Telugu Global
National

శ్రీలంకకు తమిళనాడు సాయం..

ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకను ఆదుకునేందుకు తమిళనాడు ప్రభుత్వం ముందుకొచ్చింది. తొలి దశ సాయం కింద బియ్యం, పాల పొడి, వైద్య సామగ్రి, అత్యవసర మందులు పంపించడానికి సిద్ధపడింది. సాయం చేసే విషయంలో ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి విరాళాలు అందించాలని పిలుపునిచ్చారు తమిళనాడు సీఎం స్టాలిన్. కేంద్రం అనుమతితో త్వరలో 40వేల టన్నుల బియ్యం, 500 టన్నుల పాలపొడి, ఇతర మందులు.. శ్రీలంకకు పంపిస్తామని ఆయన స్పష్టం చేశారు. తూత్తుకుడి ఓడరేవు నుంచి కొలంబోలోని ఉత్తర […]

శ్రీలంకకు తమిళనాడు సాయం..
X

ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకను ఆదుకునేందుకు తమిళనాడు ప్రభుత్వం ముందుకొచ్చింది. తొలి దశ సాయం కింద బియ్యం, పాల పొడి, వైద్య సామగ్రి, అత్యవసర మందులు పంపించడానికి సిద్ధపడింది. సాయం చేసే విషయంలో ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి విరాళాలు అందించాలని పిలుపునిచ్చారు తమిళనాడు సీఎం స్టాలిన్. కేంద్రం అనుమతితో త్వరలో 40వేల టన్నుల బియ్యం, 500 టన్నుల పాలపొడి, ఇతర మందులు.. శ్రీలంకకు పంపిస్తామని ఆయన స్పష్టం చేశారు.

తూత్తుకుడి ఓడరేవు నుంచి కొలంబోలోని ఉత్తర మరియు తూర్పు ప్రాంతాల్లో నివసిస్తున్న తమిళులకు ఆహార ధాన్యాలు, కూరగాయలు, నిత్యావసరాలు రవాణా చేసేందుకు అనుమతివ్వాలని గతంలోనే తమిళనాడు ప్రభుత్వం కేంద్రాన్ని అభ్యర్థించింది. ఇప్పుడు సాయం అందించేందుకు సిద్ధమైంది. శ్రీలంక ఆర్థిక విలయాన్ని, పొరుగు దేశ అంతర్గత సమస్యగా చూడలేమంటున్న స్టాలిన్, మానవతా దృక్పథంతో సాయం అందించడానికి తమిళనాడు ముందుకొచ్చిందని చెప్పారు. అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం అనంతరం ఈ విషయం మరింత స్పీడందుకుంది.

కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కూడా శ్రీలంకకు ఆర్థిక సాయం అందించే విషయంలో కేంద్రం సానుకూలంగా ఉందని స్పష్టం చేశారు. తమిళనాడు అందించాలనుకుంటున్న సాయానికి తోడు కేంద్రం కూడా అవసరమైన మేర శ్రీలంకకు నిత్యావసరాలు పంపిస్తుందని చెప్పారు. తూత్తుకుడి నుంచి సముద్ర మార్గాన శ్రీలంకకు నిత్యావసరాలు పంపించే ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు.

First Published:  3 May 2022 10:40 AM GMT
Next Story