Telugu Global
CRIME

నిఘా పెంచినా ఆగని లీకులు.. టెన్త్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్..

పరీక్ష మొదలైన తర్వాత క్వశ్చన్ పేపర్ బయటకొచ్చిందా, ముందుగానే లీకైందా అనే విషయాలను పక్కనపెడితే.. ఏపీలో పదో తరగతి పరీక్షల్లో మాస్ కాపీయింగ్ మాత్రం జోరుగా సాగుతోంది. పరీక్ష కేంద్రాల నిర్వాహకులు, ప్రైవేట్ స్కూల్స్ అధ్యాపకులు, కొన్నిచోట్ల ప్రభుత్వ ఉపాధ్యాయులే ఈ పేపర్ లీకేజీలో ప్రధాన పాత్రదారులుగా ఉండటం గమనార్హం. తాజాగా సోమవారం జరిగిన లెక్కల పరీక్షని కూడా లీకేజీ సమస్య వెంటాడింది. పలు ప్రాంతాల్లో లీకు వీరుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. కృష్ణా జిల్లా పామర్రు […]

నిఘా పెంచినా ఆగని లీకులు.. టెన్త్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్..
X

పరీక్ష మొదలైన తర్వాత క్వశ్చన్ పేపర్ బయటకొచ్చిందా, ముందుగానే లీకైందా అనే విషయాలను పక్కనపెడితే.. ఏపీలో పదో తరగతి పరీక్షల్లో మాస్ కాపీయింగ్ మాత్రం జోరుగా సాగుతోంది. పరీక్ష కేంద్రాల నిర్వాహకులు, ప్రైవేట్ స్కూల్స్ అధ్యాపకులు, కొన్నిచోట్ల ప్రభుత్వ ఉపాధ్యాయులే ఈ పేపర్ లీకేజీలో ప్రధాన పాత్రదారులుగా ఉండటం గమనార్హం. తాజాగా సోమవారం జరిగిన లెక్కల పరీక్షని కూడా లీకేజీ సమస్య వెంటాడింది. పలు ప్రాంతాల్లో లీకు వీరుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

కృష్ణా జిల్లా పామర్రు మండలం పసుమర్రు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల వేదికగా టెన్త్ క్లాస్ మ్యాథ్స్ ప్రశ్నాపత్రం లీకైంది. లీకేజీ జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించిన అధికారులు ఆరుగురు ఉపాధ్యాయులను సస్పెండ్‌ చేశారు. కర్నూలు జిల్లా ఆలూరులో ఓ యువకుడి సెల్ ఫోన్ కి వాట్సప్ ద్వారా టెన్త్ మ్యాథ్య్ క్వశ్చన్ పేపర్ వచ్చింది. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడు ఇచ్చిన సమాచారం మేరకు కర్నూలు జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాల కేంద్రంలో విద్యార్థులకు చిట్టీలు అందించేందుకు వచ్చిన మరో యువకుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు.

ప్రకాశం జిల్లా సి.ఎస్‌.పురంలోని జడ్పీ హైస్కూల్, ఓ ప్రైవేట్ జూనియర్‌ కాలేజీ వద్ద మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్ జిరాక్స్ పత్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్ పట్టుకుంది. ఎగ్జామ్ సెంటర్ చీఫ్ సహా 16 మంది ఇన్విజిలేటర్లను విధుల నుంచి తొలగించారు. కొమరోలులో క్వశ్చన్ పేపర్ లీకేజీకి సహకరిస్తున్న 12 మంది ఇంటర్‌ విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం విశేషం.

గతంలో కేవలం ప్రభుత్వ స్కూల్స్, కాలేజీలలో మాత్రమే పదో తరగతి పరీక్షలు నిర్వహించేవారు. ఈ ఏడాది మాత్రం పెద్ద సంఖ్యలో ప్రైవేటు స్కూల్స్, కాలేజీలు ఎగ్జామ్ సెంటర్స్ గా ఉన్నాయి. దీంతో పేపర్ లీకేజీపై నిఘా కొరవడుతోంది. అదే సమయంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా ఇలాంటి లీకేజీలకు సహకరించడం ఆందోళన కలిగించే విషయం. ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకున్నామని చెబుతున్నా తెలుగు పేపర్ తో మొదలైన ఈ వ్యవహారం మ్యాథ్య్ పేపర్ వరకూ కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు పేపర్ లీకేజీ వ్యవహారంలో మొత్తం 44 మందిని అరెస్టు చేయగా.. వారిలో సుమారు 30మందిని విధులనుంచి తొలగించింది ప్రభుత్వం.

First Published:  2 May 2022 10:15 PM GMT
Next Story