోనీ నాయకత్వంలో ఆడిన రెండుమ్యాచ్ ల్లో ఒక్కో గెలుపు, ఓటమి రికార్డుతో మిగిలింది.

First Published:  5 May 2022 12:46 AM GMT
Next Story