Telugu Global
NEWS

సిగ్గులేదా? ఉత్తరాంధ్రలో పర్యటించడానికి.. చంద్రబాబుపై మంత్రి గుడివాడ ఫైర్ 

ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనపై మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘బాదుడే బాదుడు’ అంటూ చంద్రబాబు కొత్త డ్రామాకు తెరలేపారని మండిపడ్డారు. ఉత్తరాంధ్రలో పర్యటించే హక్కు చంద్రబాబుకు లేద‌న్నారు. విశాఖను పరిపాలనా రాజధానిగా ఏర్పాటు చేయాలని సీఎం జగన్ భావిస్తే చంద్రబాబు అడ్డుకున్నారని మండిపడ్డారు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్నారని ప్రశ్నించారు. టీడీపీ ప్రస్తుతం […]

సిగ్గులేదా? ఉత్తరాంధ్రలో పర్యటించడానికి.. చంద్రబాబుపై మంత్రి గుడివాడ ఫైర్ 
X

ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనపై మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘బాదుడే బాదుడు’ అంటూ చంద్రబాబు కొత్త డ్రామాకు తెరలేపారని మండిపడ్డారు. ఉత్తరాంధ్రలో పర్యటించే హక్కు చంద్రబాబుకు లేద‌న్నారు. విశాఖను పరిపాలనా రాజధానిగా ఏర్పాటు చేయాలని సీఎం జగన్ భావిస్తే చంద్రబాబు అడ్డుకున్నారని మండిపడ్డారు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్నారని ప్రశ్నించారు.

టీడీపీ ప్రస్తుతం రాష్ట్రంలో ఇబ్బందుల్లో ఉందని.. అందుకే బాదుడే బాదుడు అని కాకుండా టీడీపీ బాధలే.. బాధలు అంటూ కార్యక్రమం చేయాల్సిందని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి జగన్ అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందజేస్తుంటే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని ఆరోపించారు. అందుకే రోజుకో తప్పుడు ప్రచారం చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వ ప్ర‌తిష్ట‌ను దిగజారుస్తున్నారని ఫైర్ అయ్యారు.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో ధరలు పెరగలేదా? అని ప్రశ్నించారు. కేవలం తన తనయుడు లోకేశ్ ను ముఖ్యమంత్రిని చేసేందుకు చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ఆయన ఎన్ని డ్రామాలు చేసినా ప్రజలు పట్టించుకునే పరిస్థితులో లేరని పేర్కొన్నారు.

టీడీపీ హయాంలో జన్మభూమిలో కమిటీలు పెట్టి.. ఇసుక మాఫియాను అడ్డుపెట్టుకొని ప్రజలను పీడించారని ఆరోపించారు. అందుకే ప్రజలెవరూ మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం లేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు మోసాలు, అబద్ధపు ప్రచారాలు పక్కకు పెట్టి.. నిజాయితీగా నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించాలని సూచించారు.

First Published:  5 May 2022 9:02 AM GMT
Next Story