Telugu Global
NEWS

విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలొద్దు.. లోకేష్ పై మంత్రి బొత్స ఆగ్రహం..

పదో తరగతి పరీక్ష పేపర్ల లీకేజీ వ్యవహారంపై ప్రతిపక్షాల తీరుని ఎండగట్టారు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. అక్కడక్కడ చిన్న సంఘటనలు జరిగితే రాజకీయ పార్టీలు జోక్యం చేసుకుంటున్నాయని ఆయన మండిపడ్డారు. పేరెంట్స్ మనోభావాలను దెబ్బ తీయొద్దని, ఇది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన సమస్య అని అన్నారు బొత్స. పరీక్షలు పూర్తయిన తర్వాత రాజకీయాలు మాట్లాడదామన్నారు. టెన్త్ ఎగ్జామ్స్ పై నారా లోకేష్ ఆరోపణలు చీప్ గా ఉన్నాయని, ఆరు లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు లోకేష్ […]

విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలొద్దు.. లోకేష్ పై మంత్రి బొత్స ఆగ్రహం..
X

పదో తరగతి పరీక్ష పేపర్ల లీకేజీ వ్యవహారంపై ప్రతిపక్షాల తీరుని ఎండగట్టారు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. అక్కడక్కడ చిన్న సంఘటనలు జరిగితే రాజకీయ పార్టీలు జోక్యం చేసుకుంటున్నాయని ఆయన మండిపడ్డారు. పేరెంట్స్ మనోభావాలను దెబ్బ తీయొద్దని, ఇది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన సమస్య అని అన్నారు బొత్స. పరీక్షలు పూర్తయిన తర్వాత రాజకీయాలు మాట్లాడదామన్నారు. టెన్త్ ఎగ్జామ్స్ పై నారా లోకేష్ ఆరోపణలు చీప్ గా ఉన్నాయని, ఆరు లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు లోకేష్ కి పట్టదా అని ప్రశ్నించారు.

ప్రభుత్వంపై ఈనాడు విషం చిమ్ముతోంది..
ఈనాడు పత్రిక తమ ప్రభుత్వంపై విషం చిమ్ముతోందని అన్నారు మంత్రి బొత్స. తప్పు ఎవరు చేసినా తాము ఉపేక్షించబోమని, తమ ఆకాంక్ష విద్యార్థుల భవిష్యత్తు మాత్రమేనని చెప్పారు. ఈనాడు రాతల ద్వారా సమాజానికి ఏం చెప్పాలనుకుంటోందని ప్రశ్నించారు. క్వశ్చన్ పేపర్ ఇవ్వకముందు ఎక్కడా లీక్ కాలేదని, గతంలో లాగా డబ్బుల ఆశతో ముందుగానే పేపర్ లీక్ కావడం వంటి సంఘటనలు జరగలేదని చెప్పారు. పుకార్లు, ఈనాడు వంటి పత్రికల్లో వచ్చిన వార్తల్ని చూసి విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు బొత్స.

లైసెన్స్ లు రద్దు చేస్తాం..
టెన్త్ పేపర్ల లీకేజి విషయంలో ఇప్పటి వరకూ 69 మందిపై చర్యలు తీసుకున్నామని చెప్పారు మంత్రి బొత్స. అందులో 36 మంది ప్రభుత్వ టీచర్లు కూడా ఉన్నారని అన్నారు. వీరంతా పరీక్ష పేపర్ ని ఫొటో తీసి వాట్సప్ ద్వారా బయటకు పంపించారని, ఐదుగురు టీచర్లు ఆ క్వశ్చన్ పేపర్లు చూసి ఆన్సర్లు తయారు చేస్తూ పట్టుబడ్డారని వివరించారు. టెన్త్ పేపర్ లీకుల విషయంలో నారాయణ, శ్రీ చైతన్య, కేరళ ఇంగ్లిషు మీడియం స్కూల్ పై చర్యలు తీసుకోబోతున్నట్టు తెలిపారు. అవసరమైతే ఆయా స్కూళ్ల లైసెన్స్‌లు రద్దు చేస్తామని హెచ్చరించారు మంత్రి బొత్స.

First Published:  4 May 2022 9:34 AM GMT
Next Story