Telugu Global
Cinema & Entertainment

అలా అవుతుందని ఊహించలేదు " విశ్వక్

తన కొత్త సినిమా ప్రమోషన్ కోసం ప్రాంక్ వీడియోస్ ప్లాన్ చేశామని, చేసిన మొదటి వీడియోకే వివాదాస్పదమౌతుందని కలలో కూడా ఊహించలేదంటున్నాడు హీరో విశ్వక్ సేన్. అశోకవనంలో అర్జునకల్యాణం సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ హీరో.. ప్రమోషన్ కోసం ప్రాంక్ చేస్తే, మొదటికే మోసం వచ్చిందంటూ వివరణ ఇచ్చుకున్నాడు. “రెండ్రోజుల క్రితం నేను చేసిన ప్రాంక్ వీడియో కావాలని చేసింది కాదు. ప్రమోషన్స్ లో అది కూడా ఓ పార్ట్ అవుతుందని చేశాం. కానీ ఇంత ఇష్యూ […]

అలా అవుతుందని ఊహించలేదు  విశ్వక్
X

తన కొత్త సినిమా ప్రమోషన్ కోసం ప్రాంక్ వీడియోస్ ప్లాన్ చేశామని, చేసిన మొదటి వీడియోకే వివాదాస్పదమౌతుందని కలలో కూడా ఊహించలేదంటున్నాడు హీరో విశ్వక్ సేన్. అశోకవనంలో అర్జునకల్యాణం సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ హీరో.. ప్రమోషన్ కోసం ప్రాంక్ చేస్తే, మొదటికే మోసం వచ్చిందంటూ వివరణ ఇచ్చుకున్నాడు.

“రెండ్రోజుల క్రితం నేను చేసిన ప్రాంక్ వీడియో కావాలని చేసింది కాదు. ప్రమోషన్స్ లో అది కూడా ఓ పార్ట్ అవుతుందని చేశాం. కానీ ఇంత ఇష్యూ జరిగి అనవసరమైన చర్చ అవుతుందని ఊహించలేదు. ప్రస్తుతానికి అంతా సద్దుమణిగిందని అనుకుంటున్నాను. ఈ ఇన్సిడెంట్ తో మా చుట్టాల కారణంగా మా అమ్మ ఎక్కువ ఇబ్బంది పడింది. నా పక్కనే ఉండే అమ్మకి ఫోన్లు చేస్తూ నేనెలా ఉన్నానో తెలుసుకుంటుంటే ఎందుకో అమ్మకి ధైర్యం చెప్పాలనిపించి స్పీచ్ లో నన్ను ఎవరూ ఏమి చేయలేరని చెప్పాను.”

ఇక సినిమాలో తను చేసిన అర్జున్ పాత్రపై కూడా స్పందించాడు. కెరీర్ లో ఫస్ట్ టైమ్ ఈ పాత్ర కోసం బరువు పెరిగిన విషయాన్ని బయటపెట్టాడు. పొట్ట కనిపించేలా ఉండడం కోసం 7 కిలోలు పెరిగానని వివరించాడు విశ్వక్.

“ఈ సినిమా కోసం 10 కిలోలు బరువు పెరగమని మా డైరెక్టర్ చెప్పాడు. కానీ ఒకసారి బరువు పెరిగితే మళ్ళీ తగ్గడం చాలా కష్టం. అది దృష్టిలో పెట్టుకునే 7 కిలోల బరువుతో ఆపేశాను. మా డైరెక్టర్ ఇంకా 2-3 కిలోలు పెరగమని రిక్వెస్ట్ చేశాడు. మళ్ళీ నెక్స్ట్ సినిమాకి తగ్గడం ఇబ్బంది అవుతుందని నచ్చ చెప్పి కావాలంటే పొట్టపై 2-3 డైలాగ్స్ ఎక్కువ పెట్టమని చెప్పాను. అలా అర్జున్ కుమార్ అల్లం పాత్ర కోసం అధిక బరువు పెరగాల్సి వచ్చింది.”

ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి వస్తోంది అశోకవనంలో అర్జునకల్యాణం. సాఫ్ట్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా తన కెరీర్ లోనే బెస్ట్ మూవీగా నిలిచిపోతుందని గట్టిగా చెబుతున్నాడు ఈ హీరో.

First Published:  4 May 2022 10:36 AM GMT
Next Story