Telugu Global
Cinema & Entertainment

ఇప్పటివరకు ఎవ్వరూ చూడని క్లయిమాక్స్

రేపు థియేటర్లలోకి వస్తోంది భళా తందనాన సినిమా. యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ సినిమా గురించి చాలా గొప్పగా చెబుతున్నాడు శ్రీవిష్ణు. మరీ ముఖ్యంగా సినిమా క్లైమాక్స్ అద్భుతం అంటున్నారు. ఇప్పటివరకు ఎవ్వరూ చూడలేదని చెబుతున్నాడు. “ముందు 25 నిమిషాలు క్యారెక్టర్ల పరిచయం ఉంటుంది. రానురాను కథలో డెప్త్ కు వెళ్లడంతో ప్రతి క్యారెక్టర్ హైలైట్ గా ఉంటుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఇంతవరకు రాని కొత్త కోణం ఇందులో హైలెట్ గా […]

ఇప్పటివరకు ఎవ్వరూ చూడని క్లయిమాక్స్
X

రేపు థియేటర్లలోకి వస్తోంది భళా తందనాన సినిమా. యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ సినిమా గురించి చాలా గొప్పగా చెబుతున్నాడు శ్రీవిష్ణు. మరీ ముఖ్యంగా సినిమా క్లైమాక్స్ అద్భుతం అంటున్నారు. ఇప్పటివరకు ఎవ్వరూ చూడలేదని చెబుతున్నాడు.

“ముందు 25 నిమిషాలు క్యారెక్టర్ల పరిచయం ఉంటుంది. రానురాను కథలో డెప్త్ కు వెళ్లడంతో ప్రతి క్యారెక్టర్ హైలైట్ గా ఉంటుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఇంతవరకు రాని కొత్త కోణం ఇందులో హైలెట్ గా ఉంటుంది. క్లైమాక్స్ లో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. కె.జి.ఎఫ్. వంటి అంత పెద్ద సినిమాలో చేసిన గరుడ రామ్ నా సినిమాలో చేయడం చాలా గొప్పగా ఉంది. ఆయనతో వచ్చే ఫైట్ సీక్వెన్స్ సినిమాను నిలబెడతాయి. ఒక అరుదైన కొత్త క్లైమాక్స్ ఈ సినిమాలో చూస్తారు.”

ఇలా భళా తందనాన సినిమా గురించి గొప్పగా చెప్పుకొచ్చాడు శ్రీవిష్ణు. చైతన్య దంతులూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో క్యాథరీన్ హీరోయిన్ గా నటించింది. ఇప్పటివరకూ తనకు ఒక్క బ్లాక్ బస్టర్ కూడా దక్కలేదని, ఈ ఏడాది కచ్చితంగా ఓ సెన్సేషనల్ హిట్ ఇస్తానని అంటున్నాడు శ్రీవిష్ణు.

భళా తందనాన తర్వాత మరోసారి రాజరాజ చోర దర్శకుడు హసిత్ గోలితో కలిసి సినిమా చేయబోతున్నాడు శ్రీవిష్ణు. అందులో ఆయన త్రిపాత్రాభినయం చేయబోతున్నాడు. అది తన కెరీర్ లో మైల్ స్టోన్ అవుతుందని చెబుతున్నాడు.

First Published:  5 May 2022 10:00 AM GMT
Next Story