Telugu Global
NEWS

తెలంగాణ ఆర్టీసీకి కర్నాటక డీజిల్..

ఇంధన రేట్లు పెరగడంతో తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా బల్క్ డీజిల్ రేటుకి బయట పెట్రోల్ బంకుల్లో దొరికే రేటుకి 20 రూపాయలు తేడా ఉంటుంది. ఆర్టీసీ సంస్థ బల్క్ డీజిల్ నే కొనుగోలు చేస్తుంది కాబట్టి ఆ సంస్థలపై ఆర్థిక భారం మరింత ఎక్కువ. ఈ వ్యత్యాసం భారీగా పెరగడంతో ఇటీవల ఆర్టీసీ కూడా బల్క్ డీజిల్ వినియోగాన్ని ఆపివేసింది. నేరుగా పెట్రోల్ బంకుల్లోనే ఆర్టీసీ బస్సులకు ఫుల్ ట్యాంక్ చేస్తున్నారు. […]

తెలంగాణ ఆర్టీసీకి కర్నాటక డీజిల్..
X

ఇంధన రేట్లు పెరగడంతో తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా బల్క్ డీజిల్ రేటుకి బయట పెట్రోల్ బంకుల్లో దొరికే రేటుకి 20 రూపాయలు తేడా ఉంటుంది. ఆర్టీసీ సంస్థ బల్క్ డీజిల్ నే కొనుగోలు చేస్తుంది కాబట్టి ఆ సంస్థలపై ఆర్థిక భారం మరింత ఎక్కువ. ఈ వ్యత్యాసం భారీగా పెరగడంతో ఇటీవల ఆర్టీసీ కూడా బల్క్ డీజిల్ వినియోగాన్ని ఆపివేసింది. నేరుగా పెట్రోల్ బంకుల్లోనే ఆర్టీసీ బస్సులకు ఫుల్ ట్యాంక్ చేస్తున్నారు. కొన్ని చోట్ల పెట్రోల్ ట్యాంక్ ల ద్వారా డిపోలకు తీసుకొచ్చి డీజిల్ నిల్వ చేస్తున్నారు. అయితే తెలంగాణ ఆర్టీసీ చేసిన మరో ప్రయత్నమే ఇప్పుడు వార్తల్లోకెక్కింది. కర్నాటకతో సరిహద్దు పంచుకుంటున్న తెలంగాణ ఆర్టీసీ డిపోలకు పొరుగు రాష్ట్రం నుంచి డీజిల్ సరఫరా అవుతోంది. కారణం ఏంటంటే.. తెలంగాణ కంటే కర్నాటకలోనే డీజిల్ రేటు తక్కువ.

మంగళవారం కర్నాటకలోని బీదర్ లో డీజిల్ రేటు లీటర్ కి 95 రూపాయలు. పక్కనే తెలంగాణలో ఉన్న నారాయణ్ ఖేడ్ లో డీజిల్ లీటర్ 105 రూపాయలు. లీటర్ కి 10 రూపాయలు తేడా. ఈ క్రమంలో బీదర్ నుంచి నారాయణ్ ఖేడ్ డిపోకి డీజిల్ ని తెప్పిస్తున్నారు. ఇటీవల ఇలా ఓ డీజిల్ ట్యాంకర్ సరిహద్దు దాటుతుండటంతో పోలీసులు అనుమానం వచ్చి ఆపేశారు. తీరా ఆర్టీసీ అధికారులు రంగంలోకి దిగి అది అక్రమ రవాణా కాదు అని చెప్పడంతో అంతా సర్దుకుంది. ప్రస్తుతం ఇలా సరిహద్దు ప్రాంతాల్లోని డిపోలలో మాత్రమే పొరుగు రాష్ట్రం నుంచి డీజిల్ తెప్పిస్తున్నట్టు తెలుస్తోంది.

స్థానిక పన్నుల వల్ల వివిధ రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ రేట్ల మధ్య వ్యత్యాసం ఉంది. కేంద్రం వాతలు పెడుతున్నా.. బీజేపీ పాలిత రాష్ట్రాలు మాత్రం సొంత లాభం కొంత మానుకుంటున్నాయి. కేంద్రంపై వ్యతిరేకత పెరగకుండా చూడటమే స్థానిక నాయకుల లక్ష్యం కాబట్టి.. ఆమేరకు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇంధన ధరలు కాస్త తక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలో తెలంగాణ ఆర్టీసీ కూడా కర్నాటక నుంచి డీజిల్ దిగుమతి చేసుకుంటోంది. రవాణా చార్జీలను కూడా బేరీజు వేసుకుని ప్రస్తుతానికి సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న డిపోలలో మాత్రమే ఈ డీజిల్ వినియోగిస్తున్నారు.

First Published:  3 May 2022 10:27 PM GMT
Next Story