Telugu Global
CRIME

పాపం.. కరోనాతో కొలువు రాలే.. 'మళ్లీ జన్మలో తప్పకుండా సైనికుడిని అవుతాను' అని నోట్ రాసి సూసైడ్..

కరోనా వల్ల ఇండియాలో లక్షలాది మంది చనిపోయారు. కానీ ఆ పాండమిక్ కారణంగా రోడ్డు మీదపడిన వాళ్ల లెక్కేలేదు. ఇప్పటికీ ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయి కోట్లాది మంది కోలుకోలేకుండా ఉన్నారు. ఉన్న ఉద్యోగాలు ఊడి.. కొత్త కొలువులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలా కరోనా కారణంగా ఉద్యోగంపై ఆశలు కోల్పోయిన ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన హర్యానా రాష్ట్రం భివానీ జిల్లాలో చోటు చేసుకున్నది. పోలీసులు, గ్రామస్థులు చెప్పిన వివరాలు మేరకు.. జిల్లాలోని తాలు […]

పాపం.. కరోనాతో కొలువు రాలే.. మళ్లీ జన్మలో తప్పకుండా సైనికుడిని అవుతాను అని నోట్ రాసి సూసైడ్..
X

కరోనా వల్ల ఇండియాలో లక్షలాది మంది చనిపోయారు. కానీ ఆ పాండమిక్ కారణంగా రోడ్డు మీదపడిన వాళ్ల లెక్కేలేదు. ఇప్పటికీ ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయి కోట్లాది మంది కోలుకోలేకుండా ఉన్నారు. ఉన్న ఉద్యోగాలు ఊడి.. కొత్త కొలువులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలా కరోనా కారణంగా ఉద్యోగంపై ఆశలు కోల్పోయిన ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన హర్యానా రాష్ట్రం భివానీ జిల్లాలో చోటు చేసుకున్నది. పోలీసులు, గ్రామస్థులు చెప్పిన వివరాలు మేరకు.. జిల్లాలోని తాలు గ్రామానికి చెందిన పవన్ (23) అనే యువకుడు గత కొన్నేళ్లుగా ఆర్మీ సెలెక్షన్స్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు. ఊరిలోని గవర్నమెంట్ స్కూల్ గ్రౌండ్‌లో ఈవెంట్స్ ప్రాక్టీస్ చేస్తుంటాడు. అక్కడి ట్రాక్‌పై పరుగులు పెడుతూ.. కసరత్తులు చేస్తాడు.

కరోనాకు ముందు రాత పరీక్ష, మెడికల్, ఫిజికల్ టెస్టులు పాసయ్యాడు. అయితే ఫైనల్ కటాఫ్ మార్కులు తక్కువ రావడంతో రెండు సార్లు ఆర్మీకి సెలెక్ట్ కాలేకపోయాడు. అయితే అతడికి మరి కొన్ని అవకాశాలు ఉండటంతో మళ్లీ అటెంప్ట్ చేయడానికి ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇంతలోనే కరోనా పాండమిక్ కారణంగా ఆర్మీ అధికారులు రిక్రూట్‌మెంట్ నిలిపివేశారు. అప్పటి నుంచి తిరిగి నియామకాలు ఎప్పడు ప్రారంభం అవుతాయా అని ఎదురు చూస్తున్నాడు.

అయితే కరోనా కారణంగా మూడేళ్లు ఆర్మీ రిక్రూట్‌మెంట్ లేకపోవడంతో అతడి ఏజ్ బార్ అయ్యింది. ఆర్మీ సెలెక్షన్స్‌లో పాల్గొనే అర్హతను కోల్పోయాడు. దీంతో అప్పటి నుంచి మదనపడుతున్న పవన్.. ఆదివారం తాను ప్రాక్టీస్ చేసే గ్రౌండ్‌లో ట్రాక్ పక్కన చెట్టుకు ఉరేసుకొని చనిపోయాడు.

‘నాన్నా.. ఈ జన్మలో నేను ఆర్మీకి సెలెక్ట్ కాలేకపోయాను. మళ్లీ నేను పుడితే ఈ సారి తప్పకుండా సైనికుడిని అవుతాను’ అంటూ ట్రాక్‌పై సూసూడ్ నోట్ రాసి చనిపోయాడు. పవన్ చెట్టుకు వేలాడుతుండటం చూసిన జూనియర్లు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కానీ అప్పటికే అతడు చనిపోయాడు. కొడుకు శవాన్ని చూసి తండ్రి కన్నీరుమున్నీరయ్యాడు. సైనికుడు అవ్వాలని కలలు కన్న పవన్.. అర్ధాంతరంగా తనువు చాలించడంపై గ్రామస్థులు కూడా బాధపడ్డారు. తన కొడుకు ఆత్మహత్యపై ఎఫ్ఐఆర్ నమోదు చేయవద్దని తండ్రితో పాటు గ్రామస్థులు కూడా వేడుకోవడంతో పోలీసులు పోస్ట్‌మార్టం చేయకుండానే అతడి శవాన్ని అప్పగించారు.

First Published:  1 May 2022 10:35 PM GMT
Next Story