Telugu Global
National

స్టూడెంట్స్ హిప్పోక్రటిక్ ఓథ్ బదులు చక్ర శపథ్ తీసుకున్నారని.. మెడికల్ కాలేజీ డీన్ తొలగింపు

‘నేను రోగికి ఏ హానీ చేయను.. తెలియని వైద్యం చేయను.. నా వృత్తినే నేను గౌరవంగా భావిస్తాను.. అన్నింటికంటే నాకు వృత్తి ధర్మమే ముఖ్యం..’ అంటూ ప్రతీ మెడిసిన్ విద్యార్థి ఎంబీబీఎస్‌లో చేరే ముందు ఒక ప్రతిజ్ఞ చేస్తారు. దాన్నే ‘హిప్పోక్రటిక్ ఓథ్’ అని పిలుస్తుంటారు. ఇప్పుడు ఆ ఓథ్ మీద ఒక వివాదం ముందుకు వచ్చింది. క్రీస్తు పూర్వం 460 నుంచి 370 వరకు జీవించిన గ్రీక్ ఫిజీషియన్ హిప్పోక్రాట్స్ ప్రమాణం రూపొందించాడు. అప్పటి నుంచి […]

స్టూడెంట్స్ హిప్పోక్రటిక్ ఓథ్ బదులు చక్ర శపథ్ తీసుకున్నారని.. మెడికల్ కాలేజీ డీన్ తొలగింపు
X

‘నేను రోగికి ఏ హానీ చేయను.. తెలియని వైద్యం చేయను.. నా వృత్తినే నేను గౌరవంగా భావిస్తాను.. అన్నింటికంటే నాకు వృత్తి ధర్మమే ముఖ్యం..’ అంటూ ప్రతీ మెడిసిన్ విద్యార్థి ఎంబీబీఎస్‌లో చేరే ముందు ఒక ప్రతిజ్ఞ చేస్తారు. దాన్నే ‘హిప్పోక్రటిక్ ఓథ్’ అని పిలుస్తుంటారు. ఇప్పుడు ఆ ఓథ్ మీద ఒక వివాదం ముందుకు వచ్చింది. క్రీస్తు పూర్వం 460 నుంచి 370 వరకు జీవించిన గ్రీక్ ఫిజీషియన్ హిప్పోక్రాట్స్ ప్రమాణం రూపొందించాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతీ వైద్య విద్యార్థి తన తొలి ఏడాది మొదట్లో దీన్ని చెప్పి మెడిసిన్ ఎడ్యుకేషన్ ప్రారంభిస్తాడు.

ఇక అసలు విషయంలోకి వస్తే.. తమిళనాడు లోని ఓ కాలేజీలో వైద్య విద్యార్థులు తమ మొదటి ఏడాది క్లాసులు ప్రారంభించే ముందు ఈ హిప్పోక్రటిక్ ఓథ్ బదులు చక్రశపథ్ తీసుకున్నారని ఆ కళాశాల డీన్ ను తొలగించారు. చక్రశపథ్ అనేది ఆయుర్వేదానికి సంబంధించిన ఓథ్. దీన్నే మహర్షి చక్ర శపథ్ అని కూడా పిలుస్తాను. అలాంటి శపథాన్ని.. అల్లోపతి వైద్య విద్యార్థులు చెప్పడం తీవ్ర దుమారాన్ని రేపింది.

మధురై మెడికల్ కాలేజీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఇలా చక్రశపథ్ తీసుకోవడంతో ఆ కాలేజీ డీన్ రత్నవేల్‌ను తొలగించి, అతడికి ఏ పోస్టూ ఇవ్వకుండా హోల్డ్ లో పెట్టారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ ఆ డీన్.. కావాలనే విద్యార్థులతో చక్రశపథ్ పలికించాడనే ఆరోపణలు వచ్చాయి. కాగా, ఈ ఘటనను తమిళనాడు ఆరోగ్య శాఖ తీవ్రంగా ఖండించింది. రత్నవేల్ కచ్చితంగా నిబంధనలు అతిక్రమించాడని తమిళనాడు ఆరోగ్య మంత్రి మా సుబ్రహణ్యియన్ వ్యాఖ్యానించారు.

First Published:  2 May 2022 1:53 AM GMT
Next Story